PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-virus-covid-bedscf2fbeb4-5320-4fc8-9421-1883728a437e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/carona-virus-covid-bedscf2fbeb4-5320-4fc8-9421-1883728a437e-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా తన పంజా విసురుతోంది. రోజురోజుకూ చాలా మంది ప్రాణాలను తీస్తోంది. ఈ కరోనా టైంలో వైద్యం అందరికీ అందని ద్రాక్షాలా మారింది. ప్రైవేటు ఆస్పత్రులు భారీ మొత్తంలో వసూలు చేస్తున్న సంఘటనలు తేటతెల్లమవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైద్యం యమ ఖరీదుగా మారంది. కరోనా సోకిన ఓ బాధితురాలికి ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూ బెడ్ కోసం ఏకంగా రూ.1.30 లక్షలు డిమాండ్ చేసిన సంఘటన కలకలం రేపుతోంది. రాజస్థాన్ లోని జైసూర్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో కేవలం ఐసీయూ బెడ్ కోసమే రూ.1.30 లక్షలు డిమాండ్ చేయడం దేశవ్యాప్తంగా చర్చcarona-virus, covid beds;health;ashok;gurjar;rajasthan;smart phone;police;university;wife;arrest;anti-corruption bureau;panjaa;redదారుణం : బెడ్ కోసం బేరాలు..?దారుణం : బెడ్ కోసం బేరాలు..?carona-virus, covid beds;health;ashok;gurjar;rajasthan;smart phone;police;university;wife;arrest;anti-corruption bureau;panjaa;redMon, 10 May 2021 11:15:00 GMT
దేశంలో కరోనా తన పంజా విసురుతోంది. రోజురోజుకూ చాలా మంది ప్రాణాలను తీస్తోంది. ఈ కరోనా టైంలో వైద్యం అందరికీ అందని ద్రాక్షాలా మారింది. ప్రైవేటు ఆస్పత్రులు భారీ మొత్తంలో వసూలు చేస్తున్న సంఘటనలు తేటతెల్లమవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైద్యం యమ ఖరీదుగా మారంది. కరోనా సోకిన ఓ బాధితురాలికి ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూ బెడ్ కోసం ఏకంగా రూ.1.30 లక్షలు డిమాండ్ చేసిన సంఘటన కలకలం రేపుతోంది. రాజస్థాన్ లోని జైసూర్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో కేవలం ఐసీయూ బెడ్ కోసమే రూ.1.30 లక్షలు డిమాండ్ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో ఓ నర్సును అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆసుపత్రికి చెందిన ఓ నర్సు తనకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసీయూ బెడ్ ను రూ. 1.30 లక్షలకు విక్రయించినట్టు అశోక్ గుర్జార్ అనే బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.

తన భార్య ఐసీయూలో చేరడానికి ముందు లంచం డబ్బులో రూ. 95 వేలను చెల్లించినట్టు తెలిపాడు. బుధవారం చేరిన ఆమె 48 గంటల చికిత్స తర్వాత శుక్రవారం మరణించిందని పేర్కొన్నాడు. అయినప్పటికీ నర్స్ వదలకుండా మిగతా రూ.35 వేల కోసం ఫోన్ చేస్తూ ఇబ్బంది పెట్టాడు. దీంతో అశోక్ ఏసీబీని ఆశ్రయించాడు. ఆదివారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అశోక్ నుంచి రూ. 23 వేల లంచం తీసుకుంటుండగా నర్సును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు ఇతర సిబ్బందితో నిందితుడికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో పనిచేస్తున్న ఓ వైద్యుడికి కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం లంచం సొమ్ములో అతడు రూ. 50 వేలు తీసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఏపీలో రేషన్ షాపులు బంద్..!!

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!

బ్రేకింగ్: కరోనాతో జర్నలిస్ట్ TNR కన్నుమూత..!!

విజయవాడ వాసులకు వాక్సినేషన్ వాయిదా

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>