PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-de08f7c4-b816-4178-8b49-bf4ed4077b2a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/china-de08f7c4-b816-4178-8b49-bf4ed4077b2a-415x250-IndiaHerald.jpgప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. కానీ దేనికీ లేని ప్రత్యేకత ఒక్క చైనాకే ఉంది అని చెప్పాలి. చైనా జనాభా పరంగా పెద్ద దేశం. ఒకపుడు ఇదే జనాభా చైనాను కొంత ఇబ్బంది పెట్టింది. ఇపుడు జనాభా నియంత్రణను సాధించుకుని అభివృద్ధి వైపుగా వడివడిగా చైనా అడుగులు వేస్తోంది. china;deva;australia;american samoa;donald trump;nasa;population;war;sea;dookudu;coronavirusచైనా అంటే హడల్... ?చైనా అంటే హడల్... ?china;deva;australia;american samoa;donald trump;nasa;population;war;sea;dookudu;coronavirusWed, 12 May 2021 10:28:50 GMTప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. కానీ దేనికీ లేని ప్రత్యేకత ఒక్క చైనాకే ఉంది అని చెప్పాలి. చైనా జనాభా పరంగా పెద్ద దేశం. ఒకపుడు ఇదే జనాభా చైనాను కొంత ఇబ్బంది పెట్టింది. ఇపుడు జనాభా నియంత్రణను సాధించుకుని అభివృద్ధి వైపుగా వడివడిగా చైనా అడుగులు వేస్తోంది.

మరో వైపు చూస్తే చైనా తన శాస్త్ర సాంకేతిక నైపుణ్యాన్ని బాగా పెంచుకుని ప్రంపంచానికే పెను సవాల్ గా మారుతోంది. చైనాకి ఒక పేరాశ ఉంది. ఎప్పటికైనా ఈ విశ్వాన్నితానే గట్టిగా  శాసించాలని. దానికి నెరవేర్చుకోవడానికి చైనా ఇప్పటిదాకా చేయని ప్రయత్నం లేదు. చైనా విషయం తీసుకుంటే ఎంతటి దాకా అయినా వెళ్ళ‌గలిగే నైజం ఆ దేశం సొంతం.  తాజాగా అంతరిక్షంలో ప్రయోగించిన చైనా రాకెట్ మిస్ ఫైర్ అయి జన వాసాల మీద పడితే  అతి పెద్ద నష్టమే జరుగుతుంది అని అంతా భావించారు.
అయితే అది చివరికి  సముద్రంలో పడి జనం బతికిపోయారు.

మరి ఇంత పని చేసిన చైనాను ఎవరైనా ఏమైనా అన్నారా. అమెరికాకు చెందిన నాసా మాత్రం చైనా మీద కొంచెం గుస్సా అయింది అంతే. దీనికి ముందు చైనా గత ఏడాది ప్రపంచం మీద వదిలిన అస్త్రమే కరోనా వైరస్ అని అంతా అన్నారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే చైనా వైరస్ అంటూ కూడా పేరు పెట్టేసారు. అయినా పెద్దన్న అమెరికా కూడా చైనాను ఏమీ అనలేకపోయిందిగా.  ఇక తాజాగా ఆస్ట్రేలియా దేశం తమ పరిశోధనలలో చైనా  జీవాయుధంగా కరోనా వైరస్ ని 2015 లోనే తయారు చేసిందని గుట్టు బయటపెట్టింది.

దాన్ని ఆధారం చేసుకుని బయో వార్ కి తెర తీసి మొత్తం ప్రపంచాన్ని గుప్పిట పట్టాలని చైనా పన్నాగమని కూడా ఆస్ట్రేలియా పేర్కొంది. కానీ చైనా మీద మరే దేశమైనా కనీసంగా అయినా మండిపాటుని ప్రదర్శించిందా.  ఎందుకంటే చైనాతో ఇపుడు దాదాపుగా అరవై నుంచి డెబ్బై దేశాలకు వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఆర్హ్దిక బంధాలు ఉన్నాయి. చైనాతో పెట్టుకుంటే ఎక్కడో  అక్కడ షాక్ తగులుతుంది.

అంతే కాదు, చైనా తెంపరితనం కూడా పెద్ద దేశాలకు తెలుసు.  చైనా దూకుడుతనాన్ని గ్రహించే అవి  వెనక్కి తగ్గుతున్నాయని అంటారు. ఇలా ప్రపంచ దేశాల బలహీనతలను  చైనా సొమ్ము చేసుకుంటూ తన బలాన్ని పెంచుకుంటోంది. దాంతో చైనా అంటే ఈ ప్రపంచానికి హడల్ అన్న మాట అయితే అంతా అనుకునే పరిస్థితి ఉంది. మరి  డ్రాగన్ ని ఇలాగే వదిలేస్తే రేపటి రోజున ఇంకా పెద్ద ముప్పు తెచ్చిపెడితే అపుడు ఈ భూగోళం సంగతేంటి. దీనికి సమాధానం ఆ దేవుడే చెప్పాలేమో.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారత్ కు మరో ముప్పు..?

తెలంగాణలో కేసీఆర్‌ను నిలదీస్తున్న ఒకే ఒక్క ఛానల్..?

డేంజరస్ రికార్డ్: 14 రోజుల్లో 50 వేల క‌రోనా మరణాలు..!!

తేజకి షాకిచ్చిన యంగ్ హీరోయిన్!

ఇండియన్ కొవిడ్ వేరియంట్ 44 దేశాల్లో కనుగొన్నాం : WHO

హెరాల్డ్ సెటైర్ : టీడీపీకి కరోనానే పొలిటికల్ ఆక్సిజన్ అందిస్తున్నట్లుందిగా

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: దివిసీమ ఎమ్మెల్యేకు బలం పెరిగిందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>