EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modi94ea563b-e706-4e2d-a2e5-3851e2d7eb76-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/modi94ea563b-e706-4e2d-a2e5-3851e2d7eb76-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల రాజకీయాలు విచిత్రంగా సాగుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా వ్యాక్సిన్ల కొరత, కొవిడ్ కట్టడి చర్యల నిర్వహణ వంటి అంశాలపై విమర్శల రాజకీయం జోరుగా సాగుతోంది. ప్రత్యేకించి చంద్రబాబు, లోకేశ్ వంటి వారు తరచూ జగన్ కొవిడ్ విషయంలో విఫలం అయ్యారని విమర్శిస్తున్నారు. కరోనా వ్యాక్సీన్లు తెప్పించుకోవడంలో జగన్ ఫెయిలయ్యాడని మొన్న చంద్రబాబు మండిపడ్డారు. దీనికి బదులిచ్చిన వైసీపీ... రూ.1600 కోట్లు రాసిస్తాం.. చంద్రబాబు వ్యాక్సీన్లు తెప్పిస్తారా అంటూ ప్రతి సవాల్ విసిరారు. విచిత్రం ఏంటంటే.. అసలు వ్యాక్సmodi;cbn;modi;amit shah;kcr;hema;hemanth;jagan;nara lokesh;narendra modi;amith shah;central government;ycp;march;parliament;narendraకేసీఆర్, జగన్, చంద్రబాబుకు.. ఆ ఇద్దరంటే ఎందుకంత భయం..?కేసీఆర్, జగన్, చంద్రబాబుకు.. ఆ ఇద్దరంటే ఎందుకంత భయం..?modi;cbn;modi;amit shah;kcr;hema;hemanth;jagan;nara lokesh;narendra modi;amith shah;central government;ycp;march;parliament;narendraWed, 12 May 2021 08:11:51 GMTతెలుగు రాష్ట్రాల రాజకీయాలు విచిత్రంగా సాగుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా వ్యాక్సిన్ల కొరత, కొవిడ్ కట్టడి చర్యల నిర్వహణ వంటి అంశాలపై విమర్శల రాజకీయం జోరుగా సాగుతోంది. ప్రత్యేకించి చంద్రబాబు, లోకేశ్ వంటి వారు తరచూ జగన్ కొవిడ్ విషయంలో విఫలం అయ్యారని విమర్శిస్తున్నారు. కరోనా వ్యాక్సీన్లు తెప్పించుకోవడంలో జగన్ ఫెయిలయ్యాడని మొన్న చంద్రబాబు మండిపడ్డారు. దీనికి బదులిచ్చిన వైసీపీ... రూ.1600 కోట్లు రాసిస్తాం.. చంద్రబాబు వ్యాక్సీన్లు తెప్పిస్తారా అంటూ ప్రతి సవాల్ విసిరారు.

విచిత్రం ఏంటంటే.. అసలు  వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రాలు చేయడానికి ఏమీ లేదు. అంతా కేంద్రం నిర్ణయమే సాగుతోంది. మోడీ సర్కారు వ్యాక్సీన్ల విషయంలో గందరగోళంగా వ్యవహరించింది. వ్యాక్సిన్లు కేంద్రమే రాష్ట్రాలకు ఇస్తుందని.. రాష్ట్రాలు నేరుగా వ్యాక్సీన్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోరాదని ఏకంగా పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలోనే చెప్పింది. ఆ తర్వాత సెకండ్ వేవ్ జోరు ప్రారంభం కావడం.. వ్యాక్సిన్ల అంశం ఇష్యూ కావడంతో మళ్లీ విధానం మార్చింది.

వ్యాక్సిన్ సంస్థల నుంచి సగం మేం తీసుకుంటాం.. మిగిలిన సగం రాష్ట్రాలు నేరుగా కొనుకోవచ్చని విధానం మార్చింది. అలా కొందామన్నా సదరు సంస్థలు నేరుగా టీకాలు ఇవ్వడం లేదు. కేంద్రం చెప్పినట్టే ఇస్తున్నాయి. అయితే ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు వంటి నేతలు... నరేంద్ర మోదీని ప్రశ్నించే సాహసం చేయడం లేదు. పదే పదే జగన్ పై విమర్శలు చేస్తారు కానీ.. మోదీ సర్కారును, కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనే పరిస్థితి లేదు.

మరోవైపు జగన్ సైతం.. కేంద్రాన్ని నిలదీసే సాహసం చేయడం లేదు. పైగా హేమంత్ సొరెన్ వంటి వారు మాట్లాడితే వారిపై జగన్ విమర్శలు చేస్తున్నారు. ఇక అటు కేసీఆర్ సైతం వ్యాక్సీన్లపై కేంద్రం విధానాన్ని తప్పుబట్టడం లేదు. అంటే కేసీఆర్, చంద్రబాబు, జగన్.. ఈ ముగ్గురూ ఏ విషయంలోనైనా పరస్పరం విమర్శించుకుంటారు కానీ.. మోడీ, అమిత్ షా జోలికి మాత్రం వెళ్లే సాహసం చేయడం లేదు. మరి ఈ ముగ్గురికీ మోదీ, అమిత్ షా అంటే ఎందుకంత భయమో..?



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కుప్పలు కుప్పలుగా మృతదేహాలు.. అక్కడినుంచే వచ్చాయట?

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దివిసీమ ఎమ్మెల్యేకు బలం పెరిగిందా?

మాజీ స్పీకర్‌కు లైన్ క్లియర్ అయినట్లేనా?

ఆ టీడీపీ కమ్మ నేతలు కొడాలికి ఫేవర్‌గా ఉన్నారా?

ఆటిజం చిన్నారుల పాలిట ప్రత్యేక్ష దైవంగా శ్రీజారెడ్డి సరిపల్లి

ఉద్యోగులకు శుభవార్త.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>