MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-babub4cc1e56-9533-483f-889c-3792ec3a6fb0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-babub4cc1e56-9533-483f-889c-3792ec3a6fb0-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతడి సినిమాలంటే భారీ క్రేజ్ ఉంటుంది. అయితే మహేష్ నుంచి కొత్త సినిమా విడుదలయ్యి ఏడాది కావస్తుంది. సరిలేరు నీకెవ్వరు తరువాత మహేష్ చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. ప్రస్తుతం మహేష్ తన తదుపరి సినిమా సర్కారు వారి పాట షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. చిత్ర యూనిట్ ఈ సినిమాను ముందుగా ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని భావించారు. కానీ సినిమాను వచ్చే సంక్రాంతి పోరులో దించాలని..mahesh babu;mahesh;suresh;keerthi suresh;kirti;kranthi;kranti;krishna;parasuram;ram pothineni;makar sakranti;cinema;rajani kanth;sankranthi;bank;posters;fatherసర్కారు వారి ట్రీట్.. అదేనా..?సర్కారు వారి ట్రీట్.. అదేనా..?mahesh babu;mahesh;suresh;keerthi suresh;kirti;kranthi;kranti;krishna;parasuram;ram pothineni;makar sakranti;cinema;rajani kanth;sankranthi;bank;posters;fatherTue, 11 May 2021 12:53:10 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతడి సినిమాలంటే భారీ క్రేజ్ ఉంటుంది. అయితే మహేష్ నుంచి కొత్త సినిమా విడుదలయ్యి ఏడాది కావస్తుంది. సరిలేరు నీకెవ్వరు తరువాత మహేష్ చేస్తున్న సినిమా సర్కారు వారి పాట. ప్రస్తుతం మహేష్ తన తదుపరి సినిమా సర్కారు వారి పాట షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. చిత్ర యూనిట్ ఈ సినిమాను ముందుగా ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని భావించారు. కానీ సినిమాను వచ్చే సంక్రాంతి పోరులో దించాలని నిశ్చయించుకున్నారు.

 ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ప్రారంభం నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన పోస్టర్‌లు సినిమాపై ఉన్న అంచనాలను మరింత అధికం చేశాయి. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి సరికొత్త రూమర్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

 ఈ నెల చివరిలో మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే అప్పుడు వచ్చే అప్‌డేట్ ఏమై ఉంటుందని అభిమానులు ఇప్పటినుంచే ఊహాగానాలు మొదలు పెట్టారు. అయితే గతేడాది ఇదే సమయానికి ఓ ప్రీలుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే ఈ ఏడాది కూడా ఓ పోస్టర్‌తో సరిపెడతారని టాక్ నడుస్తోంది. కానీ ఈ సారి పక్కా సాలిడ్ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ రిలీజ్ చేసేందుక ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అస్సాం సీఎం భార్య వ్యాఖ్యలు వైరల్..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>