PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona4cb72e71-9468-4010-bad1-908e3b298df2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona4cb72e71-9468-4010-bad1-908e3b298df2-415x250-IndiaHerald.jpgమౌనం అర్థ‌వంతంగా ఉంటుంది. ఆ అర్థ‌వంతం ఎప్పుడంటే మౌనంగా ఉండాల్సిన‌చోట మౌనంగా ఉండాలి.. మాట్లాడాల్సిన‌చోట మాట్లాడాలి!!. అలాకాకుండా మాట్లాడాల్సిన‌చోట మౌనంగా ఉండ‌టం.. మౌనంగా ఉండాల్చిన‌చోట మాట్లాడుతుండ‌టంవ‌ల్ల ఉప‌యోగం ఉండ‌దు. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుందంటారు.. కానీ మౌనం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పదు. నోరు విప్ప‌క‌పోతే ఎవ‌రికి తోచిన భాష్యాన్ని వారు చెప్పుకుంటారు.. అది స‌క్ర‌మంగా ఉండ‌వ‌చ్చు.. లేదా వ‌క్రంగానూ ఉండొచ్చు!! corona;view;american samoa;court;eventమౌన‌మే నీ భాష.. ఓ మూగ‌మ‌న‌సా!!మౌన‌మే నీ భాష.. ఓ మూగ‌మ‌న‌సా!!corona;view;american samoa;court;eventThu, 13 May 2021 10:03:00 GMTమౌనం అర్థ‌వంతంగా ఉంటుంది. ఆ అర్థ‌వంతం ఎప్పుడంటే మౌనంగా ఉండాల్సిన‌చోట మౌనంగా ఉండాలి.. మాట్లాడాల్సిన‌చోట మాట్లాడాలి!!. అలాకాకుండా మాట్లాడాల్సిన‌చోట మౌనంగా ఉండ‌టం.. మౌనంగా ఉండాల్చిన‌చోట మాట్లాడుతుండ‌టంవ‌ల్ల ఉప‌యోగం ఉండ‌దు. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుందంటారు.. కానీ మౌనం అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పదు. నోరు విప్ప‌క‌పోతే ఎవ‌రికి తోచిన భాష్యాన్ని వారు చెప్పుకుంటారు.. అది స‌క్ర‌మంగా ఉండ‌వ‌చ్చు.. లేదా వ‌క్రంగానూ ఉండొచ్చు!!

స్మ‌శానాల్లో స్థ‌లం లేదు!!
స్మ‌శానాల్లో శవాలకు  స్థ‌లం లేదు.. గ్రామాల నుంచి నగరాల వరకు ప్ర‌తిరోజు రోద‌న‌లు మిన్నంటుతున్నాయి.. రాష్ట్రాల నుంచి ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.. కోర్టుల్లో న్యాయ‌స్థానాల ఎదుట ప్ర‌భుత్వ న్యాయ‌వాదులు త‌ల దించుకుంటున్నారు.. మీరెందుకు మాట్లాడ‌టంలేదంటూ ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు..  ప్ర‌జ‌ల ప్రాణాలు క‌రోనా గాలిలో క‌లిసిపోతున్నాయి.. ప్ర‌పంచంలో వ్యాక్సిన్ త‌యారీ కంపెనీల్లో 70 శాతం మ‌న‌ద‌గ్గ‌రే ఉన్నాయి.. కానీ ఈరోజు వ్యాక్సిన్ కేంద్రాలు క‌రోనా హాట్‌స్పాట్లుగా మారుతున్నాయి.. దూర‌దృష్టి ఎందుకు కొర‌వ‌డింద‌ని వైద్య నిపుణులు అడుగుతున్నారు.. లాక్‌డౌన్ ఎందుకు పెట్ట‌లేద‌ని ప్ర‌పంచ దేశాలు ప్ర‌శ్నిస్తున్నాయి.. ఇక్క‌డ వెలుగు చూసిన కొత్త వేరియంట్ 44 దేశాల‌కు పాకింది.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇచ్చి ప్ర‌పంచాన్ని కాపాడిన భార‌త్ ను ఇప్పుడు ఎవ‌రు కాపాడ‌తార‌నేది సందిగ్ధంగా మారింది.. ఎన్ని ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్న‌ప్ప‌టికీ అన్నింటికీ స‌మాధానం ఒక‌టే వ‌స్తోంది.. అదే మౌనం.. మౌనం.

మౌనం స‌రైన వ్యూహం కాదు!!
దేశంలో నెల‌కొన్న విప‌త్క‌ర ప‌రిస్థితుల మ‌ధ్య ఇంకా మౌనం పాటించ‌డం స‌రైన వ్యూహం అనిపించుకోదు. సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం లేని పరిస్థితిని ప్ర‌ధాన‌మంత్రే క‌ల్పించారంటే అతిశ‌యోక్తి కాదు. ప‌ద‌వి చేప‌ట్టిన త‌ర్వాత ఏనాడూ విలేక‌రుల స‌మావేశాలు నిర్వ‌హించ‌లేదు.. ఎవ‌రి ద‌గ్గ‌ర‌నుంచి స‌ల‌హాలు తీసుకోలేదు.. ఎవ‌రితోను సంభాషించ‌లేదు.. ప్రశ్నించినవారికి ఊపిరాడని పరిస్థితి కల్పించారు. తనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి వాతావరణాన్నీ వాస్తవాలతో సంబంధం లేకుండా త‌న మూఢ‌భక్తుల అండతో, భావోద్వేగాలతో తిప్పిగొట్టే ప్రయత్నం చేశారు. చెన్నైలో చైనా అధ్య‌క్షుడితో చేతిలో చేయివేసి బీచ్‌లో ఆహ్లాద‌క‌రంగా ప‌ర్య‌టించారు.. అమెరికా వెళ్లి భారీ స‌భ ఏర్పాటుచేసి ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిర్వ‌హించారు. ఇప్పుడు క‌రోనాను నియంత్రించ‌డానికి కూడా అటువంటి వ్యూహాలు ర‌చించ‌వ‌చ్చుక‌దా!! అని ప్ర‌తిప‌క్షాలు నిల‌దీస్తున్నాయి.. అయినా స‌మాధానం రావ‌డంలేదు.. ఎందుకంటే దేశం వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తోంది??.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలియకుండానే ప్రాణం తీసేస్తున్న వ్యాధి..!

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!

లాక్ డౌన్ నిర్ణయం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతుందా...?

చిరంజీవి మోహన్ బాబుల ఇగో సమస్యతో ఆగిపోయిన ఆ సినిమా !

ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం.. ఎలా అర్థం చేసుకోవాలి..?

పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆ ప్రముఖ దర్శకుడు !

ఈటల..! : జయింట్‌ కిల్లరా..? కన్‌ఫ్యూజ్‌ మాస్టరా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>