PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpea7e44d3-26e9-4f9e-b2d0-74b41635e5c2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpea7e44d3-26e9-4f9e-b2d0-74b41635e5c2-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా కరోనా ప్రజల ఊపిరి తీస్తుంది. మొదటి వేవ్‌లో కాస్త కనికరించిన కరోనా...రెండో వేవ్‌లో ఏ మాత్రం కరుణ లేకుండా విజృంభిస్తుంది. రోజుకూ 4 లక్షల పైనే ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. వేల సంఖ్యలో మరణిస్తున్నారు. ఇక ఈ కరోనా ఏపీలో కూడా తీవ్రంగా ఉంది. ఊహించని విధంగా కరోనా కేసులు వస్తున్నాయి. దీంతో ఏపీలో ఆసుపత్రులు ఫుల్ అయిపోయాయి. అటు ఆక్సిజన్ కొరత లేదని పాలకులు చెబుతున్నా కూడా వాస్తవ పరిస్థితులు అలా లేవు.ysrcp;ycp;oxygen;partyఆ ఎమ్మెల్యేలు సైడ్ అయిపోయినట్లేనా...ఆ ఎమ్మెల్యేలు సైడ్ అయిపోయినట్లేనా...ysrcp;ycp;oxygen;partyTue, 11 May 2021 04:00:00 GMTదేశ వ్యాప్తంగా కరోనా ప్రజల ఊపిరి తీస్తుంది. మొదటి వేవ్‌లో కాస్త కనికరించిన కరోనా...రెండో వేవ్‌లో ఏ మాత్రం కరుణ లేకుండా విజృంభిస్తుంది. రోజుకూ 4 లక్షల పైనే ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. వేల సంఖ్యలో మరణిస్తున్నారు. ఇక ఈ కరోనా ఏపీలో కూడా తీవ్రంగా ఉంది. ఊహించని విధంగా కరోనా కేసులు వస్తున్నాయి. దీంతో ఏపీలో ఆసుపత్రులు ఫుల్ అయిపోయాయి. అటు ఆక్సిజన్ కొరత లేదని పాలకులు చెబుతున్నా కూడా వాస్తవ పరిస్థితులు అలా లేవు.


ఎక్కువ మంది ఆక్సిజన్ అందకే చనిపోతున్నారు. అయితే ప్రభుత్వ పరంగా ఎంత చేయాలో అంత చేస్తుంది. కానీ తమని గెలిపించిన ప్రజల కోసం నాయకులు మాత్రం ముందుకు వస్తున్నట్లు కనిపించడం లేదు. మొదటి వేవ్ ఉన్న సమయంలో లాక్‌డౌన్ పెట్టినప్పుడు నాయకులంతా రోడ్ల పైకి వచ్చారు. ప్రజలకు ఉచితంగా మాస్కూలు, శానిటైజర్లు, కూరగాయలు, నిత్యవసరాలు అందించారు.


కానీ ఈ రెండో వేవ్‌లో నాయకులు పెద్దగా కనిపించడం లేదు. అధికార పక్షం కావొచ్చు, ప్రతిపక్షం కావొచ్చు ఏ నాయకుడు కూడా ప్రజలని పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. అందులోనూ వైసీపీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కానీ అంతే పెద్దగా ప్రజలకు అండగా ఉంటున్నట్లు లేరు. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఓట్ల కోసం ప్రజల దగ్గరకొచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకునే పరిస్తితి లేదు.


పోనీ కరోనా తీవ్రంగా ఉంది కాబట్టి బయటకు రావడం లేదు అనుకోవచ్చు. బయటకు రాకపోయినా ప్రజలకు ఏదొక రూపంలో సాయం చేస్తే బెటర్‌గా ఉంటుంది. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ఏదొక విధంగా ప్రజలకు సాయం చేస్తున్నారు. కానీ ప్రజాప్రతినిధులంతా రంగంలోకి దిగి ప్రజలకు అండగా ఉంటే పరిస్తితి వేరుగా ఉంటుంది. మరి చూడాలి ఏ నాయకుడు ప్రజల కోసం నిలబడతారో.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అబ్బబ్బా.. ఏం టాలెంట్ గురూ.. ఆ పాప ఇరగదీసిందంతే?

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మహేష్ బాబు ట్వీట్..!

చైనా మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని మొద‌లుపెట్టేసిందా..?

జగన్ కుడిభుజం టార్గెట్... ?

ఆరోజు బాక్సాఫీస్ బ్రేక్ అవ్వడం .... థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం .... !!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>