PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus92ed62ce-0332-42df-9df2-5b564d14fc6f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus92ed62ce-0332-42df-9df2-5b564d14fc6f-415x250-IndiaHerald.jpgఅమెరికా దేశ ప్రజలకు కరోనా నుండి భారీ ఊరట లభించిందనే చెప్పాలి. ప్రస్తుతం అగ్రరాజ్యంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఆ దేశ ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా గణాంకాల ప్రకారం రోజూ దాదాపుగా 50 వేల నుంచి లక్ష లోపే కరోనా కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది.CORONAVIRUS;amala akkineni;india;american samoa;prime minister;letter;success;zeroఅమెరికాలో కరోనా కేసులు తగ్గడానికి కారణమిదే ?అమెరికాలో కరోనా కేసులు తగ్గడానికి కారణమిదే ?CORONAVIRUS;amala akkineni;india;american samoa;prime minister;letter;success;zeroThu, 13 May 2021 15:00:00 GMTఅమెరికా దేశ ప్రజలకు కరోనా నుండి భారీ ఊరట లభించిందనే చెప్పాలి. ప్రస్తుతం అగ్రరాజ్యంలో కరోనా పాజిటివ్ కేసులు భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. ఆ దేశ ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా గణాంకాల ప్రకారం రోజూ దాదాపుగా 50 వేల నుంచి లక్ష లోపే కరోనా కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా మరణాల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టిందని సమాచారం. గతంలో ప్రతిరోజూ వేల మంది కరోనాతో మరణిస్తుండగా, ఇప్పుడు ఆ సంఖ్య ఏడు వందల కంటే తక్కువకు పడిపోయింది. కొన్ని రాష్ట్రాలలో అయితే జీరో మరణాలు, అంటే అసలు గత రెండు మూడు రోజుల నుండి కరోనా మరణాలు లేవు. కొన్ని రాష్ట్రాలలో మాత్రమే తక్కువ సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది కూడా త్వరలో జీరోకి చేరనుందని అంచనా వేస్తున్నారు అక్కడి ఆరోగ్య నిపుణులు.  ఇలా అగ్రరాజ్య పౌరులు ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
 
అయితే కొన్ని నెలల కిందట వరకు అమెరికా కరోనా కండిషన్స్ కి ఇప్పుడున్న వాటికి చాలా వ్యత్యాసం ఉంది. కరోనా కేసులు అలాగే కరోనా మరణాలు సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాయి. కరోనా తొలి దశలో అత్యంత ప్రభావితం చెందిన దేశం ఏదైనా ఉందంటే ప్రధానంగా వినిపించే పేరు అమెరికా. అలాంటిది ఇంత త్వరగా ఈ విపత్తు నుండి అగ్రరాజ్యం గట్టెక్కింది అంటే దాని వెనుక చాలా రహస్యాలే ఉన్నాయి. ముందుగా ఆ దేశ ప్రధాని జో బైడెన్ పాత్ర ఎక్కువగా ఉందని చెప్పాలి. ఈయన అధికారంలోకి వచ్చాక  వీలయినంత ఎక్కువ మందికి కరోనా వ్యాక్సిన్ ను అందించాలన్న లక్ష్యం దిశగా అడుగులు వేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశారు.


ఇప్పటికే అగ్రరాజ్యంలో 45 శాతం మంది ప్రజలకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. కరోనా తగ్గుముఖం పట్టడానికి ఇది కూడా ఒక కారణమే.


* వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా మాస్కులు వాడుతూ జాగ్రత్త వహించారు.


* వ్యాక్సిన్ వేయించుకొని సాధారణ ప్రజలు రోడ్ల పైకి వచ్చే ముందు ఖచ్చితంగా శానిటైజర్ అప్లై చేసుకుని, రెండు మాస్కులు ధరించేలా  ‘డబుల్ మాస్క్ థియరీ‘ని అమలు పరిచేలా చర్యలు తీసుకుంది అగ్రరాజ్యం.


ఆరోగ్య సదుపాయాలు ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూ, మెరుగైన చికిత్సలు అందిస్తూ ఓ ప్రణాళికాబద్ధంగా కరోనాను జయించేందుకు  కదం తొక్కింది అగ్రరాజ్యం అమెరికా. అందుకే ఈ రోజు కరోనాను నిలువరించడంలో కొంత వరకు సక్సెస్ అయిందని చెప్పాలి. మన భారత్ అమెరికాను చూసి అయినా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ట్రెండ్ అవుతున్న రాధే రివ్యూ... ఇంత దారుణంగా ఉందా?

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>