PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bharatha-desamlo-a-varient-virus-who-andolana17524cea-0cfd-4d0b-8064-fbd2bd2acdf0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bharatha-desamlo-a-varient-virus-who-andolana17524cea-0cfd-4d0b-8064-fbd2bd2acdf0-415x250-IndiaHerald.jpgభారత్ లో కరోనా కేసుల పెరుగుదల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది. కేసులు తగ్గడానికి, కరోనాను అంతం చేయడానికి లాక్ డౌన్ పెట్టడమే సరైన నిర్ణయమని తెలియజేసింది. వ్యాక్సినేషన్ ను అందిరికీ అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. రెండో దశ వ్యాప్తికి కారణమవుతోన్న B.1.617 వేరియంట్‌ను భారత్‌లో తొలిసారిగా అక్టోబరులోనే గుర్తించారని డబ్ల్యూహెచ్ఓ కోవిడ్ విభాగం చీఫ్ మారియా వాన్ కేర్ఖేవే తెలిపారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం B.1.617 వేరియంట్ అత్యంత ప్రమాదకారని, మేము దీనిని ప్రపంచ స్థాయి వైwho, world health organization, carona virus;india;sri lanka;october;central governmentభారత్ లో ఆ వేరియంట్.. డబ్ల్యుహెచ్ఓ ఆందోళన..?భారత్ లో ఆ వేరియంట్.. డబ్ల్యుహెచ్ఓ ఆందోళన..?who, world health organization, carona virus;india;sri lanka;october;central governmentTue, 11 May 2021 12:30:00 GMTభారత్ లో కరోనా కేసుల పెరుగుదల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది. కేసులు తగ్గడానికి, కరోనాను అంతం చేయడానికి లాక్ డౌన్ పెట్టడమే సరైన నిర్ణయమని తెలియజేసింది. వ్యాక్సినేషన్ ను అందిరికీ అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. భారత్ లో కరోనా పెరగడానికి మరో కారణాన్ని కూడా డబ్బ్యుహెచ్ ఓ తెలిపింది. ప్రస్తుతం కరోనా రెండో దశ వ్యాప్తికి కారణమవుతోన్న B.1.617 వేరియంట్‌ను భారత్‌లో తొలిసారిగా అక్టోబరులోనే గుర్తించారని డబ్ల్యూహెచ్ఓ కోవిడ్ విభాగం చీఫ్ మారియా వాన్ కేర్ఖేవే తెలిపారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం B.1.617 వేరియంట్ అత్యంత ప్రమాదకారని, మేము దీనిని ప్రపంచ స్థాయి వైవిధ్యంగా వర్గీకరిస్తున్నామని అన్నారు. ప్రస్తుత డేటా ఆధారంగా ఈ వేరియంట్‌తో బాధపడుతున్న వ్యక్తులలో మరణాన్ని నివారించడంలో టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని మారియా తన ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని డబ్ల్యూహెచ్ఓ ప్రతి మంగళవారం వెల్లడించే కోవిడ్ ఆప్‌డేట్స్‌లో తెలియజేయనున్నట్టు వివరించారు.

భారత్‌లో ఉత్పరివర్తనం చెందిన B.1.617 వైరస్‌ రకం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు పాకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. 17 దేశాల్లో ఈ కరోనా వేరియంట్ వైరస్‌ రకాన్ని గుర్తించినట్లు పేర్కొంది. B.1.617 డబుల్ మ్యుటెంట్‌ను తొలిసారిగా భారత్‌లో బయటపడగా యూకే, సింగపూర్‌ సహా పలు దేశాల్లో దీనిని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇతర రకాలతో పోలిస్తే ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. భారత్‌లో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడానికి బీ.1.617 కారణమని అంచనా వేసింది. B.1.617 వైరస్‌ రకం కేసులు మూడు రోజుల కిందట శ్రీలంక, బంగ్లాదేశ్‌లోనూ వెలుగు చూశాయి. దీంతో ఆయా దేశాల అధికారులు వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు చేపట్టారు. దీనిపై మరింత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాలకు డబ్ల్యుహెచ్ సూచనలు చేసింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనా ఎఫెక్ట్ : మాజీ తెరాస ఎమ్మెల్యేకు జరిమానా ..!!

అటిజం చిన్నారుల నిజమైన తల్లి ' శ్రీజారెడ్డి స‌రిపల్లి ' ప్రస్థానం .. !

శ్రీజ రెడ్డి బర్త్ డే స్పెషల్ : ఆమె ఆలోచన.. కోట్లాది పిల్లలకు వెలుగుదీవెన !!

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>