Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/srireddy-comments-on-salman-radhe-movied243a3a8-34ae-4ecd-9f1e-7fd106aecd34-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/srireddy-comments-on-salman-radhe-movied243a3a8-34ae-4ecd-9f1e-7fd106aecd34-415x250-IndiaHerald.jpgశ్రీరెడ్డి చూపు ఇప్పుడు బాలీవుడ్‌పై పడింది. ఇప్పటికే టాలీవుడ్‌లో హీరోలు, హీరోయిన్లు, పొలిటికల్ లీడర్లు.. ఇలా అందరిపై ఇష్టం వచ్చినట్లు విరుచుకుపడే శ్రీరెడ్డి ఇప్పుడు బాలీవుడ్‌ను కూడా టార్గెట్ చేసింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం రాధేను డస్ట్ బిన్ లాంటి సినిమా అంటూ సంచలన కామెంట్స్ చేసింది. రాధే ఓ చెత్త సినిమా అని, తన జీవితంలో ఇంత చెత్త సినిమా ఎప్పుడూ చూడలేదని..radhe;review;prabhu deva;salman khan;jeevitha rajaseskhar;bollywood;cinema;director;hero;butter;sri reddy;wanted;reddyబాలీవుడ్‌నీ వదలని శ్రీరెడ్డి.. రాధే ఓ డస్ట్ బిన్ అంటూ..బాలీవుడ్‌నీ వదలని శ్రీరెడ్డి.. రాధే ఓ డస్ట్ బిన్ అంటూ..radhe;review;prabhu deva;salman khan;jeevitha rajaseskhar;bollywood;cinema;director;hero;butter;sri reddy;wanted;reddyThu, 13 May 2021 23:29:12 GMTశ్రీరెడ్డి చూపు ఇప్పుడు బాలీవుడ్‌పై పడింది. ఇప్పటికే టాలీవుడ్‌లో హీరోలు, హీరోయిన్లు, పొలిటికల్ లీడర్లు.. ఇలా అందరిపై ఇష్టం వచ్చినట్లు విరుచుకుపడే శ్రీరెడ్డి ఇప్పుడు బాలీవుడ్‌ను కూడా టార్గెట్ చేసింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం రాధేను డస్ట్ బిన్ లాంటి సినిమా అంటూ సంచలన కామెంట్స్ చేసింది. రాధే ఓ చెత్త సినిమా అని, తన జీవితంలో ఇంత చెత్త సినిమా ఎప్పుడూ చూడలేదని కామెంట్లు చేసింది. అయితే సల్మాన్ ఖాన్ గొప్ప హీరో అని, అందులో సందేహం లేదని, కానీ ఈ సినిమా ఇంత దరిద్రంగా ఉండడానికి డైరెక్టర్ ప్రభుదేవానే కారణం అని రెచ్చిపోయింది.

సల్మాన్ ఖాన్ నటించిన రాధే చిత్రం ఈ రోజే విడుదలైన విషయం తెలిసిందే. జీ5 ఓటీటీలో ఈ చిత్రం విడుదలైంది. ఈ నేపథ్యంలో శ్రీ రెడ్డి ఈ సినిమాపై స్పందించింది. సినిమా గురించి వన్‌ లైన్ రివ్యూ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. సినిమా నిర్మాణ చరిత్రలోనే ఇప్పటి వరకు రానటువంటి అతి చెత్త మూవీ రాధే అంటూ అందులో చెప్పుకొచ్చింది. ‘సల్మాన్ ఖాన్ గొప్ప నటుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ సినిమా ఇంత చెత్తగా ఉండడానికి దర్శకుడు ప్రభుదేవానే కారణం. చెత్త స్టోరీ, దారుణ డైరెక్షన్. కలిసి సినిమాను ఓ డస్ట్ బీన్‌‌లా మార్చాయి. ఛీ ఛీ ఇదో సినిమానా’ అంటూ ప్రభుదేవాను విమర్శించింది.
 
కాగా.. శ్రీ రెడ్డి రివ్యూకు నెటిజన్లు కూడా వంత పాడుతున్నారు. రాధే సినిమాపై శ్రీరెడ్డి తన రివ్యూ పోస్టు చేసిన తర్వాత నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘నువ్వు చెప్పిన తర్వాత ఇక సినిమా చూడను డియర్. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు ‘ఈ సినిమాకు రాధే కంటే గధే అని టైటిల్ పెట్టాలి’ అని ఘాటు కామెంట్ చేశాడు. అలాగే మరికొంతమంది.. ‘మరీ అంత ఘోరంగా ఉందా అక్కాయ్’ అంటూ రిప్లైలు ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే.. రాధే రిలీజ్ తర్వాత ప్రభుదేవాపై నెటిజన్ల కూడా భారీ స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వాంటెడ్ లాంటి నాసిరకంగా సినిమా తీసిన ప్రభుదేవా మళ్లీ రాధే లాంటి మూవీ తీసి సల్లూ భాయ్‌ని వెన్నుపోటు పొడిచాడని కామెంట్లు చేస్తూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. డైరెక్షన్ విషయంలో ప్రభుదేవా దారుణంగా విఫలమయ్యాడని, సల్మాన్ ఖాన్ కెరీర్ నాశనం చేయడానికే ప్రభుదేవా రాధే తీశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్ల ట్రోలింగ్‌తో ప్రభుదేవా సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతున్నాడు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>