Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/disha-patani100a74be-5d07-4579-91be-a24139455546-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/disha-patani100a74be-5d07-4579-91be-a24139455546-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌లో ఒక్కటంటే ఒక్క సినిమా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ ఆఫర్ల కోసం ఏళ్లుగా తెగ కష్టపడుతోంది. కానీ ఇప్పటికీ చెప్పుకోదగిన హిట్ ఒక్కటీ లేదు. కానీ సదరు భామ బెట్టు మాత్రం మామూలుగా లేదు. ఎంతమంది టాలీవుడ్ దర్శక నిర్మాతలు కొందరు కొన్ని కథలతో వెళ్లినా.. వాటన్నింటినీ పక్కన పెట్టేసింది. కేవలం స్టార్ హీరోలైతేనే తాను చేస్తానంటూ భీష్మించుకు కూర్చుంది. ఇత గొప్ప బ్యాక్‌గ్రౌండ్ ఏ హీరోయిన్‌దబ్బా..disha patani;salman khan;bhama;puri jagannadh;varun;varun sandesh;varun tej;korcha;bollywood;tollywood;cinema;telugu;interview;director;hero;success;baaghiటాలీవుడ్‌లో వాళ్లతోనే అంటున్న బాలీవుడ్ భామ.. ఒక్క హిట్ లేకుండానే..?టాలీవుడ్‌లో వాళ్లతోనే అంటున్న బాలీవుడ్ భామ.. ఒక్క హిట్ లేకుండానే..?disha patani;salman khan;bhama;puri jagannadh;varun;varun sandesh;varun tej;korcha;bollywood;tollywood;cinema;telugu;interview;director;hero;success;baaghiWed, 12 May 2021 16:01:21 GMTటాలీవుడ్‌లో ఒక్కటంటే ఒక్క సినిమా చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ ఆఫర్ల కోసం ఏళ్లుగా తెగ కష్టపడుతోంది. కానీ ఇప్పటికీ చెప్పుకోదగిన హిట్ ఒక్కటీ లేదు. కానీ సదరు భామ బెట్టు మాత్రం మామూలుగా లేదు. ఎంతమంది టాలీవుడ్ దర్శక నిర్మాతలు కొందరు కొన్ని కథలతో వెళ్లినా.. వాటన్నింటినీ పక్కన పెట్టేసింది. కేవలం స్టార్ హీరోలైతేనే తాను చేస్తానంటూ భీష్మించుకు కూర్చుంది. ఇత గొప్ప బ్యాక్‌గ్రౌండ్ ఏ హీరోయిన్‌కి ఉందా అని అనుకుంటున్నారా..? ఇంకెవరు దిశ పటానీ. తెలుగులో డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ సరసన లోఫర్ సినిమా చేసింది దిశ. కానీ ఆ సినిమా అంతగా ఆడకపోవడంతో వెంటనే వెంటనే బాలీవుడ్ చెక్కేసింది ఈ భామ.

అక్కడ `ఎం.ఎస్.ధోనీ`, `భాఘి-2` చిత్రాల్లో నటించింది. ఆ సినిమాలు సక్సెస్ అయినా.. ఆ క్రెడిట్ అంతా హీరోలకే వెళ్లిపోయింది. అయితే ఆ సినిమాల సక్సెస్ దిశాకు అడపాదడపా సినిమా అవకాశాలు బాలీవుడ్‌లో రావడం మొదలు పెట్టాయి. దీంతో అక్కడే సెటిల్ అయిపోయింది దిశ. తాజాగా సల్మాన్ ఖాన్ సరసన రాధేలో ఛాన్స్ కొట్టేసి మెరిసింది. ఈ సినిమా తన కెరీర్‌ను ఓ రేంజ్‌కు తీసుకెళుతుందని చాలా ఆశలే పెట్టుకుంది. మే 13న భారీ అంచనాల నడుమ రాధే రిలీజవుతోంది.

కాగా.. ప్రస్తుతం దిశ పటానీ `ఏక్ విలన్ రిటర్స్`తో పాటు మరో సినిమాలో కూడా నటిస్తోంది. ఇంకో రెండు ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నట్లు బాలీవుడ్ టాక్. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో అవకాశాలు వస్తే మళ్లీ నటిస్తారా? అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ``నటిస్తాను.. కానీ కండీషన్స్ అప్లై!`` అంటూ మెలిక వేసిందట. కుర్ర హీరోలు, చిన్న హీరోలతో తాను నటించనని చెప్పేసిందని టాక్.

కెరీర్ ఆరంభంలో మెగా హీరో సరసన నటించిన దిశ.. ఇప్పుడు మాత్రం అలాంటి ఛాన్సులోస్తే నో చెప్పేస్తోందట. కేవలం స్టార్ హీరోల సరసన మాత్రమే నటిస్తానని కుండ బద్దలు కొడుతున్నట్లు టాక్. ఇటీవల పలు తెలుగు కాస్టింగ్  ఏజెన్సీలు కథలతో సంప్రదించగా.. ఇదే సమాధానం చెప్పిందని తెలిసింది.

ఇప్పటివరకు దిశక కెరీర్లో చెప్పుకొదగిన హిట్ ఒక్కటి కూడా లేకపోయినా.. ఈ అమ్మడు ఇంత టెక్కు చూపిస్తుండడంతో టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమె గురించి పట్టించుకోకూడదని కూడా నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ముందు చూపుతో ఓ మెట్టు దిగి వస్తేనే దిశకు టాలీవుడ్‌ అవకాశాలు వస్తాయని, ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ ఏంటో ఆమెకు అర్థం కావడం లేదని, ఇలాంటి రూల్స్, కండిషన్స్ పెట్టుకుంటూ పోతో భవిష్యత్తులో ఆమెకే నష్టమని కొందరు క్రిటిక్స్ కూడా హెచ్చరిస్తున్నారు. మరి దిశ ఏం చేస్తుందో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ధూళిపాళ్ల మళ్ళీ జైలుకే ... 7 రోజుల తర్వాత ట్విస్ట్ ?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!

ముంబైకి గట్టి షాక్ ఇచ్చేస్తున్న బెంగుళూర్.... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>