PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tmc-aiadmk-dmk-bjp-west-bengal-tamilanadu36961ead-3148-4dff-a514-9ef73f5389f4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tmc-aiadmk-dmk-bjp-west-bengal-tamilanadu36961ead-3148-4dff-a514-9ef73f5389f4-415x250-IndiaHerald.jpgప‌శ్చిమ‌బెంగాల్‌లో మమ‌తా బెన‌ర్జీ ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించారో దేశ‌మంతా చూసింది. అంతేకాదు.. త‌మిళ‌నాడులో ద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం అధినేత స్టాలిన్ కూడా విజ‌య‌ప‌తాకాన్ని ఎగ‌ర‌వేయ‌డంతోపాటు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. దేశ‌వ్యాప్తంగా ఇప్పుడు ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల వ్య‌వ‌హార‌శైలిపైనే అంద‌రి దృష్టి ప‌డింది. 213 సీట్లు సాధించిన తృణ‌మూల్ కాంగ్రెస్‌, మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిపి 159 సీట్లు సాధించిన డీఎంకే త‌మ త‌మ రాష్ట్రాల్లో అధికార పీఠాన్ని చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిన ఉతtmc, aiadmk, dmk, bjp, west bengal, tamilanadu;udhayanidhi stalin;bharatiya janata party;stalin;partyమ‌మ‌త‌ను, స్టాలిన్‌ను ఎదురించేవారెవ‌రు?మ‌మ‌త‌ను, స్టాలిన్‌ను ఎదురించేవారెవ‌రు?tmc, aiadmk, dmk, bjp, west bengal, tamilanadu;udhayanidhi stalin;bharatiya janata party;stalin;partyTue, 11 May 2021 11:18:34 GMTప‌శ్చిమ‌బెంగాల్‌లో మమ‌తా బెన‌ర్జీ ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించారో దేశ‌మంతా చూసింది. అంతేకాదు.. త‌మిళ‌నాడులో ద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం అధినేత స్టాలిన్ కూడా విజ‌య‌ప‌తాకాన్ని ఎగ‌ర‌వేయ‌డంతోపాటు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. దేశ‌వ్యాప్తంగా ఇప్పుడు ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల వ్య‌వ‌హార‌శైలిపైనే అంద‌రి దృష్టి ప‌డింది. 213 సీట్లు సాధించిన తృణ‌మూల్ కాంగ్రెస్‌, మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిపి 159 సీట్లు సాధించిన డీఎంకే త‌మ త‌మ రాష్ట్రాల్లో అధికార పీఠాన్ని చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిన ఉత్సాహంలో ఉన్న వీరిని ఆయా రాష్ట్రాల్లో ఢీకొట్టేవారెవ‌రా? అనే ఆస‌క్తి కూడా ఇప్పుడు అంద‌రిలో నెల‌కొంది.

బెంగాల్‌లో సువేందు!
ప‌శ్చిమ‌బెంగాల్‌లోని నందిగ్రామ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీపై గెలుపొందిన బీజేపీ నేత సువేందునే ఆ పార్టీ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఎంపిక చేసింది. తృణ‌మూల్ నుంచి బీజేపీలో చేరిన సువేందు రాష్ట్ర‌వ్యాప్తంగా త‌న ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయిన‌ప్ప‌టికీ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం చావుత‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన చందాన బ‌య‌ట‌ప‌డ్డారు. గ‌త ఎన్నిక‌ల్లో టీఎంసీ త‌ర‌ఫున 80వేల మెజార్టీతో గెలుపొందిన సువేందు ఈసారి 1956 ఓట్ల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ఈయ‌న అయితేనే మ‌మ‌తాను అసెంబ్లీలో, బ‌య‌ట గ‌ట్టిగా ఢీకొట్ట‌గ‌లుగుతార‌ని, త‌ర్వాత కూడా త‌మ పార్టీని అధికారంలోకి తేగ‌లుగుతార‌ని బీజేపీ న‌మ్ముతోంది. ఆ న‌మ్మ‌కంతోనే మమ‌త‌ను ఢీకొట్టే నేత‌గా సువేందుకు ఆ పార్టీ అధిష్టానం తీర్చిదిద్దుతోంది.

త‌మిళ‌నాడులో ప‌ళనిస్వామా? ప‌న్నీర్ సెల్వ‌మా?
త‌మిళ‌నాడు అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత‌గా అన్నాడీఎంకే త‌ర‌ఫున ప‌ళ‌నిస్వామి పేరును శాస‌న‌స‌భ స్పీక‌ర్‌కు ఆ పార్టీ నేత‌లు ఇచ్చారు. ప‌ళినిస్వామి పేరును ఇచ్చిన‌ప్ప‌టికీ భ‌విష్య‌త్తులో అసెంబ్లీలో అన్నాడీఎంకే త‌ర‌ఫున ప‌న్నీర్ సెల్వం కూడా ఉండొచ్చ‌ని ఆ పార్టీవ‌ర్గాలే భావిస్తున్నాయి. వ్యూహాలు ర‌చించ‌డంలో దిట్ట అయిన ప‌న్నీర్ తాజాగా జ‌య‌ల‌లిత నిచ్చెలి శ‌శిక‌ళ‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. ఈ ప్ర‌య‌త్నాలు ఎంత‌వ‌ర‌కు విజ‌య‌వంత‌మ‌వుతాయి? అన్నాడీఎంకేకు ఎంత‌వ‌ర‌కు క‌లిసివ‌స్తుంద‌నేది భ‌విష్య‌త్తే నిర్ణ‌యించాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

జాతీయ రాజ‌కీయాల్లో కీల‌కం కానున్న మ‌మ‌త‌, స్టాలిన్‌?
ఇటీవ‌ల విడుద‌లైన ఐదురాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు జాతీయ రాజ‌కీయాల‌ను కూడా శాసించ‌బోతున్నాయ‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు, రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అందులో మ‌మ‌తాబెన‌ర్జీ, స్టాలిన్ ముఖ్య‌భూమిక పోషించ‌బోతున్నార‌ని భావిస్తున్నారు. వారి వారి రాష్ట్రాల్లోనే పూర్తిగా నిల‌వ‌రించ‌గ‌లిగితే జాతీయ రాజ‌కీయాల్లో మ‌మ‌త‌, స్టాలిన్ ప్రాముఖ్య‌త‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌ని బీజేపీ భావిస్తోంది. అందుకే వీరికి ధీటైన‌వారిగా సువేందు అధికారిని, ప‌ళ‌నిస్వామిని రంగంలోకి దింపింది. మ‌రి ఎంత‌వ‌ర‌కు వీరిని ఆ పార్టీ నిలువ‌రించ‌గ‌లుగుతుంద‌నేది కాల‌మే నిర్ణ‌యించాలి!!.








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?

ఆటిజం ఉన్న పిల్ల‌ల‌కు ఆత్మీయ స్ప‌ర్శ పినాకిల్ బ్లూమ్స్

అటిజంలో స‌మ‌స్య‌ను గుర్తించిన‌ప్పుడే స‌గం విజ‌యం... శ్రీజా రెడ్డి స‌క్సెస్ ఇదే ?

ఆటిజంపై ప‌రిశోధ‌న‌లు.. స్పెష‌ల్‌గా నిలుస్తున్న శ్రీజారెడ్డి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>