PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/government-says-lockdown-againe2af0b65-8590-40f0-a55a-8311b1b781bb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/government-says-lockdown-againe2af0b65-8590-40f0-a55a-8311b1b781bb-415x250-IndiaHerald.jpgలాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయండి అంటూ తెలంగాణా డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. సీనియర్ అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షించాలి అని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుననుసరించి లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలి అని కోరారు. పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ లనుండి డీ.ఐ.జీ స్థాయి సీనియర్ పోలీస్ అధికారులందరూ విధిగాక్షేత్ర స్థాయిలో ఉండి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలి అని విజ్ఞప్తి చేసారు. లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాts,lock down;amala akkineni;hyderabad;district;smart phone;media;traffic police;local language;reddyతెలంగాణాలో తిరగాలంటే ఏం కావాలి...?తెలంగాణాలో తిరగాలంటే ఏం కావాలి...?ts,lock down;amala akkineni;hyderabad;district;smart phone;media;traffic police;local language;reddyWed, 12 May 2021 11:07:57 GMTలాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయండి అంటూ తెలంగాణా డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. సీనియర్ అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి పర్యవేక్షించాలి అని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుననుసరించి లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలి అని కోరారు. పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ లనుండి డీ.ఐ.జీ స్థాయి సీనియర్ పోలీస్ అధికారులందరూ విధిగాక్షేత్ర స్థాయిలో ఉండి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలి అని విజ్ఞప్తి చేసారు. లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలి అని ఆదేశించారు.

హైదరాబాద్ తోపాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా హెడ్ క్వార్టర్లు, ప్రధాన నగరాలలో పటిష్టంగా అమలు చేయాలి అని సూచనలు చేసారు. రాష్ట్రం లో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణా లపై ఏవిధమైన ఆంక్షలు లేవు అని అన్నారు. జాతీయ రహదారులపై రవాణా పై ఏవిధమైన ఆంక్షలు లేవు అని స్పష్టం చేసారు. ప్రధాన రంగంలో ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ అక్రిడేషన్లు కానీ, పత్రికా పరమైన గుర్తింపు కార్డులు తమవెంట ఉంచుకోవాలని స్పష్టం చేసారు. గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధిహామీ పనులను లాక్ డౌన్ నుండి మినహాయింపు ఉంటుంది అన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖా పరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుంది అని అన్నారు. రాష్ట్రం లో జరిగే వివాహాలకు ఇరువైపుల చెందిన 40 మంది మాత్రమే హాజరయ్యేవిధంగా చూడాలి అని కోరారు. వివాహలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలి అని స్పష్టం చేసారు. మరణాలకు సంబంధించి కేవలం 20 మంది మాత్రమే హాజరు కావాలి అని సూచనలు చేసారు. కరోనా వాక్సినేషన్ కు ఎవరైనా వెళ్లాల్సివస్తే వారి మొదటి డోస్ కు సంబందించిన సమాచారం సెల్ ఫోన్ లో చూసి వారికి సడలింపు ఇవ్వాలి అని విజ్ఞప్తి చేసారు. నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులను జారీ చేయాలి అని స్పష్టం చేసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

స్టార్ ద‌ర్శ‌కుడి ఇంట్లో కరోనా క‌ల్లోలం.. ఏడుగురికి పాజిటివ్..!!

ఇలా చేస్తే కరోనా రాకుండా ఎలా ఉంటుంది..?

తెలంగాణలో కేసీఆర్‌ను నిలదీస్తున్న ఒకే ఒక్క ఛానల్..?

డేంజరస్ రికార్డ్: 14 రోజుల్లో 50 వేల క‌రోనా మరణాలు..!!

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>