PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus9368bbce-0cd9-48a5-81c4-b52a92818c10-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus9368bbce-0cd9-48a5-81c4-b52a92818c10-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే...అంత దారుణంగా మానవాళిపై తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ రోజు గడిస్తే చాలు అనే లాగా పరిస్థితులు ఘోరంగా తయారవుతున్నాయి. అంతే కాకుండా శాస్త్రవేత్తల నుండి రోజూ వచ్చే సమాచారం వలన ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు.CORONAVIRUS;january;survey;doctor;aqua;letter;oxygen;coronavirusకరోనా కబంధ హస్తాల్లో యువత భవిష్యత్తు ..కరోనా కబంధ హస్తాల్లో యువత భవిష్యత్తు ..CORONAVIRUS;january;survey;doctor;aqua;letter;oxygen;coronavirusTue, 11 May 2021 14:42:53 GMTకరోనా వైరస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే...అంత దారుణంగా మానవాళిపై తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ రోజు గడిస్తే చాలు అనే లాగా పరిస్థితులు ఘోరంగా తయారవుతున్నాయి. అంతే కాకుండా శాస్త్రవేత్తల నుండి రోజూ వచ్చే సమాచారం వలన ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. అయితే రీసెంటుగా  ఒక సర్వే ప్రకారం ఈ కరోనా వైరస్ ఒక వయస్సులో ఉన్న వారికే అధిక హానిని తలపెడుతోందని తెలిపింది. అయితే పూర్తి వివరాల్లోకి వెళితే సెంటర్స్ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ అనే సంస్థ చేసిన ఒక సర్వేలో కరోనా బారిన పడిన వారిలో 32% మంది 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారే అని చూపించారు.   కానీ కరోనా మొదటి వేవ్ సమయంలో ఈ వయస్సు వారు 31 శాతం మంది ఉన్నారని తెలిపింది. కాగా ప్రస్తుతం కరోనా రెండవ దశలో 30 నుండి 40 వయస్సు ఉన్న వారు ప్రతి 100 మందిలో  21 మంది ఉన్నట్లుగా తమ సర్వే ద్వారా తెలియచేసింది. కాబట్టి ఇటువంటి వయసులో ఉన్నవారికి ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉంటుంది.

అయితే ఇప్పటివరకు చూసిన రిపోర్ట్స్ ప్రకారం ఈ వయసున్న యువకులలో ఊపిరితిత్తులలో కలిగే మార్పు వలన ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది.    అయితే ఈ విధంగా కరోనా వైరస్ తో ముడిపడిన అనేక అంటువ్యాధులు రావడానికి కారణం కుటుంబంలో ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందడం వలనే అని ఈ సర్వే అధికారులు తెలియచేశారు. ఇది ఇలా ఉంటే ఈ వారం ప్రారంభంలో ఐసిఎంఆర్ ఇచ్చిన నివేదికలో కరోనా రెండవ దశలో ఇప్పటివరకు హాస్పిటల్స్ లో చేరిన రోగులలో ఎక్కువ మంది 19 సంవత్సరాల లోపు వారే అని తేల్చి చెప్పింది. దీనికి ప్రధాన కారణం గత సంవత్సరం పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉండడం వలన ఈ వయస్సు వారికి ఎక్కువగా కరోనా సోకలేదు. కానీ గడిచిన 10 నెలల కాలంలో స్కూల్స్ మరియు కాలేజ్ లు తెరవడం మూలాన ఈ వయస్సు వారికే ఎక్కువ కేసులు వచ్చినట్లు వీరు తెలియచేస్తున్నారు.  అంతే కాకుండా రానున్న రోజుల్లో పిల్లలు ఎక్కువగా ఈ కరోనా రోగం బారిన పడే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైతే తల్లితండ్రులు కరోనా బారిన పడి ఉంటారో వారి వెంట హాస్పిటల్స్ కి వెల్లిన 6 నుండి 13 వయసున్న పిల్లలకు ఎక్కువగా కరోనా సోకుతోందని  ఎల్ ఎన్ జె పి వైద్యుడు తెలిపాడు.

కాగా కరోనా సోకిన వారిలో 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.  ముఖ్యంగా పిల్లల్లో కరోనా సోకినట్లు తెలిపే లక్షణాలలో వాంతులు, వీరెచనాలు,   ఎక్కువ జ్వరం మరియు జలుబు ఉంటాయని తెలిపారు. ఢిల్లీలో 1307 మంది 5 నుండి 13 సంవత్సరాల వయసున్న పిల్లలను పరీక్ష చేయగా వారిలో 50 శాతం మందికి యాంటీ బాడీస్ ఉన్నట్లు గుర్తించారు.   ఈ సంవత్సరం జనవరి 15 మరియు 23 మధ్య ఈ సర్వే జరిగింది. ప్రతి రోజూ ఇక్కడ కొత్త కేసులు సగటున 300 కేసులు. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో యువకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కోమోర్బిడిటీలు లేని కుర్రవాళ్ళు చనిపోతున్నారు. కాబట్టి అతి త్వరగా ఈ వయసు వారికి టీకాలు వేయాల్సిందిగా ఒక డాక్టర్ తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?

ఆటిజం ఉన్న పిల్ల‌ల‌కు ఆత్మీయ స్ప‌ర్శ పినాకిల్ బ్లూమ్స్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>