Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hut-tapikga-marina-sonu-comments-emanado-teluaa3fd27b7f-973d-4483-94d1-d885247b91e4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hut-tapikga-marina-sonu-comments-emanado-teluaa3fd27b7f-973d-4483-94d1-d885247b91e4-415x250-IndiaHerald.jpgగత ఏడాది దేశంలో కరోనా వైరస్ ప్రవేశించి ఇక అల్లకల్లోలం సృష్టించిన నాటి నుంచి నేడు రెండవ దశ వైరస్ విజృంభిస్తున్న సమయంలో కూడా సమస్యల్లో ఉన్న వారికి తాను అండగా ఉంటాను అంటూ సోనూ సూద్ ఇప్పటికే ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ముఖ్యంగా గత ఏడాది వలస కార్మికులకు సోనూ అందించిన సాయం మాటల్లో వర్ణించలేనిది అని చెప్పాలి. కేవలం వలస కార్మికుల తో తన సహాయాన్ని ఆపకుండా ఇప్పటికీ ఎంతో మందికి సహాయం చేసి అందరికీ ఆపద్బాంధవుడిగా కనిపించే ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు సోనుసూద్. ఏకంగా సహాయం కావాలి అంటూ అడిగిన Sonu sood;sonu sood;india;france;population;central government;oxygen;coronavirusహాట్ టాపిక్ గా మారిన సోనూ కామెంట్స్.. ఏమన్నాడో తెలుసా?హాట్ టాపిక్ గా మారిన సోనూ కామెంట్స్.. ఏమన్నాడో తెలుసా?Sonu sood;sonu sood;india;france;population;central government;oxygen;coronavirusTue, 11 May 2021 01:00:00 GMTకరోనా వైరస్ ప్రవేశించి ఇక అల్లకల్లోలం సృష్టించిన నాటి నుంచి నేడు రెండవ దశ  వైరస్ విజృంభిస్తున్న  సమయంలో కూడా సమస్యల్లో ఉన్న వారికి తాను అండగా ఉంటాను అంటూ సోనూ సూద్ ఇప్పటికే ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ముఖ్యంగా గత ఏడాది వలస కార్మికులకు సోనూ అందించిన సాయం మాటల్లో వర్ణించలేనిది అని చెప్పాలి.  కేవలం వలస కార్మికుల తో తన సహాయాన్ని ఆపకుండా ఇప్పటికీ ఎంతో మందికి సహాయం చేసి అందరికీ ఆపద్బాంధవుడిగా కనిపించే ప్రత్యక్ష దైవంగా మారిపోయాడు సోనుసూద్. ఏకంగా  సహాయం కావాలి అంటూ అడిగిన  వారికి సహాయం చేసేందుకు సొంత ఆస్తులను సైతం తాకట్టు పెట్టుకునేందుకు సిద్ధమయ్యాడు.



 సినీ పరిశ్రమలో విలన్ పాత్రలు చేస్తూ మనిషి అంటే ఇలా ఉండకూడదు అనుకునే సోనుసూద్ ఇక నిజజీవితంలో మాత్రం ఏకంగా గొప్ప మనసు చాటుకుంటూ మనిషి అంటే ఇలాగే ఉండాలి అని ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తూ ఎంతోమంది ప్రాణాలు నిలబెడుతున్నాడు. అయితే ప్రస్తుతం దేశంలో గత ఏడాదితో పోలిస్తే రెండవ దశ కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. అదే సమయంలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ను కంట్రోల్ చేయడంలో విఫలం అవుతున్నాయి అన్న విమర్శలు కూడా వస్తున్నాయి.



 తాజాగా ఇదే విషయంపై స్పందించిన హెల్పింగ్ స్టార్ సోనుసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం సన్నద్ధతతో లేదు సోను సూద్ విమర్శించాడు. అంతే కాకుండా దేశ జీడీపీలో ఒకటి లేదా రెండు శాతం మాత్రమే వైద్య వ్యవస్థకు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి అంటూ గుర్తు చేశారు. ఇలాంటి చర్యలతో కరోనా వైరస్ లాంటి ప్రాణాంతకమైన వైరస్ లను ఎప్పటికీ ఎదుర్కోలేము అంటూ వ్యాఖ్యానించారు.  ప్రస్తుతం భారత్ అత్యధిక జనాభా ఉన్న దేశం అయినప్పటికీ జనాభాను  వైరస్ ఎదుర్కోలేక పోవడానికి కారణం గా చూపలేము అంటూ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వాలు పొరపాటు చేసాయి అన్న విషయాలను అంగీకరించాల్సిందే.. ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రతరం అవుతుంది. ఈ క్రమంలోనే చైనా ఫ్రాన్స్ దేశాలతో  చర్చలు జరుపుతున్నా అంటూ చెప్పుకొచ్చారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టీఎన్‌ఆర్ మృతిపై సినీ ప్రముఖుల ఎమోషనల్ ట్వీట్స్

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మహేష్ బాబు ట్వీట్..!

చైనా మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని మొద‌లుపెట్టేసిందా..?

జగన్ కుడిభుజం టార్గెట్... ?

ఆరోజు బాక్సాఫీస్ బ్రేక్ అవ్వడం .... థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం .... !!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>