MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/akhandaf2b09dee-0a21-4f6a-a027-e7e41a34ed13-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/akhandaf2b09dee-0a21-4f6a-a027-e7e41a34ed13-415x250-IndiaHerald.jpgచివరిగా వినయ విధేయ రామ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. అటు బాలకృష్ణకు ఇటు బోయపాటికి ఈ హిట్ చాలా అవసరం. ఇక ఈ విషయం పక్కన పెడితే బోయపాటి ఈ సినిమా తరువాత ఎవరితో సినిమా చేయాలి అనే అంశం మీద ఒక డైలమాలో ఉన్నాడని తెలుస్తోంది. నిజానికి బోయపాటి ఇప్పటికే రామ్ పోతినేని అలాగే గోపీచంద్ ఇద్దరికీ వేరు వేరు కథలు వినిపించాడు. ఈ ఇద్దరూ ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. అయితే బాలకృష్ణ తర్వాత కూడా స్టార్ హీరోతోనే సినిమా చేయాలని ప్రయత్నాలుtollywood gossips;ntr;balakrishna;gopichand;kumaar;shiva;allu arjun;boyapati srinu;koratala siva;prasanth;prashanth neel;ram pothineni;sukumar;india;cinema;lord siva;prasanth neel;nandamuri taraka rama rao;vinaya vidheya rama;arjun 1;prashant kishorబోయపాటి నెక్స్ట్ ఏంటి?బోయపాటి నెక్స్ట్ ఏంటి?tollywood gossips;ntr;balakrishna;gopichand;kumaar;shiva;allu arjun;boyapati srinu;koratala siva;prasanth;prashanth neel;ram pothineni;sukumar;india;cinema;lord siva;prasanth neel;nandamuri taraka rama rao;vinaya vidheya rama;arjun 1;prashant kishorWed, 12 May 2021 08:00:00 GMTచివరిగా వినయ విధేయ రామ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ అనే సినిమా చేస్తున్నాడు. అటు బాలకృష్ణకు ఇటు బోయపాటికి ఈ హిట్ చాలా అవసరం. ఇక ఈ విషయం పక్కన పెడితే బోయపాటిసినిమా తరువాత ఎవరితో సినిమా చేయాలి అనే అంశం మీద ఒక డైలమాలో ఉన్నాడని తెలుస్తోంది. నిజానికి బోయపాటి ఇప్పటికే రామ్ పోతినేని అలాగే గోపీచంద్ ఇద్దరికీ వేరు వేరు కథలు వినిపించాడు. ఈ ఇద్దరూ ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. 


అయితే బాలకృష్ణ తర్వాత కూడా స్టార్ హీరోతోనే సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్న బోయపాటి తాజాగా అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో సరైనోడు అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. ఈ నేపధ్యంలోనే అల్లు అర్జున్ తనకు మరో అవకాశం ఇస్తాడని బోయపాటి భావిస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే కొరటాల శివతో సినిమా ప్రారంభించాల్సి ఉంది. 


కానీ కొరటాల శివ ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేసిన కారణంగా ఈ గ్యాప్ లో తనతో సినిమా చేయమని బోయపాటి అల్లు అర్జున్ ని కోరినట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్ ఏమో పాన్ ఇండియా లెవల్ లో ప్రాజెక్టులు చేయాలని చూస్తున్నాడు. పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుండటంతో ఇప్పటికే ఆయన ప్రశాంత్ నీల్ సహా కొందరు స్టార్ డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నాడు. ఇలాంటి తరుణంలో బోయపాటికి అల్లు అర్జున్ అవకాశం ఇస్తాడా అనేది కూడా అనుమానాస్పదమే. ఈ నేపథ్యంలోనే బోయపాటి ఏమి చేయాలో తెలియని సందిగ్ధావస్థలో ఉండిపోయాడు అని అంటున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

డేంజర్ జోన్ లో ఈ ఐదు రాష్ట్రాలు..ప్రమాదకరస్దాయిలో కరోనా..!!

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దివిసీమ ఎమ్మెల్యేకు బలం పెరిగిందా?

మాజీ స్పీకర్‌కు లైన్ క్లియర్ అయినట్లేనా?

ఆ టీడీపీ కమ్మ నేతలు కొడాలికి ఫేవర్‌గా ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>