HealthSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/ash-gourdb0a2c326-8df5-4756-8746-0fa24c28df59-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/ash-gourdb0a2c326-8df5-4756-8746-0fa24c28df59-415x250-IndiaHerald.jpgప్రాచీన కాలం నుంచే ఎన్నో వ్యాధులకు చికిత్సగా ఉపయోగిస్తున్న బూడిద గుమ్మడికాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. వీటిలో జీరో కొలెస్ట్రాల్ తో పాటు చాలా తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల ప్రతిరోజు ఉదయం మితాహారం గా జ్యూస్ తాగితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా అధిక బరువు కూడా తగ్గుతుంది. బూడిద గుమ్మడి కాయ లో పుష్కలంగా లభించే విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, జింక్, ఐరన్, మాంగనీస్, అయోడిన్ శరీరంలోని జీవక్రియ రేటును ash gourd;gummadi;vitamin c;iron;vitamin;heart;aqua;cholesterol;zeroబూడిద గుమ్మడికాయలో ఔషధ గుణాలెన్నో..బూడిద గుమ్మడికాయలో ఔషధ గుణాలెన్నో..ash gourd;gummadi;vitamin c;iron;vitamin;heart;aqua;cholesterol;zeroMon, 10 May 2021 13:00:00 GMTనీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. వీటిలో జీరో కొలెస్ట్రాల్ తో పాటు చాలా తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల ప్రతిరోజు ఉదయం మితాహారం గా జ్యూస్ తాగితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా అధిక బరువు కూడా తగ్గుతుంది. బూడిద గుమ్మడి కాయ లో పుష్కలంగా లభించే విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, జింక్, ఐరన్, మాంగనీస్, అయోడిన్ శరీరంలోని జీవక్రియ రేటును మెరుగుపరచడంలో బాగా దోహదపడతాయి.



విష హరిణీగా పిలవబడే బూడిదగుమ్మడికాయ ఆటలమ్మ జ్వరము, కామెర్లు, మధుమేహ వ్యాధులను తగ్గిస్తుంది. బూడిద గుమ్మడికాయ రసం బట్ట తల, చుండ్రు వంటి సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. బూడిద గుమ్మడి కాయలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి డైట్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ ఛాయస్ అవుతుంది. నెలసరి సమయంలో ఆడవారు మూత్రంలో మంట, శరీరంలో వేడి వంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు గుమ్మడి కాయ రసం నాలుగు చెంచాల తేనెతో పుచ్చుకుంటే ఉపశమనం కలుగుతుంది.



గుమ్మడి కాయ లోని గింజలు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. గుమ్మడికాయ గింజలు మెత్తగా దంచి కొబ్బరి పాలలో కలుపుకొని తాగితే కడుపులోని పురుగులు మలం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. ముక్కు ద్వారా లేదా మూత్రం ద్వారా రక్తం పడుతుంటే.. బూడిద గుమ్మడికాయ ముక్కలు తేనే ఉసిరికాయ లతో కలిపి తీసుకోవడం వల్ల రక్తస్రావం ఆగిపోతుంది. మూత్రద్వారం, కిడ్నీలు శుభ్రపరచడంలో బూడిద గుమ్మడికాయ కీలక పాత్ర పోషిస్తుంది. బూడిద గుమ్మడికాయ రోజూ ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ, శ్వాసక్రియ వ్యవస్థ, థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగుపడుతాయి. చర్మ వ్యాధులతోపాటు శరీరం పైన పుండ్లను నయం చేయడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: హైదరబాద్ లో భారీ అగ్నిప్రమాదం..!!

ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పన్నా .... ??

బ్రహ్మచారి 'దేవి' పెళ్లికి మహూర్తం ఎప్పుడో..?

టీఎన్‌ఆర్‌ జీవిత విశేషాలు ఇవే..!

TNR మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం..!!

వెండి తెర మీదా తళుక్కున మెరిసిన పరిటాల శ్రీరాం ?

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>