PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-must-come-to-carona-hospitals-7a61613c-67e9-49b0-9975-be5ee8846717-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-must-come-to-carona-hospitals-7a61613c-67e9-49b0-9975-be5ee8846717-415x250-IndiaHerald.jpgజగన్ లో ఏడాదిన్నర పాటు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. అంతకు ముందు కూడా ఆయన పదేళ్ల పాటు చేయని పోరాటం లేదు, తిరగని వూరు లేదు, జగన్ ఎన్నో సార్లు దీక్షలకు కూడా దిగారు. ఇలా కష్టపడడమే తనకు తెలుసు అని జగన్ జనాల వద్ద గట్టిగానే రుజువు చేసుకున్నారు. jagan;naga chaitanya;tiru;audi;jagan;telugu;tirupati;chief minister;husband;tadepalli;chaitanya 1;mantraజగన్ బయటకు రావాల్సిందే.... ?జగన్ బయటకు రావాల్సిందే.... ?jagan;naga chaitanya;tiru;audi;jagan;telugu;tirupati;chief minister;husband;tadepalli;chaitanya 1;mantraTue, 11 May 2021 10:00:00 GMTజగన్ లో ఏడాదిన్నర పాటు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. అంతకు ముందు కూడా ఆయన పదేళ్ల పాటు చేయని పోరాటం లేదు, తిరగని వూరు లేదు, జగన్ ఎన్నో సార్లు దీక్షలకు కూడా దిగారు. ఇలా కష్టపడడమే తనకు తెలుసు అని జగన్ జనాల వద్ద గట్టిగానే రుజువు చేసుకున్నారు.

అటువంటి జగన్ సీఎం అయ్యాక మాత్రం తాడేపల్లి నుంచి బయటకు కాలు తీసి ఆసలు పెట్టడంలేదు. తెలుగుదేశం నాయకులు సెటైర్లు వేస్తున్నట్లు అది తాడేపల్లి రాజప్రాసాదం అనాలేమో. మరి జగన్ ఎందుకిలా చేస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. గడచిన రెండేళ్ళలో జగన్ బయటకు వచ్చిన సందర్భాలు బహు తక్కువ. గత ఏడాది కరోనా మొదటి విడత విలవిలలాడించిన నేపధ్యంలో కూడా జగన్ అడుగు తీసి బయటపెట్టలేదు. కధ మొత్తం తాడేపల్లి నుంచే నడిపారు.

అయితే ఇపుడు అంతకు పదింతలుగా కరోనా విజృంభించింది. ఎక్కడ చూసినా వీర విహారం చేస్తోంది. దాంతో జగన్ కాలు బయట పెట్టాల్సిందే అన్న చర్చ అయితే సాగుతోంది. జగన్ ప్రతీ రోజూ నిర్వహిస్తున్న ఉన్నత స్థాయి సమావేశాలను అధికారులు చాలా లైట్ గా తీసుకుంటున్నారు అని అర్ధం అవుతోంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఘటన ఇందుకు అద్దం పడుతోంది. ప్రజల ప్రాణాలు గాలాడక రాలిపోతున్న దైన్యం కనిపిస్తోంది.

మరో వైపు చూస్తే ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోంది. అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది. మరి అవన్నీ క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్నాయా అంటే లేదు అనే చెప్పాలి. దానికి కారణం ప్రభుత్వమే అనాలి. మంత్రులు తమ ప్రాంతాలలో కనీసం ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించడంలేదు. ఎమ్మెల్యేలు తమ పరిధిలో కరొనా వైద్యం గురించి ఆరా తీయడం లేదు. ఇక ముఖ్యమంత్రి సమీక్షల పేరిట కాలక్షేపం చేస్తున్నారు. దీంతోనే అధికారులు ఆడింది ఆట అయిందని కూడా విమర్శలు ఉన్నాయి.

అందువల్ల మొత్తం యంత్రాంగంలో చైతన్యం కలిగించాలి అంటే ముఖ్యమంత్రి కదలాలి. ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. ఎక్కడికక్కడ పరిస్థితులను స్వయంగా గమనిస్తూ బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మాత్రం రుయా ఆసుపత్రి లాంటి ఘటనలు ఇంకా జరిగినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతి ఘటనపై రంగంలోకి దిగిన మంత్రి

ఆటిజం ఉన్న పిల్ల‌ల‌కు ఆత్మీయ స్ప‌ర్శ పినాకిల్ బ్లూమ్స్

అటిజంలో స‌మ‌స్య‌ను గుర్తించిన‌ప్పుడే స‌గం విజ‌యం... శ్రీజా రెడ్డి స‌క్సెస్ ఇదే ?

ఆటిజంపై ప‌రిశోధ‌న‌లు.. స్పెష‌ల్‌గా నిలుస్తున్న శ్రీజారెడ్డి..!

శ్రీజారెడ్డి: ఓ తల్లి విజయం.. వేల తల్లులకు అద్భుత వరం..?

మమతల తల్లి శ్రీజారెడ్డి.. ఆటిజం పిల్లల పాలిట కనిపించే దేవత..?

మాతృదేవో భ‌వ‌.. అన్న మాట‌కు నిలువెత్తురూపం శ్రీజారెడ్డి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>