PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/darunam-ambulance-ki-daredie3b82dd1-1adb-4250-8c0d-488449a143bc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/darunam-ambulance-ki-daredie3b82dd1-1adb-4250-8c0d-488449a143bc-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కరోనాను అంతం చేయడానికి కేసీఆర్ సర్కార్ లాక్ డౌన్ విధించింది. సరిహద్దుల వద్ద కఠిన చర్యలు తీసుకుంటోంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అంబులెన్సులను కూడా రాష్ట్రంలోకి రాకుండా పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల హైకోర్టు కూడా అంబులెన్సులు సరిహద్దులు దాటొచ్చని తెలిపినప్పటికీ పోలీసులు మాత్రం వాటిని లోనికి రానీయడం లేదు. దీంతో సరిహద్దుల్లో అంబులెన్సులు క్యూ కడుతున్నాయి. ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపివేయడం వల్ల బంధువులు గగ్గోలు పెడుతున్నారు. వైద్యం కోసం వెళ్తున్న రోగambulance, telangana government,;kcr;krishna river;andhra pradesh;telangana;district;smart phone;police;suryapeta;cheque;oxygen;kodadఅంబులెన్స్‌లకు దారేదీ..!అంబులెన్స్‌లకు దారేదీ..!ambulance, telangana government,;kcr;krishna river;andhra pradesh;telangana;district;smart phone;police;suryapeta;cheque;oxygen;kodadWed, 12 May 2021 14:36:50 GMTతెలంగాణలో కరోనాను అంతం చేయడానికి కేసీఆర్ సర్కార్ లాక్ డౌన్ విధించింది. సరిహద్దుల వద్ద కఠిన చర్యలు తీసుకుంటోంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అంబులెన్సులను కూడా రాష్ట్రంలోకి రాకుండా పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల హైకోర్టు కూడా అంబులెన్సులు సరిహద్దులు దాటొచ్చని తెలిపినప్పటికీ పోలీసులు మాత్రం వాటిని లోనికి రానీయడం లేదు. దీంతో సరిహద్దుల్లో అంబులెన్సులు క్యూ కడుతున్నాయి. ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపివేయడం వల్ల బంధువులు గగ్గోలు పెడుతున్నారు. వైద్యం కోసం వెళ్తున్న రోగుల్ని ఎలా అడ్డుకుంటారని హైకోర్టు సీరియస్ అయినా కూడా హైకోర్టు ఆదేశాలను పోలీసులు పట్టించుకోవడం లేదు. వరుసగా రెండవ రోజు కూడా ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లోఅంబులెన్స్‌లను నిలిపివేస్తున్నారు. తెలంగాణ ఆసుపత్రుల్లో బెడ్ ఉన్నట్టు అనుమతి పత్రాలు చూపిస్తేనే వదులుతున్నారు. ప్రస్తుతం నేడు రెండవ రోజు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

అనుమతి పత్రాలతో పాటు సంబంధిత ఆసుపత్రి ల్యాండ్ లైన్ నుంచి ఫోన్‌లో తమతో మాట్లాడిస్తేనే వదులుతున్నారని రోగి బంధువులు ఆందోళన చెందుతున్నారు. కొందరికైతే వెంటనే ఫోన్‌లు రావడంతో వదులుతున్నారు. మరికొందరికి ఫోన్ రావడం ఆలస్యమవుతోంది. దాంతో పోలీసులు, రోగి బంధువులు వాగ్వాదానికి దిగుతున్నారు. కొందరికైతే గంటల తరబడీ సరిహద్దుల్లోనే నిలిపేస్తున్నారు. ప్రయాణ సమయాన్ని అంచనా వేసుకుని సరిపడేంత ఆక్సిజన్ నింపుకుని వస్తున్న రోగులకు ఇది శాపంగా మారుతోంది. ఒక వేళ ఆక్సిజన్ అయిపోతే వారి పరిస్థితి ఏంటని మరికొందరు వాదిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం వద్ద ఇదే పరిస్థితి ఎదురైంది. అటు వాడపల్లి కృష్ణానది వంతెన చెక్ పోస్టు వద్ద కూడా ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను నిలిపివేస్తున్నారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో చేరేందుకు ముందస్తు అనుమతి ఉన్న వాహనాల్నే అనుమతించారు. దీంతో కరోనా రోగి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా మారాలని, కరోనా రోగుల కోసం ఆంక్షలను సరిచేయాలని వారు కోరుతున్నారు. దీనిపై సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఫండ్ తో యువకుడు జల్సాలు చివరికి ?

2-18 ఏళ్ల లోపు పిల్లలపై వాక్సిన్ సరికొత్త ప్రయోగం..?!

వీటికి సమాధానాలు చెప్పండి!. లేదా అధికారాల నుండి తప్పుకోండి సిగ్గుశరం మీకుంటే!

వైరస్ తో మరణిస్తే ..కోటి రూపాయలు ఇవ్వాల్సిందే !!

నర్సులే అసలైన దేవతామూర్తులు..!

ముంబైకి గట్టి షాక్ ఇచ్చేస్తున్న బెంగుళూర్.... ?

ఇలా చేస్తే కరోనా రాకుండా ఎలా ఉంటుంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>