MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/coronavirusa0e2ebbd-62e3-43ae-8a66-c4667ad51259-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/coronavirusa0e2ebbd-62e3-43ae-8a66-c4667ad51259-415x250-IndiaHerald.jpgకరోనా సంక్షోభం సమయంలో దేశ ప్రజలంతా అల్లాడిపోతున్నారు. దేవుడి ఇంతలా మానవాళిపై ఆగ్రహం చెందాడా అన్నట్లుగా కరోనా తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పుడు కరోనా నియంత్రణ కోసం ఎంతోమంది వైద్య శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వాలు అనేక మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం ఒక ప్రత్యామ్నాయం అయినప్పటికీ మిగతా చికిత్సా పద్దతుల కోసం అన్వేషిస్తున్నారు. CORONAVIRUS;amitabh bachchan;deva;editor mohan;nidhi;delhi;jagan;andhra pradesh;media;february;oxygen;sv mohan reddy;reddyనెటిజన్లపై ఫైర్ అయిన అమితాబ్ ... కారణమిదే ?నెటిజన్లపై ఫైర్ అయిన అమితాబ్ ... కారణమిదే ?CORONAVIRUS;amitabh bachchan;deva;editor mohan;nidhi;delhi;jagan;andhra pradesh;media;february;oxygen;sv mohan reddy;reddyTue, 11 May 2021 12:00:00 GMTకరోనా సంక్షోభం సమయంలో దేశ ప్రజలంతా అల్లాడిపోతున్నారు. దేవుడి ఇంతలా మానవాళిపై ఆగ్రహం చెందాడా అన్నట్లుగా కరోనా తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పుడు కరోనా నియంత్రణ కోసం ఎంతోమంది వైద్య శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వాలు అనేక మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం ఒక ప్రత్యామ్నాయం అయినప్పటికీ మిగతా చికిత్సా పద్దతుల కోసం అన్వేషిస్తున్నారు. ఇకపోతే వ్యాక్సిన్ దేశమంతా వేయడానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయం పట్టే అవకాశముందని ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలియచేసిన విషయం తెలిసిందే. ఈ కరోనా ధాటికి తాళలేక ఎంతోమంది అసువులు బాస్తున్నారు. వీరిలో కనీసం కొంతమందిని అయినా కాపాడేందుకు దేశంలోని ఎంతోమంది సంపన్నులు, సినీ సెలెబ్రిటీలు, క్రికెటర్లు ముందుకు వచ్చి తమ వంతు సాయం చేస్తున్నారు. అయితే ఒకవైపు మీడియా మరో వైపు నెటిజన్లు ఈ విధంగా సహాయం చేస్తున్న వారిని ఆకాశానికి ఎత్తేస్తూ, ఏ విధమైన సహాయం చేయని వారిని ట్రోల్ చేస్తున్నారు.  

కొంతమంది నెటిజన్లు అయితే సహాయం చేయని సెలెబ్రిటీలను, ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన సహాయం వారు చేస్తుంటే, కొందరు సెలెబ్రిటీలు మాత్రం ఏమీ పట్టనట్టు ఊరుకుంటున్నారని, ఇంత డబ్బున్నా సహాయంచేసే మనసు మాత్రం రావడం లేదని ట్రోల్స్ చేస్తున్నారు.  ఈ ట్రోల్స్ కి మన బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పందించారు.  చేసిన సహాయాన్ని చెపుకోవాలా అంటూ నెటిజన్లపై ధ్వజమెత్తారు. తనకు ఎప్పుడూ సహాయం చేయడం తెలుసు కానీ, వాటిని చెప్పుకుని తిరగడం అలవాటు లేదన్నారు. ఈ సందర్భంగా తాను చేసిన కొన్ని సహాయ కార్యక్రమాలను మనతో పంచుకున్నారు. గతంలో కరోనా సమయంలో నా వ్యక్తిగత నిధి నుండి కరోనా కోసం పోరాడుతున్న ఎంతోమంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మాస్కులు మరియు  పీపీఈ కిట్లు ఇచ్చినట్లు తెలిపారు. అంతే కాకుండా 1500 మంది రైతుల బ్యాంకు రుణాలను నేనే మాఫీ చేశానన్నారు. 4 లక్షల మంది రోజు వారీ కూలీలకు ఒక నెల రోజులపాటు ఆహారాన్ని అందించానని చెప్పారు.  ఎంతోమంది వలస కార్మికులు తిరిగి వారి సొంతూరికి వెళ్ళడానికి రవాణా సహాయం చేశానన్నారు. ఇలా ఎన్నో సహాయాలను చేశాను. కానీ వీటిని చెప్పుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. 

అంతే కాకుండా నిన్న అమితాబ్ కరోనా రోగుల కోసం 2 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. మరియు విదేశాల నుంచి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు తెప్పించి ఢిల్లీ, ముంబైలో ఉన్న ఆసుపత్రులకు ఇవ్వడం జరిగింది. అమితాబ్ ఢిల్లీ లో ఉన్న శ్రీ గురు తేగ్ బహదూర్ కోవిడ్ సెంటర్ కు డబ్బు మరియు విదేశాల నుండి తెప్పించిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లను అందించారని సిఖ్ మేనేజ్‌మెంట్‌ కమిటీ అధ్యక్షుడు మణ్‌జిందర్‌ సింగ్‌ శీర్షా తెలిపారు. ఇకనైనా చెప్పుకుంటేనే సేవలు చేస్తున్నారు అని అనుకోవడం మానెయ్యాలని మరి కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, ఇది కనీ వినీ ఎరుగని.. మనము అంతా ప్రాణాల కోసం చేస్తున్న యుద్ధం. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ ఉదారతను చూపాలని అంత కోరుకుందాం.










Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గంగా నదిలో శవాల పాపం ఎవరిది...?

టాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్... ?

ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?

ఆటిజం ఉన్న పిల్ల‌ల‌కు ఆత్మీయ స్ప‌ర్శ పినాకిల్ బ్లూమ్స్

అటిజంలో స‌మ‌స్య‌ను గుర్తించిన‌ప్పుడే స‌గం విజ‌యం... శ్రీజా రెడ్డి స‌క్సెస్ ఇదే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>