MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/salaar-prabhas-radhe-shyam-aadipurush-rebel-star-a1f5a335-37c9-4417-954c-0e85380780a8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/salaar-prabhas-radhe-shyam-aadipurush-rebel-star-a1f5a335-37c9-4417-954c-0e85380780a8-415x250-IndiaHerald.jpgపాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ లో నర్తించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన 'సలార్' సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. కోవిడ్ మహమ్మారి తీవ్రత తగ్గిన తరువాత మూవీ రెండవ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఇక అసలు విషయానికొస్తprabhas;beauty;prabhas;shruti;shruti haasan;prasanth;prashanth neel;srinidhi shetty;sruthi;cinema;bahubali;heroine;makeup;prasanth neel;prashant kishor;chitramప్రభాస్ ని రిస్క్ లో పెడుతున్న ప్రశాంత్ నీల్...ప్రభాస్ ని రిస్క్ లో పెడుతున్న ప్రశాంత్ నీల్...prabhas;beauty;prabhas;shruti;shruti haasan;prasanth;prashanth neel;srinidhi shetty;sruthi;cinema;bahubali;heroine;makeup;prasanth neel;prashant kishor;chitramTue, 11 May 2021 15:30:00 GMTపాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమవుతోంది. ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ లో నర్తించనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన 'సలార్' సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది. కోవిడ్ మహమ్మారి తీవ్రత తగ్గిన తరువాత మూవీ రెండవ షెడ్యూల్ ప్రారంభమవుతుంది.

ఇక అసలు విషయానికొస్తే... ప్రభాస్ 'సలార్'లో ద్విపాత్రాభినయం చేయనున్నాడట. ప్రభాస్ ను డ్యూయల్ రోల్స్ లో చూపించి ఆయన అభిమానులను థ్రిల్ చేయనున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కూడా ఈ విషయంలో ఉత్సాహంగా ఉన్నాడట. ఈ చిత్రంలో ప్రభాస్ స్టైల్, కావలసిన లుక్ ను రూపొందించడానికి ప్రత్యేక ప్రోస్తెటిక్, మేకప్ బృందాన్ని రంగంలోకి దించనున్నారట మేకర్స్.అయితే ప్రభాస్ ని ఓల్డ్ గెటప్ లో అభిమానులు చూడగలరా అనేది ప్రస్తుతం నడుస్తున్న చర్చ. ఇలా ఇప్పటికే డబల్ పాత్రలు ప్రభాస్ బాహుబలి లో చేసినప్పటికీ ఓల్డ్ గెటప్ లో మాత్రం ఇంతవరకు చేయలేదు.

దానివల్ల ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ రిస్క్ లో పెడుతున్నారా అని టాక్ వినిపిస్తుంది. ఒకవేళా ఈ లుక్ సరిగ్గా వర్కౌట్ కాకపోతే ఫాన్స్ కోపాన్ని ప్రశాంత్ నీల్ తట్టుకోలేడు .ఇక ఈ ఊహాగానాలు అన్ని 'సలార్'పై భారీగా అంచనాలు పెంచుతున్నాయి. 2022లో విడుదల కానున్న భారీ సినిమాల్లో 'సలార్' కూడా ఒకటి. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత రెండు నెలల్లో ఆయన ఇంకొక సినిమా అదిపురుష్ కూడా విడుదలకి సిద్ధం అవుతుంది. ఇలా ప్రభాస్ వచ్చే ఏడాది అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారు అనమాట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో క‌రోనా లేటెస్ట్ అప్‌డేట్‌... వేల‌ల్లోనే కేసులు

డేంజర్ బెల్స్: మహిళలకు ప్రమాదంగా మారుతున్న కరోనా ..

కనీసం మానవత్వం లేదా.. సర్కార్ దుమ్ముదులిపేసిన హైకోర్టు..!!

ఆ రోజున ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త డేట్.. కొత్త పోస్టర్ ?

మరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>