MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasf7bf9e31-91a7-46d1-8f2b-9f989c8f6a0e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasf7bf9e31-91a7-46d1-8f2b-9f989c8f6a0e-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమాతో ప్రభాస్‌ కు వచ్చిన క్రేజ్‌ కారణంగా అతనితో పరభాషా దర్శకులు, ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్స్ సినిమా చేయడానికి అత్యంత ఆసక్తి చూపుతున్నారు. దానికి తోడు ప్రభాస్‌ కూడా తనకు నచ్చిన స్క్రిప్ట్స్ కు ఓకే చెబుతూ వెళుతున్నాడు. దీంతో మరో మూడు, నాలుగేళ్ళ వరకూ ప్రభాస్‌ ఖాళీగా ఉండని పరిస్థితి ఏర్పడింది.ఇక ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ మూవీ ‘రాధేశ్యామ్’ తుదిమెరుగులు దిద్దుకుంటూ ఉండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘సలార్’ సెట్స్ పై ఉంది. అటు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ త్రీడీ మూవీ ‘ఆPRABHAS;prabhas;siddharth;siddharth anand;anand malayalam actor;naga;prasanth;prashanth neel;vyjayanthi;india;bollywood;tollywood;cinema;bahubali;naga aswin;hindi;director;prasanth neel;romantic;anand deverakonda;prashant kishorసినిమాలకి ప్రభాస్ సెలవు.. అందుకేనా??సినిమాలకి ప్రభాస్ సెలవు.. అందుకేనా??PRABHAS;prabhas;siddharth;siddharth anand;anand malayalam actor;naga;prasanth;prashanth neel;vyjayanthi;india;bollywood;tollywood;cinema;bahubali;naga aswin;hindi;director;prasanth neel;romantic;anand deverakonda;prashant kishorWed, 12 May 2021 16:00:00 GMTబాహుబలి సినిమాతో ప్రభాస్‌ కు వచ్చిన క్రేజ్‌ కారణంగా అతనితో పరభాషా దర్శకులు, ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్స్ సినిమా చేయడానికి అత్యంత ఆసక్తి చూపుతున్నారు. దానికి తోడు ప్రభాస్‌ కూడా తనకు నచ్చిన స్క్రిప్ట్స్ కు ఓకే చెబుతూ వెళుతున్నాడు. దీంతో మరో మూడు, నాలుగేళ్ళ వరకూ ప్రభాస్‌ ఖాళీగా ఉండని పరిస్థితి ఏర్పడింది.ఇక ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ మూవీ ‘రాధేశ్యామ్’ తుదిమెరుగులు దిద్దుకుంటూ ఉండగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘సలార్’ సెట్స్ పై ఉంది. అటు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ త్రీడీ మూవీ ‘ఆదిపురుష్’ ఇటీవలే మొదలైంది.

ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఈ ఏడాది చివరికి గానీ పూర్తి అయ్యేలా లేవు.అలాగే వచ్చే ఏడాది అంతా ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో నాగ అశ్విన్ చేయబోతున్న చిత్రానికి డేట్స్ ఇస్తున్నాడని తెలుస్తోంది. ఈ సోషియో ఫాంటసీ సైంటిఫిక్ మూవీకీ భారీ డేట్స్ కేటాయించాల్సి ఉందట. దీనితో పాటే హిందీ ఫిల్మ్ మేకర్ సిద్ధార్థ్ ఆనంద్ తో సినిమా చేయడానికి కూడా ప్రభాస్ అంగీకారం తెలిపాడని బీ టౌన్ లో టాక్‌ వినిపిస్తోంది.వీటితో పాటు సలార్‌ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమాకు… సుధా కొంగర డైరెక్షన్‌లో ఇంకో సినిమాకు ప్రభాస్‌ కమిట్ అయ్యాడని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్‌ల లిస్ట్ చూస్తుంటే… ప్రభాస్‌ 2025 వరకు మరే డైరెక్టర్ కు అందుబాటులో ఉండడని తెలుస్తోంది.అయితే ప్రభాస్ వచ్చే ఏడాది దాదాపుగా అన్ని సినిమాలని పూర్తి చేసి ఒక సంవత్సరం రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాడు అని టాక్. ఆయన వరసగా ఇలా సినిమాలని చేస్తూ బిజీగా ఉంటూ రెస్ట్ తీసుకోవడానికి కొంచెం కూడా ఖాళీ దొరకట్లేదట. అయితే ఆయన ఇప్పటికే ఉన్న కమిట్మెంట్స్ పూర్తి అవ్వాలి అంటే చాలా సమయం పట్టేలా ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ధూళిపాళ్ల మళ్ళీ జైలుకే ... 7 రోజుల తర్వాత ట్విస్ట్ ?

'ఆర్ఆర్ఆర్' ఓటిటి రిలీజ్ : క్లారిటీ ఇచ్చిన యంగ్ టైగర్

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!

ముంబైకి గట్టి షాక్ ఇచ్చేస్తున్న బెంగుళూర్.... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>