MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hbd------ce6642cd-6e35-408a-b393-3e254b2ec788-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hbd------ce6642cd-6e35-408a-b393-3e254b2ec788-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు ఎన్నో కలలతో అడుగు పెడుతూ ఉంటారు. అలా అడుగుపెట్టిన వారు మొదటి డెబ్యూ సినిమాతోనే ఓవర్ నైట్ లోనే స్టార్డంను సంపాదించుకుంటే, మరికొంతమంది మాత్రం ఎంత ప్రయత్నించినా సక్సెస్ ను సాధించలేకపోతున్నారు.ఇక మరి కొంతమందేమో వారి నటన తో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటూ, సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక అంతేకాకుండా కేవలం కొన్ని సినిమాలకే పరిమితం అవుతూ, వారిలో దాగి ఉన్న టాలెంట్ ఏంటో అందరికీ చూపిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు రాజ్ తరుణ్ కూడా.. రాజ్ తరHBD రాజ్ తరుణ్;avika gor;ram gopal varma;raj;tarun;tiru;virinchi varma;visakhapatnam;cinema;telugu;smart phone;vishakapatnam;tirupati;tamil;husband;heroine;success;father;raj tarun;balloon;uyyala jampala;iddari lokam okate;orey bujjiga;tarun kumar;chitram;cinema chupistha mava;loverరాజ్ తరుణ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?రాజ్ తరుణ్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?HBD రాజ్ తరుణ్;avika gor;ram gopal varma;raj;tarun;tiru;virinchi varma;visakhapatnam;cinema;telugu;smart phone;vishakapatnam;tirupati;tamil;husband;heroine;success;father;raj tarun;balloon;uyyala jampala;iddari lokam okate;orey bujjiga;tarun kumar;chitram;cinema chupistha mava;loverTue, 11 May 2021 10:30:00 GMT
సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు ఎన్నో కలలతో అడుగు పెడుతూ ఉంటారు. అలా అడుగుపెట్టిన వారు మొదటి డెబ్యూ సినిమాతోనే ఓవర్ నైట్ లోనే స్టార్డంను సంపాదించుకుంటే, మరికొంతమంది మాత్రం ఎంత ప్రయత్నించినా  సక్సెస్ ను  సాధించలేకపోతున్నారు.ఇక మరి కొంతమందేమో వారి నటన తో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటూ, సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక అంతేకాకుండా కేవలం కొన్ని సినిమాలకే పరిమితం అవుతూ, వారిలో దాగి ఉన్న టాలెంట్ ఏంటో అందరికీ చూపిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు రాజ్ తరుణ్ కూడా..

రాజ్ తరుణ్ మే -11 - 1993 విశాఖపట్నంలో జన్మించారు. ఇక నటన మీద ఆసక్తితో ముందు లఘు చిత్రాలలో నటించాడు. ఇక వీటి ద్వారా బాగా పేరును సంపాదించుకున్న రాజ్ తరుణ్, ఆ తర్వాత 2013లో విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఉయ్యాల జంపాల సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమాలో  అవికా గోర్ హీరోయిన్ గా, రాజ్ తరుణ్  సరసన నటించి అందరిని మెప్పించింది.


ఆ తర్వాత 2017లో సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు , ఈడోరకం ఆడోరకం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ , కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు, రంగుల రాట్నం,  రాజు గాడు, లవర్, ఇద్దరి లోకం ఒకటే ,ఒరేయ్ బుజ్జిగా వంటి చిత్రాలలో నటించి , తనకంటూ ఒక స్థానాన్ని సినీ ఇండస్ట్రీలో ఏర్పరుచుకున్నారు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా బెలూన్ అనే చిత్రంలో నటించాడు. ఈ చిత్రం ద్వారా అక్కడ కూడా అందరినీ మెప్పించారు.


ఇక రాజ్ తరుణ్  ఎప్పుడూ అంటుండే మాట ఏమిటంటే.." నా అపజయాల నుండి మరింత జాగ్రత్తగా ఉండాలని నేర్చుకున్నాను. ఒక్కొక్క సినిమా ఒక్కో కారణం వల్ల ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. మంచి స్క్రిప్ట్ ను ఎంపిక చేసుకున్నప్పటికీ దానిని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడంలో ఎక్కడో చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం. అందుకే అవి ఆదరణ పొంది ఉండకపోవచ్చు. సాధారణంగా నేను స్క్రిప్టు ఎంపికలో ఎవరి సలహాలు తీసుకోను. నాకు నచ్చితే  ఓకే చెప్తాను ..లేదంటే లేదు. రాజ్ తరుణ్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈయన సినిమా ఏదైనా విడుదలవుతోంది అంటే చాలు రిలీజ్ అయ్యే రోజున తన ఫోన్ ను స్విచాఫ్ చేస్తాడట. సాయంత్రం రివ్యూ చూడడానికి మాత్రమే ఫోన్ ఆన్ చేస్తాడట. ఇక ఇద్దరి లోకం ఒకటే సినిమాకు ముందు తిరుపతి మొక్కు తీర్చుకొని, జుట్టు లేకుండా ఫేక్ జుట్టుతో సినిమాను సక్సెస్ చేశారు రాజ్ తరుణ్..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎమ్మెల్యేనే టార్గెట్ చేసిన కేటుగాళ్లు..!!

డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!

పిల్లల్లో ఆటిజానికి తల్లి తండ్రులు కూడా కారణం అంటున్న శ్రీజా సరిపల్లి... ఇస్తున్న సలహా ఏంటీ...?

ఆటిజం ఉన్న పిల్ల‌ల‌కు ఆత్మీయ స్ప‌ర్శ పినాకిల్ బ్లూమ్స్

అటిజంలో స‌మ‌స్య‌ను గుర్తించిన‌ప్పుడే స‌గం విజ‌యం... శ్రీజా రెడ్డి స‌క్సెస్ ఇదే ?

ఆటిజంపై ప‌రిశోధ‌న‌లు.. స్పెష‌ల్‌గా నిలుస్తున్న శ్రీజారెడ్డి..!

శ్రీజారెడ్డి: ఓ తల్లి విజయం.. వేల తల్లులకు అద్భుత వరం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>