Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nikhilfd53f653-2f6f-4ba4-b7ea-55522fb80096-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nikhilfd53f653-2f6f-4ba4-b7ea-55522fb80096-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో వేరే చెప్పక్కర్లేదు. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు. ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క, సరైన వైద్యం లభించక.. ఇలా అనేక కారణాలతో అనేకమంది కుటుంబ సభ్యలు కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే అనేకమంది సెలబ్రిటీలు తమ వంతుగా పేద ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ..nikhil;chiranjeevi;mahesh;ntr;prabhas;venkatesh;nikhil;siddharth;jr ntr;karthikeya;kartikeya;rbi;tollywood;media;hero;nandamuri taraka rama rao;oxygen;vకరోనా పోరులో హీరో నిఖిల్.. ఆక్సిజన్, మెడిసిన్స్ అందిస్తూ..!కరోనా పోరులో హీరో నిఖిల్.. ఆక్సిజన్, మెడిసిన్స్ అందిస్తూ..!nikhil;chiranjeevi;mahesh;ntr;prabhas;venkatesh;nikhil;siddharth;jr ntr;karthikeya;kartikeya;rbi;tollywood;media;hero;nandamuri taraka rama rao;oxygen;vTue, 11 May 2021 23:07:42 GMTదేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో వేరే చెప్పక్కర్లేదు. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు. ఆక్సిజన్ అందక, బెడ్లు దొరక్క, సరైన వైద్యం లభించక.. ఇలా అనేక కారణాలతో అనేకమంది కుటుంబ సభ్యలు కళ్లముందే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే అనేకమంది సెలబ్రిటీలు తమ వంతుగా పేద ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా చేరాడు. ఈ కష్ట కాలంలో శాయశక్తులా కరోనా బాధితులకు తన వంతు సాయం అందిస్తున్నాడు.

కరోనా బాధితుల్లో రక్తం అవసరం ఉన్నవారికి వెంటనే బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తం అందించడం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి తన వంతుగా కొంత మొత్తాన్ని అందించడం, అలాగే ఆసుపత్రుల్లో ఉన్న పేషెంట్లకు సాయం చేయడం వంటి అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. అంతేకాకుండా ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు, అవసరైన ఔషధాలు వంటి వాటిని కూడా తన శక్తిమేర సమకూరుస్తున్నాడు. అంతేకాకుండా తన సాయం ఎవరికి కావాల్సి వచ్చినా.. వెంటనే సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటున్నాడు.

ఇదిలా ఉంటే నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ 2 సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో చేస్తున్నాడు. ఇంకా కొన్ని కథలు వింటున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. దీంతో నిఖిల్ ఇంటికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే ఇటీవల దేశంలోని కరోనా పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో షేర్ చేశాడు. దానికి తోడో ఇప్పుడు నేరుగా సాయం చేయడానికి రంగం లోకి దిగాడు.

కాగా.. టాలీవుడ్ నుంచి ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు కరోనా బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ప్రధానంగా సినీ ఇండస్ట్రీలో ఉపాధి కోల్పోవడంతో ఇబ్బందులు పడుతున్న అనేకమందిని ఆర్థికంగా ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్ వంటి వారంతా తమవంతుగా సాయం అందిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భీష్మ హీరోతో మెగా హీరో.. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే బంపర్ హిట్టే..

ఆటిజం చిన్నారుల పాలిట ప్రత్యేక్ష దైవంగా శ్రీజారెడ్డి సరిపల్లి

ఉద్యోగులకు శుభవార్త.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..!!

డేంజర్ బెల్స్: మహిళలకు ప్రమాదంగా మారుతున్న కరోనా ..

కనీసం మానవత్వం లేదా.. సర్కార్ దుమ్ముదులిపేసిన హైకోర్టు..!!

ఆ రోజున ఆర్ఆర్ఆర్ నుంచి కొత్త డేట్.. కొత్త పోస్టర్ ?

మరికాసేప‌ట్లో లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>