PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusa28788ad-23c6-4d88-91e2-c64c5f003ac3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusa28788ad-23c6-4d88-91e2-c64c5f003ac3-415x250-IndiaHerald.jpgదేశంలో ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం మరియు ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ వాటి ప్రభావం అనుకున్న స్థాయిలో వైరస్ వ్యాప్తిపై చూపుతున్నట్లు కనిపించడం లేదు. దేశంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య కొంతమేర తగ్గుతున్నప్పటికి, మరణాల రేటు మాత్రం భారీగా పెరుగుతుండడంతో ప్రజల గుండెల్లో వణుకుపుడుతోంది.CORONAVIRUS;bhavana;central governmentదేశంలో కేసులు తగ్గుతున్నా .. మరణాలు ఆగడం లేదు ?దేశంలో కేసులు తగ్గుతున్నా .. మరణాలు ఆగడం లేదు ?CORONAVIRUS;bhavana;central governmentWed, 12 May 2021 12:00:00 GMTదేశంలో ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం మరియు ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ వాటి ప్రభావం అనుకున్న స్థాయిలో వైరస్ వ్యాప్తిపై  చూపుతున్నట్లు కనిపించడం లేదు. దేశంలో రోజురోజుకీ  కరోనా కేసుల సంఖ్య కొంతమేర తగ్గుతున్నప్పటికి, మరణాల రేటు మాత్రం భారీగా పెరుగుతుండడంతో ప్రజల గుండెల్లో వణుకుపుడుతోంది. కరోనా ప్రభంజనం అంతకంతకూ విజృంభిస్తోంది. గత మూడు రోజుల నుండి ఆరోగ్య శాఖ విడుదల చేస్తున్న కరోనా లెక్కలు గమనిస్తే యాక్టివ్ కేసులు తగ్గుముఖం  పడుతుండగా, మరణాల సంఖ్య  మాత్రం భారీగా పెరుగుతూ సంచలనం సృష్టిస్తోంది. 

ఈ నెల 6 న దేశంలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 4,14,188 నమోదు కాగా గత మూడు రోజుల నుండి ఈ సంఖ్య తగ్గుతూ వస్తుండడం విశేషం. అయితే నేడు దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,48,371 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో,  కేసుల సంఖ్యలో తగ్గింది అనే భావన కలుగుతోంది. కానీ కరోనా మరణాలు మాత్రం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. తాజా కరోనా గణాంకాల ప్రకారం నిన్న ఉదయం నుండి ఇప్పటి వరకు  ఏకంగా 4205 మంది కరోనా రోగులు మరణించడం కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. ఒక్క రోజులో ఇంత భారీ సంఖ్యలో కరోనా భాదితులు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి.

ఈ విషయం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. గత శుక్రవారం అత్యధికంగా భారీ మొత్తంలో 4185 కరోనా భాదితులు మరణించగా ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసి కరోనా మరణాల సంఖ్య  4205 కు చేరడం అందరినీ టెన్షన్ పెడుతోంది. అంటే వైరస్ తీవ్రత మరింత పెంచుకుని మానవ శరీరంలోని అవయవాలపై తన ప్రభావాన్ని చూపి వారి ప్రాణాలను కోల్పోయేలా చేస్తున్నట్లు చెప్పవచ్చు. ఇందుకు సంబంధించి తదుపరి ఎటువంటి చర్యలు తీసుకుని మరణాల రేటు తగ్గించాలి అన్న విషయంపై కేంద్ర ఆరోగ్యసంస్థ తక్షణమే  ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. మరి ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ బాగా కవర్ చేసుకుంటున్నారా...?

ముంబైకి గట్టి షాక్ ఇచ్చేస్తున్న బెంగుళూర్.... ?

ఇలా చేస్తే కరోనా రాకుండా ఎలా ఉంటుంది..?

తెలంగాణలో కేసీఆర్‌ను నిలదీస్తున్న ఒకే ఒక్క ఛానల్..?

డేంజరస్ రికార్డ్: 14 రోజుల్లో 50 వేల క‌రోనా మరణాలు..!!

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>