PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-f507bb99-a23e-481c-84d8-6e798e502134-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-f507bb99-a23e-481c-84d8-6e798e502134-415x250-IndiaHerald.jpgమోడీ ప్రభుత్వం ఏడేళ్ళ పాలనను మరికొద్ది రోజుల్లో పూర్తి చేసుకోబోతోంది. రెండవ విడత అధికారంలోకి వచ్చాక మోడీ చెప్పుకోదగిన కార్యక్రమాలు ఏవీ పెద్దగా లేవనే అంటున్నారు. మోడీ ప్రభుత్వం కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని తొలగించడం, అయోధ్యలో రాముని కోవెలకు శంఖు స్థాపన చేయడం వంటివి మాత్రం తొలి ఏడాదిలో జరిగాయి. modi;modi;ramu;bharatiya janata party;kamma;jammu and kashmir - srinagar/jammuఫ్లాష్ బ్యాక్ ని మోడీ మరచిపోవాల్సిందే... ?ఫ్లాష్ బ్యాక్ ని మోడీ మరచిపోవాల్సిందే... ?modi;modi;ramu;bharatiya janata party;kamma;jammu and kashmir - srinagar/jammuThu, 13 May 2021 22:00:00 GMTమోడీ ప్రభుత్వం ఏడేళ్ళ పాలనను మరికొద్ది రోజుల్లో పూర్తి చేసుకోబోతోంది. రెండవ విడత అధికారంలోకి వచ్చాక మోడీ చెప్పుకోదగిన కార్యక్రమాలు ఏవీ పెద్దగా లేవనే అంటున్నారు. మోడీ ప్రభుత్వం కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని తొలగించడం, అయోధ్యలో రాముని కోవెలకు శంఖు స్థాపన చేయడం వంటివి మాత్రం తొలి ఏడాదిలో జరిగాయి.

ఇదిలా ఉంటే వరసగా రెండు మార్లు వచ్చిపడిన కరోనా మోడీ సర్కార్ ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసింది. తొలి విడత కరోనా టైమ్ లో మోడీ యాక్టివ్ గా ఉంటూ సరైన సమయాన గట్టి  నిర్ణయాలు తీసుకుని కరోనాని అదుపు చేయగలిగారు. దానికి గానూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం మోడీని మెచ్చుకుంది. అయితే రెండవ విడత విషయంలో కూడా బీజేపీ పెద్దలు  అంచనా వేశారు కానీ ఇంత బీభత్సం సృష్టిస్తుంది అని అసలు ఊహించలేకపోయారు. తేరుకునేలోగానే భారీ ఎత్తున కరొనా దేశాన్ని కమ్ముకుంది.

కేసులు కూడా రోజుకు మూడు నాలుగు  లక్షల్లో వస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయంగా కూడా మోడీ  ఎన్నడూ లేని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయనకు ఒకపుడు వినిపించిన జయజయ ద్వానాలు స్థానంలో ఇపుడు వ్యతిరేక స్వరం మోతగా వినిపిస్తోంది. మోడీకు ఎదురు లేదు, ఆయన ప్రజాకర్షణ, మోజు అన్నవి పూర్తిగా ఫ్లాష్ బ్యాక్ కే పరిమితం అయిపోతున్నాయి. మోడీ కరోనా కట్టడిని చేసే విషయంలో పూర్తిగా విఫలం అయ్యారని విపక్షాలు ఒక్క లెక్కన దండెత్తున్నాయి.

ఈ పరిణామాలు బీజేపీ ప్రభుత్వాన్ని గుక్కతిప్పుకోనీయడంలేదు. మోడీ వంటి బలమైన నేతకు ఈ పరిస్థితి ఏంటి అన్నది బీజేపీలో కూడా చర్చగా ఉంది. కరోనా రెండవ దశను సరిగ్గా అదుపు చేయకపోతే మూడవ దశ కూడా పొంచి ఉంటుంది. దాంతో ఎలా చూసుకున్నా ముందున్నది ఇబ్బందికరమైన కాలమే అని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే మోడీకి మూడేళ్ల పదవీ కాలం మిగిలి ఉంది. ఈ మధ్యలో ఏమైనా మెరుపులు మెరిపిస్తేనే 2024 మీద ఆశలు మిగిలి ఉంటాయనే చెప్పాలి. లేకపోతే గత వైభవాన్ని మాత్రమే తలచుకోవాలి.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>