Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan9ee47339-4c67-4b0e-87e7-c04055d76f3c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan9ee47339-4c67-4b0e-87e7-c04055d76f3c-415x250-IndiaHerald.jpgరవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఖిలాడీ సినిమాను రమేశ్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత రమేశ్ వర్మకు ఓ సూపర్ ఛాన్స్ వచ్చేలా ఉంది. అదే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్ చేయడం. అవును రమేశ్ వర్మ డైరెక్షన్‌లో పవర్ స్టార్ నెక్స్ట్ మువీ ఉండే అవకావాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నిజానికి పవన్‌ను డైరెక్ట్ చేయాలని అనేకమంది డైరెక్టర్లు అనుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే పవర్ స్టార్ కూడా ఈ మధ్య కాలంలో చిన్న, యువ డైరెక్టర్లకే..pawan kalyan;pawan;ram gopal varma;bandla ganesh;pawan kalyan;ravi teja;cinema;yuva;gabbar singhఖిలాడీ డైరెక్టర్‌తో పవర్ స్టార్‌.. ఛాన్స్ ఇస్తాడా..?ఖిలాడీ డైరెక్టర్‌తో పవర్ స్టార్‌.. ఛాన్స్ ఇస్తాడా..?pawan kalyan;pawan;ram gopal varma;bandla ganesh;pawan kalyan;ravi teja;cinema;yuva;gabbar singhTue, 11 May 2021 00:05:00 GMT
రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఖిలాడీ సినిమాను రమేశ్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత రమేశ్ వర్మకు ఓ సూపర్ ఛాన్స్ వచ్చేలా ఉంది. అదే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను డైరెక్ట్ చేయడం. అవును రమేశ్ వర్మ డైరెక్షన్‌లో పవర్ స్టార్ నెక్స్ట్ మువీ ఉండే అవకావాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నిజానికి పవన్‌ను డైరెక్ట్ చేయాలని అనేకమంది డైరెక్టర్లు అనుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే పవర్ స్టార్ కూడా ఈ మధ్య కాలంలో చిన్న, యువ డైరెక్టర్లకే ఎక్కువ అవకాశాలిస్తున్నాడు.

రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం పవన్ పెద్ద దర్శకుల కంటే చిన్న డైరెక్టర్స్ తో సినిమా చేయడం బెటర్ అని భావిస్తున్నారు. పవన్ డేట్స్ మరియు షూటింగ్ ప్లాన్స్ అన్నీ అనుకున్నట్టు జరగాలంటే చిన్న దర్శకులకు అవకాశం ఇవ్వొచ్చు. ఇటీవల చేసిన 'వకీల్ సాబ్'.. ప్రస్తుతం చేస్తున్న 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. పవన్ సైతం స్టార్ డైరెక్టర్స్ వెనుక పడకుండా మంచి కథతో వచ్చే దర్శకులతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు స్వయంగా వెల్లడించారు. దీంతో రమేశ్ వర్మతో సినిమా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్యే బండ్ల గణేశ్ పవన్‌తో ఓ సినిమా చేస్తానని ప్రకటించాడు. రీ ఎంట్రీ తర్వాత పవర్ చాలా సినిమాలను ఒప్పుకున్నాడు. అందులో బండ్ల గణేశ్‌తో కూడా ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. గతంలో పవన్ తో 'తీన్ మార్' 'గబ్బర్ సింగ్' వంటి సినిమాలు తీసిన బండ్ల గణేష్.. తన బాస్‌తో మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే పవన్ కోసం బండ్ల గణేశ్ రమేశ్ వర్మను సెట్ చేశాడని టాక్ నడుస్తోంది. ఇప్పటికే పవన్‌కు స్టోరీ లైన్ కూడా వినిపించడం జరిగిందట.

నిజానికి రమేశ్ వర్మ ఇప్పుడు ఖిలాడీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అంతకుముందు 'రాక్షసుడు' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. కానీ 'రాక్షసుడు' కంటే ముందు చాలా సినిమాలు చేసినా గుర్తింపు రాలేదు. రవితేజతో కూడా 'వీర' సినిమా చేశాడు. కానీ అదికూడా అంతగా ఆడలేదు. అలాంటి ఒక్క సినిమా హిట్ డైరెక్టర్‌తో పవన్ చేస్తాడా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ మహేష్ బాబు ట్వీట్..!

చైనా మూడో ప్ర‌పంచ యుద్ధాన్ని మొద‌లుపెట్టేసిందా..?

జగన్ కుడిభుజం టార్గెట్... ?

ఆరోజు బాక్సాఫీస్ బ్రేక్ అవ్వడం .... థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం .... !!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!

ఆ అజాగ్రత్తే NTR కరోనాకు కారణమా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>