BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lockdownfec12e2d-e185-47dc-ad35-190292cb78af-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lockdownfec12e2d-e185-47dc-ad35-190292cb78af-415x250-IndiaHerald.jpgహైద‌రాబాద్ : రేప‌టి నుంచి ప‌దిరోజుల పాటు కొన‌సాగే లాక్‌డౌన్‌ని క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పోలీస్ కమీషనర్లు,ఎస్పీలు,డీ.ఐ.జీ స్థాయి సీనియర్ పోలీస్ అధికారులందరూ విధిగా క్షేత్ర స్థాయిలో ఉండి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.హైదరాబాద్ తోపాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా హెడ్ క్వార్టర్లు, ప్రధాన నగరాలలో పటిష్టంగా అమలు చేయాలని అధికారుల‌ను ఆదేశించారు.లాక్‌డౌన్ నుంచి వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణా లపై ఏవిధమlockdown;amala akkineni;hyderabad;telangana;district;smart phone;media;traffic police;local language;reddyలాక్‌డౌన్ క‌ఠినంగా అమ‌లు చేయాల్సిందే - తెలంగాణ డీజీపీలాక్‌డౌన్ క‌ఠినంగా అమ‌లు చేయాల్సిందే - తెలంగాణ డీజీపీlockdown;amala akkineni;hyderabad;telangana;district;smart phone;media;traffic police;local language;reddyTue, 11 May 2021 21:33:43 GMTహైద‌రాబాద్ :  రేప‌టి నుంచి ప‌దిరోజుల పాటు కొన‌సాగే లాక్‌డౌన్‌ని క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. పోలీస్ కమీషనర్లు,ఎస్పీలు,డీ.ఐ.జీ స్థాయి సీనియర్ పోలీస్ అధికారులందరూ విధిగా క్షేత్ర స్థాయిలో ఉండి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.హైదరాబాద్ తోపాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా హెడ్ క్వార్టర్లు, ప్రధాన నగరాలలో పటిష్టంగా అమలు చేయాలని అధికారుల‌ను ఆదేశించారు.లాక్‌డౌన్ నుంచి వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణా లపై ఏవిధమైన ఆంక్షలు ఉండ‌బోవ‌ని స్ప‌ష్టం చేశారు.గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధిహామీ పనులను లాక్ డౌన్ నుండి మినహాయింపు ఉంద‌న్నారు.

జాతీయ రహదారులపై ఏవిధమైన ఆంక్షలు లేవని...ప్రధాన రంగంలో ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ అక్రిడేషన్లు కానీ, పత్రికా పరమైన గుర్తింపు కార్డులు తమవెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు.ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖా పరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుందని పేర్కొన్నారు. రాష్ట్రం లో జరిగే వివాహాలకు ఇరువైపుల చెందిన 40 మంది మాత్రమే హాజరయ్యేవిధంగా చూడాలన్నారు.లాక్‌డౌన్‌లో జ‌రిగే వివాహలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని తెలిపారు.మరణాలకు సంబంధించి కేవలం 20 మందికి మాత్రమే అనుమ‌తి ఉంద‌న్నారు. కరోనా వాక్సినేషన్ కు ఎవరైనా వెళ్లాల్సివస్తే వారి మొదటి డోస్ కు సంబందించిన సమాచారం సెల్ ఫోన్ లో చూసి వారికి సడలింపు ఇవ్వాలని అధికారుల‌కు సూచించారు.

నిత్యవసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నిత్యవసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులను జారీ చేయాలని అధికారుల‌ను ఆదేశించారు.ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టం తో పాటు ఐ.పీ.సి ప్రకారం తగు కేసులు నమోదు చేయాల‌ని పేర్కొన్నారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసే వారికి ఈ- పాస్ విధానం ద్వారా సంబంధిత కమీషనర్లు, ఎస్. పీ లు పాసులను జారీ చేస్తారని స్పష్టం చేశారు.

ఈపాస్‌ల ద్వారానే అత్య‌వ‌స‌ర ప్ర‌యాణం

తెలంగాణ నుంచి ఇత‌ర రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందచేయనున్నట్లు డీజీపీ  మహేందర్ రెడ్డి తెలియ చేశారు. అత్యవసర పరిస్థితుల్లోనే అందచేసే ఈ- పాస్ లకు గాను https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులకు గాను లాక్ డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించేవారికి మాత్రమే పాసులను జారేచేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రలకూ, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి సంబంధిత పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ లు మాత్రమే పాస్ లను జారీ చేస్తారని తెలిపారు. అయితే, ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణా రాష్ట్రానికి వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ట్రాల నుండే పాస్ లు జారీ చేస్తారని అన్నారు. హైదరాబాద్ లో ఒక కమిషనరేట్ నుండి మరో కమిషనరేట్ పరిధికి ప్రయాణించే వారికి ప్రయాణం ప్రారంభమయ్యే పరిధిలోని కమీషనరేట్ నుండే పాసులు జారీ చేస్తారని వివరించారు.లాక్ డౌన్ సడలింపు సమయమైన ఉదయం ఆరు గంటలనుండి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని  స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎక్కడినుండైనా పేర్కొన్నవెబ్ సైట్ ద్వారానే ఈ-పాస్ కొరకై దరకాస్తు చేసుకోవాలని తెలిపారు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సి‌ఎం జగన్ ప్రధానికి లేఖ.. సంచలన ప్రతిపాదనలు !!

ఆటిజం చిన్నారుల పాలిట ప్రత్యేక్ష దైవంగా శ్రీజారెడ్డి సరిపల్లి

ఉద్యోగులకు శుభవార్త.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..!!

డేంజర్ బెల్స్: మహిళలకు ప్రమాదంగా మారుతున్న కరోనా ..

కనీసం మానవత్వం లేదా.. సర్కార్ దుమ్ముదులిపేసిన హైకోర్టు..!!

ఆ రోజున ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త డేట్.. కొత్త పోస్టర్ ?

మరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>