PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-09bc1825-6ef8-4fcc-9745-410dd4b653ea-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-09bc1825-6ef8-4fcc-9745-410dd4b653ea-415x250-IndiaHerald.jpgజగన్ విషయంలో ఒక ప్రచారం ఉంది. ఆయన తనకంటూ ఒక పరిధిని పెట్టుకుని పనిచేస్తారని కూడా చెబుతారు. రెండేళ్ల జగన్ పాలనను చూస్తే ఆయన పెదవి విప్పకుండానే పని కానిచ్చేస్తున్నారు. ఇక మంత్రులు రాజకీయ విమర్శలు చేయడం తప్ప ప్రభుత్వ విధానాల మీద మాట్లాడిన సందర్భాలు బహు తక్కువ. jagan;tara;telugu desam party;jagan;telugu;media;press;tdp;central government;ycp;oxygen;party;mantraఒక్కసారిగా అలెర్ట్ అయిన జగన్... ?ఒక్కసారిగా అలెర్ట్ అయిన జగన్... ?jagan;tara;telugu desam party;jagan;telugu;media;press;tdp;central government;ycp;oxygen;party;mantraThu, 13 May 2021 19:00:00 GMTజగన్ విషయంలో ఒక ప్రచారం ఉంది. ఆయన తనకంటూ ఒక పరిధిని పెట్టుకుని పనిచేస్తారని కూడా చెబుతారు. రెండేళ్ల జగన్ పాలనను చూస్తే ఆయన పెదవి విప్పకుండానే పని కానిచ్చేస్తున్నారు. ఇక మంత్రులు రాజకీయ విమర్శలు చేయడం తప్ప ప్రభుత్వ విధానాల మీద మాట్లాడిన సందర్భాలు బహు తక్కువ.

ఇపుడు అదే కొంప ముంచుతోంది అని జగన్ గ్రహించారా అన్న డౌట్లు వస్తున్నాయి. అక్కడ చూస్తే బలమైన మీడియా మద్దతు తో టీడీపీ ఉంది. ఆ పార్టీ ఏం మాట్లాడినా బ్యానర్ ఐటెమ్స్ వస్తాయి. ఇక మెజారిటీ మీడియా కూడా టీడీపీకు అనుకూలంగా ఉంటుంది. దాంతో సహజంగానే ప్రభుత్వ వాయిస్ అన్నది జనాలకు అనుకున్నట్లుగా చేరదు. మరి ఈ సంగతి ఇంతకాలం జగన్ గుర్తించలేదు. కాలం కూడా అలా కలసివచ్చింది. ఎందుకంటే ఇంతకాలం రాజకీయ విమర్శలే అటూ ఇటూ ఉంటూ వచ్చాయి.

వాటికి జనాలతో సంబంధం లేదు. కానీ ఇపుడు కరోనా రెండవ దశ భీకరంగా ఉంది. పైగా ఇది ప్రతి ఇంటి సమ‌స్య. ప్రతీ మనిషి సమస్య. గత ఏడాది కంటే కూడా కరోనా వెల్లువలా విజృంభించడంతో జనాలు కూడా అల్లాడుతున్నారు. కళ్ల ముందే మరణాలు చోటు చేసుకోవడంతో ఎవరికి వారు భయపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఆక్సిజన్  అందక రుయా ఆసుపత్రి లాంటి చోట్ల చోటు చేసుకున్న దారుణ మరణాలు ఏకంగా రాష్ట్ర ప్రజలను వణికించేశాయి.  

దాంతో విపక్షాలు కూడా ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇదంతా జరిగింది అంటూ గట్టిగా కామెంట్స్ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో చాలా ముందుంది.  దాంతో పాటు ఆ పార్టీ అనుకూల మీడియా కధనాలు కూడా ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం డిఫెన్స్ లో పడింది. జనాల్లోకి విపక్ష వాదన బలంగా వెళ్ళిపోయింది. కాస్తా లేట్ గా అయినా ప్రభుత్వానికి ఈ విషయం తెలియడంతో ఒక్కసారిగా అలెర్ట్ అయింది.

ఆక్సిజన్ కొరతకు కారణం తాము కాదని, కేంద్రం సరఫరా చేయాలని వైసీపీ నేతలు ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నారు. వ్యాక్సిన్ మీద వస్తున్న విమర్శలకూ జవాబు చెబుతున్నారు. అలాగే  కరోనా కట్టడికి ప్రభుత్వం ఎంత చేస్తోంది అన్నది కూడా గట్టిగా చెప్పుకొస్తున్నారు. ఇక వైసీపీ అనుకూల మీడియాలో ప్రభుత్వ వాదన బలంగా ఉండేలా చూసుకుంటున్నారు. మొత్తానికి ప్రజల వద్దకు  విపక్ష వాదన వెళ్ళింది. పైగా జనాలు కరోనా కలవరంలో ఉన్నారు. ఇపుడు ప్రభుత్వం గట్టి భరోసా ఇచ్చి తాము చేస్తున్నది, చేయబోయేది ఏంటి అన్నది వివరించాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే భారీ డ్యామేజ్ జరుగుతుంది అంటున్నారు.













Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీఎన్ఆర్ కుటుంబానికి అండగా నిలిచిన ఐ డ్రీమ్ చైర్మన్..

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>