PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-ivermectin-ekkuvaga-upayoginchavaddu-who-hecharika4de830d5-5a2f-4e69-b612-34c78b8b8230-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-ivermectin-ekkuvaga-upayoginchavaddu-who-hecharika4de830d5-5a2f-4e69-b612-34c78b8b8230-415x250-IndiaHerald.jpgదేశంలో కొవిడ్ వల్ల చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కర్ఫ్యూ, లాక్ డౌన్ వంటివి అమలు చేసిన కరోనాను అంతం చేసే చర్యలను ముమ్మరం చేశాయి. అయినప్పటికీ కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఇటువంటి సమయంలో డబ్ల్యుహెచ్ఓ ఓ తీపి కబురు చెప్పింది. కొవిడ్‌ బాధితులతో పోల్చితే ‘ఐవర్‌మెక్టిన్‌’ తీసుకున్నవారిలో మరణాలు తక్కువగా నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ విషయం తాజాగా విడుదల చేసిన ‘థెరపెటిక్‌, కొవిడ్‌-19 లివింగ్‌ గైడ్‌లైన్స్‌’లో స్పష్టంగా తెలిపిందిcaronavirus,Ivermectin , who;amala akkineni;soumya;sowmya;swaminathan;goa;twitter;tangirala sowmyaఐవర్‌మెక్టిన్‌ అతిగా వాడొద్దు: డబ్ల్యుహెచ్ఓ హెచ్చరికఐవర్‌మెక్టిన్‌ అతిగా వాడొద్దు: డబ్ల్యుహెచ్ఓ హెచ్చరికcaronavirus,Ivermectin , who;amala akkineni;soumya;sowmya;swaminathan;goa;twitter;tangirala sowmyaThu, 13 May 2021 11:42:59 GMTదేశంలో కొవిడ్ వల్ల చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. కర్ఫ్యూ, లాక్ డౌన్ వంటివి అమలు చేసిన కరోనాను అంతం చేసే చర్యలను ముమ్మరం చేశాయి. అయినప్పటికీ కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఇటువంటి సమయంలో డబ్ల్యుహెచ్ఓ ఓ తీపి కబురు చెప్పింది. కొవిడ్‌ బాధితులతో పోల్చితే ‘ఐవర్‌మెక్టిన్‌’ తీసుకున్నవారిలో మరణాలు తక్కువగా నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ విషయం తాజాగా విడుదల చేసిన ‘థెరపెటిక్‌, కొవిడ్‌-19 లివింగ్‌ గైడ్‌లైన్స్‌’లో స్పష్టంగా తెలిపింది. రెండు రోజుల క్రితం కరోనా మహమ్మారి నివారణ చికిత్సగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఐవర్‌మెక్టిన్‌ను అందించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే, ఎక్కడా ఐవర్‌మెక్టిన్‌ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని మాత్రం డబ్ల్యూహెచ్‌వో పేర్కొనలేదు. పైగా, దీనివల్ల తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయని హెచ్చరించింది.

ఐవర్ మెక్టిన్ విషయంలో డబ్ల్యుహెచ్ఓ కొన్ని పరిగణలోకి తీసుకుని వాటి ద్వారా పరీక్షలు నిర్వహించింది. అయితే ఐవర్‌మెక్టిన్‌ చికిత్స పొందినవారిలో 56% తక్కువగా మరణాలు ఉన్నప్పటికీ డబ్ల్యూహెచ్‌వో మాత్రం మరణాలపై దీని ప్రభావం అనిశ్చితిగానే ఉన్నట్లు పేర్కొంది. మెకానికల్‌ వెంటిలేషన్‌ అవసరమయ్యేవారి సంఖ్య కూడా అస్పష్టమేనని తెలిపింది. కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి ఐవర్‌మెక్టిన్ వాడకంపై ప్రస్తుత ఆధారాలు అసంపూర్తిగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఐవర్‌మెక్టిన్‌ను క్లినికల్‌ ట్రయల్‌ కోణంలో తప్ప మిగతా సందర్భాల్లో ఉపయోగించడానికి సిఫార్సు చేయడంలేదని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. “మరింత డేటా లభించే వరకు, క్లినికల్ ట్రయల్స్‌లో మాత్రమే ఈ ఔషధాన్ని ఉపయోగించాలని సిఫారసు చేస్తుంది” అని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ట్వీట్ చేశారు.

" style="height: 370px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సరదాగా బీచ్ కు వెళ్లిన యువతి.. కానీ ఊహించని షాక్..!

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!

లాక్ డౌన్ నిర్ణయం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతుందా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>