PoliticsSpydereditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/k-p-oli-pm-of-nepal-a9f41d59-f272-40f7-b5b7-0e82c6eac7eb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/k-p-oli-pm-of-nepal-a9f41d59-f272-40f7-b5b7-0e82c6eac7eb-415x250-IndiaHerald.jpgనేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీకి ఎదురు దెబ్బ తగిలింది. పార్లమెంట్‌ దిగువసభలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ఆయన ప్రభుత్వం బ‌లాన్ని నిరూపించుకోలేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అధికార నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీకి అనుకూలంగా 93 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 124 వచ్చాయి. విశ్వాస పరీక్ష నెగ్గాలంటే 271 సీట్ల ప్రతినిధుల సభలో 134 ఓట్లు రావాల్సి ఉంది. అయితే అధికార పార్టీలోని 28 మంది సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరవ్వడం సొంత పార్టీ నుంచి ఆయ‌న‌కున్న వ్య‌తిరేక‌త‌ను బ‌య‌ట‌పెట్టింది. గత వారం ఓలీ ప్రభుత్వానికి పుష్పకుమార్‌ దహలkp sharma oli;hari;hari music;nepal;prime minister;parliment;cabinet;fire;gharshana;partyనేపాల్‌లో రాజ‌కీయ సంక్షోభం... విశ్వాసం కోల్పోయిన ప్ర‌ధాన‌మంత్రి కేపీ శ‌ర్మ ఓలీనేపాల్‌లో రాజ‌కీయ సంక్షోభం... విశ్వాసం కోల్పోయిన ప్ర‌ధాన‌మంత్రి కేపీ శ‌ర్మ ఓలీkp sharma oli;hari;hari music;nepal;prime minister;parliment;cabinet;fire;gharshana;partyTue, 11 May 2021 08:30:00 GMTనేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీకి ఎదురు దెబ్బ తగిలింది. పార్లమెంట్‌ దిగువసభలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ఆయన ప్రభుత్వం బ‌లాన్ని నిరూపించుకోలేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అధికార నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీకి అనుకూలంగా 93 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 124 వచ్చాయి. విశ్వాస పరీక్ష నెగ్గాలంటే 271 సీట్ల ప్రతినిధుల సభలో 134 ఓట్లు రావాల్సి ఉంది. అయితే అధికార పార్టీలోని 28 మంది సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరవ్వడం  సొంత పార్టీ నుంచి ఆయ‌న‌కున్న వ్య‌తిరేక‌త‌ను బ‌య‌ట‌పెట్టింది. గత వారం ఓలీ ప్రభుత్వానికి పుష్పకుమార్‌ దహల్‌ అలియాస్‌ ‘ప్రచండ’ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (మావోయిస్టు సెంటర్‌) మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో విశ్వాస పరీక్ష ఎదుర్కొవాల్సి వచ్చింది.


తీర్మానం ఓడిపోవడంతో అధికరణ 100 (3) ప్రకారం ఓలీ పదవీచ్యుతుడైనట్లే.  నేపాలీ కాంగ్రెస్‌, నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (మావోయిస్ట్‌ సెంటర్‌) కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వాస్త‌వానికి ఏడాది నుంచి నేపాల్ ప్రధాని కేపీ ఓలీ సొంత పార్టీలోనే అసమ్మతి ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రభుత్వాన్ని ఏకపక్షంగా నడుపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు) విలీనమైన తర్వాత 2018లో కేపీ ఓలీని ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత పార్టీలో సంఘర్షణ మొదలైంది. రాజ్యాంగ పరిషత్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడం విషయమై ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రధాని కేపీ ఓలీ అధ్యక్షురాలు బిద్య దేవి భండారీకి సిఫార్సు చేశారు.


గ‌త సంవ‌త్స‌రం డిసెంబ‌ర్‌లో కూడా దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి పార్లమెంట్‌ను రద్దు చేశారు. అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పార్లమెంట్ రద్దుపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని నేపాల్ ప్రెసిడెంట్‌కు పంపించారు. కాగా, ఓలి నిర్ణయాన్ని అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ఇది తొందరపాటు నిర్ణయం అంటూ నిప్పులు చెరిగింది. ఆ త‌ర్వాత ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డినా ఆయ‌న‌పై పార్టీలో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఈక్ర‌మంలో ఆయ‌న ప్ర‌భుత్వంపై అవిశ్వాసం నెల‌కొన‌డంతో తాజా ప‌రిణామాల్లో అదే నిజ‌మ‌ని తేలిపోతోంది.







Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆటిజం ఉన్న పిల్ల‌ల‌కు ఆత్మీయ స్ప‌ర్శ పినాకిల్ బ్లూమ్స్

అటిజంలో స‌మ‌స్య‌ను గుర్తించిన‌ప్పుడే స‌గం విజ‌యం... శ్రీజా రెడ్డి స‌క్సెస్ ఇదే ?

ఆటిజంపై ప‌రిశోధ‌న‌లు.. స్పెష‌ల్‌గా నిలుస్తున్న శ్రీజారెడ్డి..!

శ్రీజారెడ్డి: ఓ తల్లి విజయం.. వేల తల్లులకు అద్భుత వరం..?

మమతల తల్లి శ్రీజారెడ్డి.. ఆటిజం పిల్లల పాలిట కనిపించే దేవత..?

మాతృదేవో భ‌వ‌.. అన్న మాట‌కు నిలువెత్తురూపం శ్రీజారెడ్డి..!

ఆటిజం చిన్నారుల పాలిట.. శ్రీజారెడ్డి నిరుప‌మాన సేవ‌లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>