PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics204dbbd9-a865-4d83-9f50-0704eb63cd73-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-politics204dbbd9-a865-4d83-9f50-0704eb63cd73-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరిక్షలకు సంబంధించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టిగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలను రద్దు చేయాల్సిందే అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులను పాస్ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ లేఖ రాసారు. మరో 3 వారాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నందున కోవిడ్ తీవ్రత దృష్ట్యా విద్యార్థులందరినీ పాస్ చేయండి అని కోరారు. పొరుగున ఉన్న తెలంగాణ సహా దేశంలోమరో 12రాషlokesh,tdp,ap;lokesh;nara lokesh;andhra pradesh;telangana;chief minister;letter;tdp;lokesh kanagarajమళ్ళీ మ్యూజిక్ మొదలు పెట్టిన లోకేష్మళ్ళీ మ్యూజిక్ మొదలు పెట్టిన లోకేష్lokesh,tdp,ap;lokesh;nara lokesh;andhra pradesh;telangana;chief minister;letter;tdp;lokesh kanagarajThu, 13 May 2021 18:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరిక్షలకు సంబంధించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టిగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలను రద్దు చేయాల్సిందే అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులను పాస్ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ లేఖ రాసారు. మరో 3 వారాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నందున కోవిడ్ తీవ్రత దృష్ట్యా విద్యార్థులందరినీ పాస్ చేయండి అని కోరారు.

పొరుగున ఉన్న తెలంగాణ సహా దేశంలోమరో 12రాష్ట్రాలు ఇప్పటికే పదో తరగతి పరీక్షల్ని రద్దుచేశాయి అని ఆయన వివరించారు. పలు మార్లు విద్యార్థులు, తల్లిదండ్రులతో నిర్వహించిన న్లైన్ సమావేశాల్లో కోవిడ్ భయానికి తోడు పరీక్షల పట్ల ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో నా దృష్టికి తీసుకొచ్చారు అని తెలిపారు. కోవిడ్ మహమ్మారి ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి అని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ చూడని ప్రత్యేక పరిస్థితుల్ని మన భవిష్యత్తు తరం చూడాల్సి వస్తోంది అని ఆయన అన్నారు.

రాష్ట్రంలో 5వేల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నప్పుడు గత ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దు చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇప్పుడు 2 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయని అన్నారు. వేలాది కేంద్రాల్లో 6.7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవటం ఎంతో ప్రమాదకరం అని వివరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు భయపడే పరీక్షల నిర్వహణపై సమయాన్ని వృథా చేయొద్దు అని కోరారు. పరీక్షలు నిర్వహించరాదనే విద్యార్థుల, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చి పరీక్షల రద్దు నిర్ణయం ప్రకటించాలి.... విద్యార్థులను పాస్ చెయ్యాలి అని కోరారు. హైకోర్టు లేదా ప్రతిపక్ష నాయకులు ఆందోళనలతో కాకుండా మానవత్వంతో ఆలోచించి వెంటనే రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించండి అని కోరారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ 5 పాటల్లో హీరోల ఇంటిపేర్లు వాడారా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>