MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/trivikram-planning-his-next-movie-with-venkatesh-after-mahesh5730d177-2d76-48a3-a00f-bec890b2869b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/trivikram-planning-his-next-movie-with-venkatesh-after-mahesh5730d177-2d76-48a3-a00f-bec890b2869b-415x250-IndiaHerald.jpgత్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుకి దర్శకుడే అయినా స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించాడు. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అతడి సినిమాలో డైలాగ్స్ చాలా ప్రత్యేకం, అందరినీ ఆలోచింపజేసేలా ఉంటాయి. అతడి డైలాగుల దెబ్బకే..trivikram;mahesh;venkatesh;anil music;anil ravipudi;srinivas;tamannaah bhatia;trivikram srinivas;varun;varun sandesh;varun tej;cinema;comedy;hero;malliswari;nuvvu naaku nachav;f3మరో స్టార్‌ హీరోని లైన్ చేసిన త్రివిక్రమ్.. ఆ సినిమా కోసమే..?మరో స్టార్‌ హీరోని లైన్ చేసిన త్రివిక్రమ్.. ఆ సినిమా కోసమే..?trivikram;mahesh;venkatesh;anil music;anil ravipudi;srinivas;tamannaah bhatia;trivikram srinivas;varun;varun sandesh;varun tej;cinema;comedy;hero;malliswari;nuvvu naaku nachav;f3Tue, 11 May 2021 13:07:25 GMTత్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుకి దర్శకుడే అయినా స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించాడు. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అతడి సినిమాలో డైలాగ్స్ చాలా ప్రత్యేకం, అందరినీ ఆలోచింపజేసేలా ఉంటాయి. అతడి డైలాగుల దెబ్బకే అతడికి మాటల మాంత్రికుడని కితాబిచ్చారు. ఇక అతడు అగ్రహీరోలతో జతకట్టాడంటే ఆ సినిమా ప్రారంభం నుంచి స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తుంది.

 అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ వరుస సినిమాలు చేసేందుకు సిద్దమయ్యాడట. అయితే తాజాగా తన సినిమాకు మహేష్‌ను ఓకే చేశాడు. అయితే త్రివిక్రమ్ మహేష్‌ సినిమా తరువాత తాను చేసే సినిమాకి కూడా హీరోని ఫిక్స్ చేశాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇంతకు ముందు ఎన్‌టీఆర్‌తో ఓ సినిమా ఫిక్స్ అయినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దాంతో మహేష్ సినిమాను ముందుకు తీసుకువచ్చాడు. అంతేకాకుండా మహేష్ తర్వాత మరో స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేశాడట.

 అది ఎవరితోనో కాదండీ.. విజయాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న విక్టరీ వెంకటేష్. అయితే వెంకీని త్రివిక్రమ్ ఇప్పటి వరకు డైరెక్ట్ చేయలేదు. కానీ మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలకు కథ, మాటలు అందించాడు. ఇక చాలా కాలం నుంచి వీరిద్దరు కలిసి ఓ సినిమా చేయాలని చూస్తున్నారు. అందులో భాగంగా వెంకీ 75వ సినిమా త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్నాడట. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఓ స్పెషల్ కథను కూడా సిద్ధం చేశాడని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ సెకండ్ హీరోగా చేస్తున్నాడు. అంతేకాకుండా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా విడుదల పై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలో చిత్ర యూనిట్ ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అస్సాం సీఎం భార్య వ్యాఖ్యలు వైరల్..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>