KidsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children7f85bef3-a6c5-491b-a7c7-8f6b60172e1f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children7f85bef3-a6c5-491b-a7c7-8f6b60172e1f-415x250-IndiaHerald.jpgకొంత మంది చిన్న పిల్లలు వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతుంటుంది. దీనితో పలు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. సాధారణంగా పిల్లలు చదివిన విషయాలను గుర్తుంచుకుంటారేమో గానీ, అదే పరీక్ష సమయంలో చదివిన విషయాలను మరచిపోతుంటారు.children;spinach;bananaబుడుగు: పిల్లలలో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇలా చేయండి..!బుడుగు: పిల్లలలో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇలా చేయండి..!children;spinach;bananaThu, 13 May 2021 17:00:00 GMTకొంత మంది చిన్న పిల్లలు వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతుంటుంది. దీనితో పలు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. సాధారణంగా పిల్లలు చదివిన విషయాలను గుర్తుంచుకుంటారేమో గానీ, అదే పరీక్ష సమయంలో చదివిన విషయాలను మరచిపోతుంటారు. ఇక పరీక్షలొస్తున్నాయంటే చాలు పిల్లలు మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురవుతుంటారు. వాళ్ళు మామూలు సమయాల్లో ఎంత బాగా చదివినా, ఆందోళన వల్ల, భయం వల్ల పరీక్షల్లో తగిన ఫలితాన్ని సాధించలేకపోతారు. ఇలాంటి పిల్లల కోసం తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటే చూద్దామా.

అయితే పరీక్షలు సమీపిస్తున్నాయంటే పిల్లల్లో ఒక విధమైన భయానికి లోనవుతుంటారు. అలాంటి వారికి పోషకాలు గల ఆహారం వారి తల్లిదండ్రులు తప్పక ఇవ్వాలి. పిల్లలకు మంచి ఆహారంతోపాటు విటమిన్‌ బి12, విటమిన్‌బి6, విటమిన్‌ సి, ఇ, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. పరీక్షల సమయంలో కొవ్వు పదార్థాలను వీలైనంతవరకు తగ్గించడం చాలా మంచిది. ఎక్కువ ఫ్యాట్‌ ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల చురుకుదనం లోపిస్తుంది.

ఇక నేరేడు పండులో జ్ఞాపకశక్తిని పెంచే యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా వుంటాయి. ద్రాక్ష, చెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండడం వల్ల రోజూ ఒక గ్లాస్‌ ద్రాక్ష జ్యూస్‌ తీసుకోవడం ఎంతో మంచిది. అలాగే ఆపిల్స్‌లో కూడా విటమిన్లతోపాటు కాల్షియం, క్వెర్‌సిటిన్‌, ఆంథోసియానిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మతిమరుపు సమస్యను తప్పించుకోవచ్చు.

అంతేకాదు.. పాలకూర వాడకం కూడా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. బొప్పాయి, అరటిపండులో ఉన్న పోలేట్‌, మెగ్నీషియం, పోటాషియం, విటమిన్‌ బి6 మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్లలోని పిండిపదార్థం మెదడును ఎక్కువసేపు చురుకుగా ఉండేటట్లు చేస్తాయి. తేనె వాడకం వల్ల యాంగ్జైటీ తగ్గి జ్ఞాపకశక్తి వృద్ది చెందుతుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంపొందాలంటే, వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే వారికి పోషకాహారం తప్పక అందించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎడిటోరియల్: భారత్ కు డ్రాగన్ తిరుగులేని షాక్! కరోనా పుట్టించిన చైనా భారత్ పై పోరు మొదలుపెట్టిందా?

కరోనా నుంచి కోలుకున్న వారికి సమీరా టిప్స్.. !

కరోనా వాక్సిన్ గురించి పూరి ఫిలాసఫీ... పంది లాగా తింటే పొట్ట వస్తుంది అని కామెంట్స్

ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ్‌... తేల్చి చెప్పిన ఈసీ

సంపాదకీయం: చైనా తలపెట్టిన జీవాయుధ ప్రపంచ యుద్ధం నిశ్శబ్ధంగా ఇప్పటికే మొదలైందా?

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>