PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-virus-kattadi-kosam-271-projects11307ec2-3d26-4a0f-afd5-f9e3f6c926ef-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-virus-kattadi-kosam-271-projects11307ec2-3d26-4a0f-afd5-f9e3f6c926ef-415x250-IndiaHerald.jpgఆక్సిజన్ అందక నేడు చాలా మంది కరోనా పేషెంట్లు ప్రాణాలు వదులుతున్నారు. బెడ్లు లేకపోవడం వల్ల, సరైనవిధంగా మాస్కులు వాడకపోవడం వలన అనేక ఇబ్బందులను ప్రజలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితిలో దేశంలో కరోనాను అంతం చేయడానికి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. విద్యార్జుల దగ్గరి నుంచి పెద్ద పెద్ద శాస్త్రవేత్తల వరకూ అందరూ తమ పరిశోధనలలో మునిగిపోయారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు కూడా కరోనా కట్టడికి వైద్యులకు, పోలీసులకు, ఔషధ రంగానికి అవసరమైన పరికరాలను తయారు చేస్తున్నాయి. తక్కువ ధరలో వ్యక్తిగత రక్షణ పరికరాలను అందజేయడం కోసం పరిcarona virus;koti;police;2020;minister;central government;oxygen;marchకరోనా కట్టడి కోసం 271 ప్రాజెక్టులు..?కరోనా కట్టడి కోసం 271 ప్రాజెక్టులు..?carona virus;koti;police;2020;minister;central government;oxygen;marchThu, 13 May 2021 13:00:00 GMT
ఆక్సిజన్ అందక నేడు చాలా మంది కరోనా పేషెంట్లు ప్రాణాలు వదులుతున్నారు. బెడ్లు లేకపోవడం వల్ల, సరైనవిధంగా మాస్కులు వాడకపోవడం వలన అనేక ఇబ్బందులను ప్రజలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితిలో దేశంలో కరోనాను అంతం చేయడానికి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. విద్యార్జుల దగ్గరి నుంచి పెద్ద పెద్ద శాస్త్రవేత్తల వరకూ అందరూ తమ పరిశోధనలలో మునిగిపోయారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు కూడా కరోనా కట్టడికి వైద్యులకు, పోలీసులకు, ఔషధ రంగానికి అవసరమైన పరికరాలను తయారు చేస్తున్నాయి. తక్కువ ధరలో వ్యక్తిగత రక్షణ పరికరాలను అందజేయడం కోసం పరిశోధనలు చేపట్టాయి.  2020 మార్చి నుంచే కరోనా వైరస్‌ ను కట్టడి చేసే పరిశోధనలలో భాగంగా ఐఐటీలు కృషి  చేస్తున్నాయి. గత ఏడాదిలో 190 ప్రాజెక్టులు చేపట్టగా ఇప్పుడు వాటి సంఖ్య 271కి చేరింది. ఎన్‌ఐటీలు కూడా 176 ప్రాజెక్టులు చేపట్టాయి. ఈ సందర్భంగా ఐఐటీ గణిత ఆచార్యుడు విద్యాసాగర్‌ మాట్లాడారు. కాన్పుర్‌ ఐఐటీతో కలిసి కరోనా రెండో దశపై కొన్ని నమూనాలను పరిగణలోకి తీసుకుని అంచనా వేశామన్నారు.

మే నెలలో 15-18 మధ్య కరోనా తీవ్ర స్థాయికి చేరుకుంటుందన్నారు. ఈనెలలో 35 లక్షలు కేసులు నమోదవ్వచ్చనే అంచనా వేసినట్లు తెలిపారు. తమ పరిధిలో తయారుచేసిన శానిటైజర్‌ను రోజుకు 200 లీటర్ల వంతున ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన వారికి 5,500 మాస్కులు, పోలీసు, వైద్య, ఇతర ప్రభుత్వ సిబ్బందికి 10 వేల ఫేస్‌షీల్డ్‌లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎన్‌95కు సమానమైన తక్కువ ఖరీదైన యూఎస్‌9 మాస్కును రూపొందించినట్లు పేర్కొన్నారు. పరిశోధనలలో భాగంగా హ్యాండ్‌, మాస్కు శానిటైజర్లతోపాటు పరిసరాలను క్రిమిరహితం చేసే యాంటీవైరస్‌ కోటింగ్‌ సొల్యూషన్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి పొఖ్రియాల్‌ ఆవిష్కరించినట్లు తెలిపారు. వీరు తయారు చేసిన వస్తువులన్నీ కూడా సూపర్ మార్కెట్లలో దొరుకుతున్నాయని తెలియజేశారు. ప్రజల అవసరాలను గుర్తించుకుని కొన్ని ప్రభుత్వాలకు, ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

" పాక్ పౌరసత్వం మార్చుకుంటా ".. పాక్ బౌలర్ సంచలన కామెంట్స్ !!

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>