PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedఈ కరోనా కాలంలో చాలామంది ఇళ్ళకి పరిమితమై పోతున్న సంగతి తెలిసిందే. అయితే అలానే ఇంటికే పరిమితం అయిన ఒక 17 ఏళ్ల అమ్మాయి మాత్రం కరోనా మహమ్మారిని ఖతం చేసే..హైటెక్ మాస్క్' తయారు చేసి ఏకంగా గూగుల్ తో శెభాష్ అనిపించుకుంది. వివరాల్లోకి వెళ్తే బెంగాల్ కు చెందిన దిగంతికా బోస్ అనే 17 ఏళ్ల యువతి ఇంటర్ చదువుతోంది. సైంటిస్ట్ కావాలనే లక్ష్యంతో ఉన్న ఆమె కరోనా వైరస్ నిరోధక ఇన్హేలర్ మాస్క్‌ను తయారు చేసింది. దిగంతికా బోస్ ఆవిష్కరణను గూగుల్ సైతం గుర్తించిందంటే ఆమె ఆవిష్కరణ గొప్పతనం అర్ధం అవుతుంది. ప్రపంచంలోని పదcorona virus;west bengal - kolkata;google;girl;central government;coronavirusకరోనా కోసం 17 ఏళ్ల యువతి స్పెషల్ హైటెక్ మాస్కు..గూగుల్ గుర్తింపు!కరోనా కోసం 17 ఏళ్ల యువతి స్పెషల్ హైటెక్ మాస్కు..గూగుల్ గుర్తింపు!corona virus;west bengal - kolkata;google;girl;central government;coronavirusTue, 11 May 2021 15:12:08 GMTఈ కరోనా కాలంలో చాలామంది ఇళ్ళకి పరిమితమై పోతున్న సంగతి తెలిసిందే. అయితే అలానే ఇంటికే పరిమితం అయిన ఒక 17 ఏళ్ల అమ్మాయి మాత్రం కరోనా మహమ్మారిని ఖతం చేసే..హైటెక్ మాస్క్' తయారు చేసి ఏకంగా గూగుల్ తో శెభాష్ అనిపించుకుంది. వివరాల్లోకి వెళ్తే బెంగాల్ కు చెందిన దిగంతికా బోస్ అనే 17 ఏళ్ల యువతి ఇంటర్ చదువుతోంది. సైంటిస్ట్ కావాలనే లక్ష్యంతో ఉన్న ఆమె కరోనా వైరస్ నిరోధక ఇన్హేలర్ మాస్క్‌ను తయారు చేసింది. దిగంతికా బోస్ ఆవిష్కరణను గూగుల్ సైతం గుర్తించిందంటే ఆమె ఆవిష్కరణ గొప్పతనం అర్ధం అవుతుంది.  


ప్రపంచంలోని పది స్ఫూర్తిదాయకమైన డిజైన్లలో ఈ మాస్కును చేర్చి..దిగాంతికాను గూగుల్ ప్రశంసించింది. ఆమె తయారు చేసిన ఈ యాంటీ వైరస్ మాస్కులో ఒక ప్రత్యేకమైన కెమికల్ ఛాంబర్ ఉంటుంది. ఆ కెమికల్ వలన ఒకవేళ గాలిలో వైరస్ ఉంటే.. లోపలి వెళ్ళే లోపు అక్కడ ఉన్న కెమికల్ దాన్ని నాశనం చేస్తుంది. ఈ లెక్కన ఆ మాస్క్ పెట్టుకున్న వారికి వైరస్ రాకుండా నిరోధిస్తుంది. లోపలి వెళ్ళే వైరస్ ని ఎలా నాశనం చేస్తుందో కోవిడ్ బారిన పడిన వ్యక్తి నుంచి విడుదలయ్యే వైరస్ కూడా బయటకు రాకుండా మాస్కులోని వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది.


 అలానే ఈ మాస్కులో ఎయిర్ అయనైజర్ కూడా ఉంది, ఆ అయనైజర్ ఇది గాలిలోని దుమ్ము, ఇతర మలినాలను డివైడ్ చేసి..స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ మాస్క్ జాతీయ పోటీల్లో సైతం షార్ట్ లిస్ట్ అయింది. దిగంతికా ప్రయోగాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అభినందించింది. దీన్ని మార్కెట్లోకి విడుదల చేసే అంశంపై చర్చలు కూడా జరుగుతున్నాయి. గూగుల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఈ యాంటీ వైరస్ మాస్కును ప్రపంచంలోని టాప్ 10 స్ఫూర్తిదాయక డిజైన్లలో ఒకటిగా కూడా గుర్తించింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?

ఆటిజం ఉన్న పిల్ల‌ల‌కు ఆత్మీయ స్ప‌ర్శ పినాకిల్ బ్లూమ్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>