ViralDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/lock-downccb1285b-48d4-4ab1-8327-fd4c72d92f6c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/lock-downccb1285b-48d4-4ab1-8327-fd4c72d92f6c-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటూనే సేఫ్ గా ఉండాలని. ప్రజలు ఎక్కువగా గుమిగూడి తిరిగే చోట, ఒకరి నుంచి మరొకరికి తొందరగా ఈ వైరస్ సోకుతుంది. తద్వారా త్వరగా వైరస్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఇక ఇలాంటి పరిస్థితులను అడ్డుకునేందుకే ప్రభుత్వాలు ఈ లాక్ డౌన్ పద్ధతిని తీసుకొచ్చారు. ఈ లాక్ డౌన్ కారణంగా వైరస్ ఒక మనిషి నుంచి మరొక మనిషికి చేరలేదు. అంతేకాకుండా ఈ కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి సోకకపోవడం వల్ల త్వరగా నశించిపోయే అవకాశాLOCK DOWN;smart phone;central government;coronavirusలాక్ డౌన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా ?లాక్ డౌన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా ?LOCK DOWN;smart phone;central government;coronavirusWed, 12 May 2021 09:00:00 GMT
కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్  పెట్టడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటూనే సేఫ్ గా ఉండాలని. ప్రజలు ఎక్కువగా గుమిగూడి తిరిగే చోట, ఒకరి నుంచి మరొకరికి తొందరగా ఈ వైరస్ సోకుతుంది. తద్వారా త్వరగా వైరస్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఇక  ఇలాంటి పరిస్థితులను అడ్డుకునేందుకే ప్రభుత్వాలు ఈ లాక్ డౌన్  పద్ధతిని తీసుకొచ్చారు. ఈ లాక్ డౌన్ కారణంగా వైరస్ ఒక మనిషి నుంచి మరొక మనిషికి చేరలేదు. అంతేకాకుండా  ఈ కరోనా వైరస్ మనిషి నుంచి మనిషికి సోకకపోవడం వల్ల త్వరగా నశించిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్న ఆలోచనతోనే  లాక్ డౌన్ విధించడం జరుగుతుంది.. ఇలా లాక్ డౌన్ విధించినప్పుడు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


సాధారణంగా లాక్ డౌన్  విధించినప్పుడు ప్రతి ఒక్కరు అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లకుండా ఉండాలి. ఇక ఇంట్లో ఉంటూనే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి చేతులను శానిటైజర్ లేదా సబ్బుతో కడుక్కోవడం వంటివి చేయాలి. అలాగే ఇంటిని, ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను కూడా శుభ్రం చేసుకోవాలి. వీలైనంత వరకు ఇంట్లో తయారుచేసుకున్న ఆహారపదార్థాలను తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలా వరకు బయట నుంచి వచ్చే ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండటం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం.

మరీ ముఖ్యంగా ఈ లాక్ డౌన్  సమయంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానితోపాటు ఇంట్లోనే నడవడం, వ్యాయామాలు చేయడం, యోగాలు చేయడం, ఎక్సర్సైజ్ చేయడం వంటివి అలవాటుగా మార్చుకోవాలి. ఈ లాక్  డౌన్ వచ్చిన తర్వాత చాలామంది సమయం గడవడం లేదని టీవీలు, ఫోన్ లకు  పరిమితమవుతున్నారు. అలా కాకుండా మీ ఇంటి కుటుంబ సభ్యులతో ఆనంద క్షణాలను గడపడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఇక ఎప్పుడైతే మనస్సు ఉత్సాహంగా ఉంటుందో అప్పుడు ఎలాంటి రోగాలు దరిచేరవు.

ఇక ఇంట్లోనే మీకు నచ్చిన పనులు చేస్తూ ఆరోగ్యంగా ఉండండి. ఈ వేసవి కాలంలో చాలా మంది చల్లని పానీయాలు తాగడానికి ఇష్టపడతారు. కానీ ఈ కరోనా విజృంభిస్తున్న సమయంలో చాలా మంది వీటికి దూరంగా ఉండటమే మంచిది. వీలైతే ఇంట్లో కాలక్షేపం కోసం మొక్కలు పెంచుకోవడం వంటివి చేయడం వల్ల ఇంటి ఆవరణపరిసరాలు శుభ్రంగా ,ఆహ్లాదకరంగా, అందంగా ఉంటాయి..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బోయపాటి నెక్స్ట్ బన్నీ తో కాదట.. రామ్ చరణ్ తో.. పోయిన చోటే వెతుక్కుంటున్నాడా..?

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దివిసీమ ఎమ్మెల్యేకు బలం పెరిగిందా?

మాజీ స్పీకర్‌కు లైన్ క్లియర్ అయినట్లేనా?

ఆ టీడీపీ కమ్మ నేతలు కొడాలికి ఫేవర్‌గా ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>