HealthSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/these-are-the-foods-that-increase-immunity2fa4c6f2-4b89-4a80-b48a-596a07ae3027-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/these-are-the-foods-that-increase-immunity2fa4c6f2-4b89-4a80-b48a-596a07ae3027-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఈ క్లిష్ట సమయంలో ఈ మహమ్మారిని తట్టుకొని నిలబడాలంటే రోగనిరోధక శక్తి చాలా అవసరం. ఈ సమయంలో విటమిన్స్, పోషకాలు ఎక్కువగా లభించే ఆహార పదార్దాలను తీసుకోవాలి. అయితే మనం రోజు తినే టమాట, బీరకాయ, వంకాయ, బెండకాయ, దోసకాయ, మునగ వంటి కూరగాయల్లో కూడా విలువైన పోషకాలు ఉంటాయి.immunity;jeevitha rajaseskhar;nithya new;tara;vitamin;brinjal;shakti;coronavirusఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్దాలు ఇవే..!ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్దాలు ఇవే..!immunity;jeevitha rajaseskhar;nithya new;tara;vitamin;brinjal;shakti;coronavirusTue, 11 May 2021 13:00:00 GMTదేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఈ క్లిష్ట సమయంలో ఈ మహమ్మారిని తట్టుకొని నిలబడాలంటే రోగనిరోధక శక్తి చాలా అవసరం. ఈ సమయంలో విటమిన్స్, పోషకాలు ఎక్కువగా లభించే ఆహార పదార్దాలను తీసుకోవాలి. అయితే మనం రోజు తినే టమాట, బీరకాయ, వంకాయ, బెండకాయ, దోసకాయ, మునగ వంటి కూరగాయల్లో కూడా విలువైన పోషకాలు ఉంటాయి. ఇక వీటిలో దొరికే పోషకాలు గురించి ఒక్కసారి చూద్దామా.

బీట్‌ రూట్‌ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది బీట్‌ రూట్‌ ను జ్యూస్ చేసుకొని తాగుతారు. ఇక ఇందులో చెంచా నిమ్మరసం కలుపుకుని తాగితే కామెర్లు, వాంతులు, వికారం, అతిసారం వంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ప్రస్తుతం కరోనా లాంటి వైరస్‌ నుంచి రక్షణకు క్యారెట్‌ రసం ఎంతో ఉపయోగపడుతున్నది. శరీరంలో ఉన్న రక్తాన్ని వృద్ధి చేయడానికి బీట్‌రూట్‌ ఉపయోగపడుతుంది.

దోసకాయలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. దోసకాయని ఆహారంగా తీసుకోవడం వల్ల ఒంటికి ఎంతో చలువ. జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను నివారిస్తున్నది. కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం లాంటి సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా దోసకాయను ఎక్కువ శాతం ప్రజలు పిల్లలకు తినిపిస్తారు. కాకరకాయను తినడంతో ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది. కాకర రసం తాగడంతో కలరా లాంటి వ్యాధులు దరిచేరవు. కాకర తినడంతో శరీరంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. మరెన్నో పోషకాలను కాకర అందిస్తున్నది.

వంకాయలో శరీరానికి పోషక పదార్థాలు పుష్కలంగా అందుతాయి. యాంటీబయోటిక్‌గా కూడా వంకాయ పనిచేస్తుంది. కూరగాయల్లో వంకాయను రారాజుగా చెబుతారు. ఏ పంక్షన్‌ జరిగినా వంకాయ కూర ఉండాల్సిందే. చాలా మంది వంకాయను ఇష్టపడి మరీ తింటారు. టమాటా తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. మధుమేహంతో బాధపడేవారికి టమాట ఎంతో మేలుచేస్తుంది. టమాటతో బరువు తగ్గడంతో పాటు స్థూలకాయం కూడా తగ్గుతుంది. నిత్య జీవితంలో ఎక్కువ శాతం ప్రజలు టమాటను వినియోగిస్తారు. కూరలు, చట్నీలతో పాటు సలాడ్లలో దీనిని ఉపయోగిస్తారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అస్సాం సీఎం భార్య వ్యాఖ్యలు వైరల్..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>