MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shivagami-to-act-in-prabhas-movie-again4d13ef18-1ef3-44ad-b56b-cf7c40d05d90-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shivagami-to-act-in-prabhas-movie-again4d13ef18-1ef3-44ad-b56b-cf7c40d05d90-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆమె విలన్ పాత్రలో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలో నటించారు.ramyakrushna;prabhas;shruti haasan;prasanth;prashanth neel;ramya krishnan;rajamouli;cinema;bahubali;heroine;prasanth neel;nijam;prashant kishorప్రభాస్ సినిమాలో మరోసారి నటించనున్న శివగామి..!ప్రభాస్ సినిమాలో మరోసారి నటించనున్న శివగామి..!ramyakrushna;prabhas;shruti haasan;prasanth;prashanth neel;ramya krishnan;rajamouli;cinema;bahubali;heroine;prasanth neel;nijam;prashant kishorThu, 13 May 2021 12:30:15 GMTచిత్ర పరిశ్రమలో సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఆమె విలన్ పాత్రలో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలో నటించారు. ఇక బాహుబలి సిరీస్ సినిమాలలో నటి రమ్యకృష్ణ ప్రభాస్ కు పెంపుడు తల్లి పాత్రలో నటించి తన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే.

ఇక శివగామి పాత్రను రాజమౌళి శ్రీదేవికి ఆఫర్ చేయగా ఆమె రిజెక్ట్ చేయడంతో రమ్యకృష్ణ ఆ పాత్రకు ఎంపికయ్యారు. శివగామి పాత్ర ద్వారా రమ్యకృష్ణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంతో ఆమె ప్రస్తుతం రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ప్రభాస్ రమ్యకృష్ణ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుందని సమాచారం.

అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలోని కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించాడని తెలుస్తోంది. సలార్ సినిమాలో ప్రభాస్ కు అక్క పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. నిజంగానే ప్రభాస్, రమ్యకృష్ణ అక్కాతమ్ముళ్లుగా కనిపిస్తే మాత్రం సలార్ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రభాస్ కు అక్క పాత్ర కోసం రమ్యకృష్ణను కాకుండా మరో హీరోయిన్ ను తీసుకుంటే బాగుంటుందని కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇక మరి ప్రభాస్ ఫ్యాన్స్ సూచనలను దర్శకుడు ప్రశాంత్ నీల్ పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది. రమ్యకృష్ణ ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న రిపబ్లిక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు రమ్యకృష్ణ చేతిలో మరికొన్ని ఆఫర్లు ఉన్నాయి. వచ్చే ఏడాది సమ్మర్ టార్గెట్ గా సలార్ సినిమా తెరకెక్కుతోంది. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో శృతిహాసన్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

" పాక్ పౌరసత్వం మార్చుకుంటా ".. పాక్ బౌలర్ సంచలన కామెంట్స్ !!

అధికంగా టీకాలు వేసిన దేశం ఏమిటంటే..?

తెలంగాణలో కరోనా.. ఈటలకు ముందు.. ఈటల తర్వాత

షర్మిలక్క ట్వీట్లు.. కొంచెం పట్టించుకోండయ్య!

ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాలు ఇక "ప్రాణ‌వాయువు" ర‌థ చ‌క్రాలుగా...

మోడీ గురించి జనాలకు క్లారిటీ వచ్చేసిందా...?

ఇదేంటి జగన్ సారూ...? మాట్లాడండి...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>