KidsN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children-c909a1c9-9381-4f58-a152-96786fffeafb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children-c909a1c9-9381-4f58-a152-96786fffeafb-415x250-IndiaHerald.jpgచాలా మంది చిన్న పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలో అర్ధం కాక సతమవుతూ ఉంటారు. అయితే మొదటగా చిన్నారులకు కొత్తగా ఘన ఆహారం మొదలు పెట్టినప్పుడు అది బాగా మెత్తగా చేసి ఇవ్వాలి. అలా రోజు పెడుతూ చిన్నారులకు ఆహారపు అలవాటుగా మార్చాలి. children;upma;pongali;kachi;iron;vitamin;buttermilk;bananaబుడుగు: చిన్నారులకు ఆహారపు అలవాట్లు ఇలా మార్చండి..!బుడుగు: చిన్నారులకు ఆహారపు అలవాట్లు ఇలా మార్చండి..!children;upma;pongali;kachi;iron;vitamin;buttermilk;bananaTue, 11 May 2021 17:00:00 GMTచాలా మంది చిన్న పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలో అర్ధం కాక సతమవుతూ ఉంటారు. అయితే మొదటగా చిన్నారులకు కొత్తగా ఘన ఆహారం మొదలు పెట్టినప్పుడు అది బాగా మెత్తగా చేసి ఇవ్వాలి. అలా రోజు పెడుతూ చిన్నారులకు ఆహారపు అలవాటుగా మార్చాలి. ఒకవేళ చిన్నారులు ఏ ఆహారాన్ని అయినా ఇష్టపడకపోతే.. అలాంటివి పెట్టకుండా జాగ్రత్తపడాలి.

వీరికి ఈ వయసులో తల్లిపాలు లేదంటే ఫార్ములా మిల్క్ లేదంటే రెండూ కలిపి ఇవ్వొచ్చు. దాదాపుగా అన్ని పోషకాలు తల్లి పాల నుంచి అందుతాయి. కానీ, విటమిన్ డి తగినంత అందదు. అందుకే వీరిని ప్రతీ రోజూ సూర్యోదయం సమయంలో కొంత సమయం పాటు ఎండలో ఉంచితే విటమిన్ డి అందుతుంది. లేదంటే విటమిన్ డి చుక్కల మందు రూపంలో అందించాలి. అలానే ఐరన్ కూడా వీరికి తగినంత అందదు. అందుకే వైద్యులు ఐరన్, జింక్, విటమిన్స్ కూడిన డ్రాప్స్ ను సూచిస్తుంటారు. పిల్లలకు పాలిచ్చే తల్లులు పూర్తి పోషకాహారాన్ని తీసుకోవడంపై శ్రద్ద పెట్టాలి.

పిల్లలు ఆకలి ఉన్నంత మేర తింటారు. కొంత తిన్న తర్వాత వద్దు అని ముఖం తిప్పుకుంటున్నారంటే వారి కడుపునిండినట్టుగానే అర్థం చేసుకోవాలి. పిల్లలు పెరిగేకొద్దీ వారిలో ఆకలి కూడా అలానే పెరగడం సహజంగానే జరుగుతుంది. చిన్నారులకు ఆహారంతోపాటు బాగా కాచి చల్లార్చిన నీరు కూడా తాగించడం మంచిది. ముఖ్యంగా చిన్నారులకు ఆహారంగా అన్నంలో ఉడికించిన బంగాల దుంప ,నెయ్యీతో మెత్తగా చేసిన ఆహారాన్ని పెడితే బాగా ఇష్టపడి తింటారు. అరటిపండును కూడా బాగా ఇష్టపడి తింటారు. అదేవిధంగా గోధుమ, రాగి, బియ్యంపిండి, కందిపప్పు, నెయ్యీ, నూనే తో ఉడికించిన మెత్తని ఆహార పదార్థమేదైనా ఇవ్వడం మంచిది.

ఇక ఆరు నుండి తొమ్మిది నెలల పిల్లలకు మెత్తని అన్నం, పప్పుతో పాటు కూరగాయలు కూడా ఇవ్వడం మంచిది. పిల్లలు పెరిగేకొద్దీ ఇడ్లి, ఉప్మా, పొంగలి, మజ్జిగ, అన్నం, పాయసం మొదలైనవి పెట్టడం మంచిది. ఇలా ఏ వయసుకు తగ్గట్టు అలా ఆహారం పెట్టడం వల్ల వారిలో శారీరక పెరుగుదల కూడా ఎక్కువగా వుంటుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్‌: మోడీకి జ‌గ‌న్ లేఖ‌.. కోర్కెలు తీరేనా ..

డేంజర్ బెల్స్: మహిళలకు ప్రమాదంగా మారుతున్న కరోనా ..

కనీసం మానవత్వం లేదా.. సర్కార్ దుమ్ముదులిపేసిన హైకోర్టు..!!

ఆ రోజున ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త డేట్.. కొత్త పోస్టర్ ?

మరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>