PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/moist-lanu-kabalistunna-corona-polisula7e1b4a75-e55f-4e6b-95f4-50ea8f5ffcb1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/moist-lanu-kabalistunna-corona-polisula7e1b4a75-e55f-4e6b-95f4-50ea8f5ffcb1-415x250-IndiaHerald.jpgకరోనా అన్ని రంగాల వారిపై ప్రభావం చూపుతోంది.. కరోనా ప్రభావం ఇప్పడు మావోయిస్టులపైనా చూపుతోంది. ఇప్పటికే పలువురు మావోయిస్టు నేతలు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. వారి వైద్యం కోసం అడవుల్లో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలిసింది. అందుకే ఇప్పుడు వారు మావోయిస్టులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. కరోనా బారిన పడిన మావోయిస్టులు జనజీవన స్రవంతి కలుస్తున్నట్టు ప్రకటిస్తే.. వారికి మంచి వైద్య సదుపాయం, పునరావసం అందిస్తామని ప్రకటన చేస్తున్నారు. ఆంధ్ర - చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పలువురు naxals;godavari river;district;scheduled caste;police;aquaమావోయిస్టులను కబళిస్తున్న కరోనా.. పోలీసుల బంపర్ ఆఫర్..?మావోయిస్టులను కబళిస్తున్న కరోనా.. పోలీసుల బంపర్ ఆఫర్..?naxals;godavari river;district;scheduled caste;police;aquaTue, 11 May 2021 08:14:24 GMTకరోనా అన్ని రంగాల వారిపై ప్రభావం చూపుతోంది.. కరోనా ప్రభావం ఇప్పడు మావోయిస్టులపైనా చూపుతోంది. ఇప్పటికే పలువురు మావోయిస్టు నేతలు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. వారి వైద్యం కోసం అడవుల్లో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలిసింది. అందుకే ఇప్పుడు వారు మావోయిస్టులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. కరోనా బారిన పడిన మావోయిస్టులు జనజీవన స్రవంతి కలుస్తున్నట్టు ప్రకటిస్తే.. వారికి మంచి వైద్య సదుపాయం, పునరావసం అందిస్తామని ప్రకటన చేస్తున్నారు.

ఆంధ్ర - చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పలువురు మావోయిస్టులకు  కరోనా సోకినట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసు  నిఘా వర్గాలకు ఉన్న సమాచారం మేరకు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. గాలికొండ దళం,  బీకే, ఈజీ డీవీసీ దళం , కుంట ఏరియా కమిటీ దళాలకు చెందిన మావోయిస్టు నాయకులకు, దళ సభ్యులకు, మిలీషియా సభ్యులకు కరోనా సోకిందని పోలీసులు చెబుతున్నారు.

కరోనా సోకిన మావోయిస్టులు దగ్గు, ఒళ్లు నొప్పులు, జలుబు తదితర  సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మావోయిస్టులు  జనజీవన స్రవంతిలోకి వచ్చి చేరితే... కరోనాకి సరైన చికిత్సను సకాలంలో ఉచితంగా పొందవచ్చంటున్నారు  తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ  అద్నాన్ నయీం అస్మి.. మావోయిస్టు అగ్రనాయకులు  దళ సభ్యులను నిర్బంధంలో ఉంచి వారి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ఆయన సూచిస్తున్నారు.

మావోయిస్టు దళ సభ్యులు, నాయకులు సరైన నిర్ణయం తీసుకొని పోలీసులను  ఆశ్రయిస్తే  చికిత్సకు, ప్రాణాలకు,  పునరావాసానికి భరోసా కల్పిస్తామంటున్నారు  తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ. ఏదేమైనా పోలీసులు కరోనా సమయాన్ని ఇలా కూడా ఉపయోగించుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.  మరి పోలీసుల ఆఫర్‌ను మావోయిస్టులు పరిగణలోకి తీసుకుంటారా.. అడవులను వదిలి జన జీవనంలోకి వచ్చి కరోనా చికిత్స పొందుతారా.. అన్నది చూడాలి.  





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నేపాల్‌లో రాజ‌కీయ సంక్షోభం... విశ్వాసం కోల్పోయిన ప్ర‌ధాన‌మంత్రి కేపీ శ‌ర్మ ఓలీ

అటిజంలో స‌మ‌స్య‌ను గుర్తించిన‌ప్పుడే స‌గం విజ‌యం... శ్రీజా రెడ్డి స‌క్సెస్ ఇదే ?

ఆటిజంపై ప‌రిశోధ‌న‌లు.. స్పెష‌ల్‌గా నిలుస్తున్న శ్రీజారెడ్డి..!

శ్రీజారెడ్డి: ఓ తల్లి విజయం.. వేల తల్లులకు అద్భుత వరం..?

మమతల తల్లి శ్రీజారెడ్డి.. ఆటిజం పిల్లల పాలిట కనిపించే దేవత..?

మాతృదేవో భ‌వ‌.. అన్న మాట‌కు నిలువెత్తురూపం శ్రీజారెడ్డి..!

ఆటిజం చిన్నారుల పాలిట.. శ్రీజారెడ్డి నిరుప‌మాన సేవ‌లు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>