MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kids-to-these-celebrities-in-the-industry2d3d74b4-c3d7-4901-84d6-8d4daff165ce-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kids-to-these-celebrities-in-the-industry2d3d74b4-c3d7-4901-84d6-8d4daff165ce-415x250-IndiaHerald.jpgఅమ్మ అని పిలిపించుకోవడం కోసం ప్రతి మహిళ ఎన్నో కలలు కంటూ ఉంటుంది. డబ్బు, ఆస్తి, పేరు పేరు ప్రతిష్ట ఎంత సంపాదించుకున్న పిల్లలు లేకుంటే ఆలోటు వేరు. ఇక సినిమాల్లో అమ్మలుగా, బామ్మలుగా నటించిన నటీమణుల విషయంలోనూ అమ్మతనం కరవైంది. వాళ్ళు ఎవ్వరో ఒక్కసారి చూద్దామా. celebrities;women;cbn;ntr;jeevitha rajaseskhar;nirmalamma;pratishta;sharath;suryakantham;marriage;audience;comedy;comedian;woman;suryakantam;heroine;nandamuri taraka rama rao;sharrath marar1ఇండస్ట్రీలో ఈ సెలెబ్రెటీలకు పిల్లలు .!ఇండస్ట్రీలో ఈ సెలెబ్రెటీలకు పిల్లలు .!celebrities;women;cbn;ntr;jeevitha rajaseskhar;nirmalamma;pratishta;sharath;suryakantham;marriage;audience;comedy;comedian;woman;suryakantam;heroine;nandamuri taraka rama rao;sharrath marar1Mon, 10 May 2021 06:00:00 GMT మహిళ జీవితం బిడ్డకు జన్మనివ్వడంతో పరిపూర్ణ అవుతుందని మనం చాలా సార్లు విన్నాము. అమ్మ అని పిలిపించుకోవడం కోసం ప్రతి మహిళ ఎన్నో కలలు కంటూ ఉంటుంది. డబ్బు, ఆస్తి, పేరు పేరు ప్రతిష్ట ఎంత సంపాదించుకున్న పిల్లలు లేకుంటే ఆలోటు వేరు. ఇక సినిమాల్లో అమ్మలుగా, బామ్మలుగా నటించిన నటీమణుల విషయంలోనూ అమ్మతనం కరవైంది. వాళ్ళు ఎవ్వరో ఒక్కసారి చూద్దామా.

అలనాటి నటి సూర్యకాంతం గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె గయ్యాళి అత్తగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్, ఎఎన్ఆర్ లకే కాకుండా చాలా మంది హీరోలకు అమ్మగా, బామ్మగా నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇక నట జీవితంలో అమ్మ పాత్రలతో మెప్పించిన సూర్యకాంతంకు నిజ జీవితంలో పిల్లలు లేరు. చిత్ర పరిశ్రమలో అన్నపూర్ణమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె మొదట్లో హీరోయిన్ గా నటించారు. ఆ తరవాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అన్నపూర్ణమ్మకు అమ్మ క్యారెక్టర్ ఇచ్చినంత గుర్తింపు ఏ క్యారెక్టర్ ఇవ్వలేదనే చెప్పాలి. ఆమెకు పిల్లలు లేరు.


నిర్మలమ్మ గురించి తెలియని వారంటూ ఉండరు. ఈమె చిరంజీవితో సహా చాలా మంది హీరోలకు అమ్మగా, బామ్మగా నటించారు. అప్పట్లో దర్శకనిర్మాతలకు అమ్మ పాత్ర అంటే చాలు నిర్మలమ్మే గుర్తుకొచ్చేవారు. ఈమె అమ్మగా సెంటిమెంట్ కూడా పండించి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. నిర్మలమ్మకు కూడా పిల్లలు లేరు. ఇండస్ట్రీలో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు రమాప్రభ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె కెరీర్ మొదట్లో రాజబాబు తో కలిసి కామెడీ క్యారెక్టర్స్ చేసేవారు. తెలుగు సినిమాల్లో మూడు తరాల ఆర్టిస్టులతో కలిసి నటించారు. అప్పట్లో ఆమె సినిమాల్లో బాగా బిజీగా ఉండేవారు. ఆమె తన తోటి నటుడు శరత్ బాబుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లపాటు కలిసి ఉన్నా మధ్యలో వచ్చిన గొడవలతో విడిపోదాం అనుకుని విడిపోయారు. రమాప్రభకు కూడా పిల్లలు లేరు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

శ్రీలంకలో భారత్ పర్యటన ..షెడ్యూల్ ఇదే

హెరాల్డ్ ఎడిటోరియల్ : కమల్ కు విషయం అర్ధమైపోయిందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : పగ్గాలను కోర్టులు చేతిలోకి తీసేసుకున్నాయా ?

'మే 9'.. వైజయంతీ మూవీస్ కి చాలా స్పెషల్.. ఎందుకో మీరే చూడండి..??

తనదైన స్టైల్ లో మదర్స్ డే విషెస్ తెలిపిన ఆర్జీవీ..

తాను పడ్డ కష్టం ఏ తల్లి పడకూడదు అని గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీజారెడ్డి..!!

విజయ్ దేవరకొండ ఆస్తి అన్ని కోట్లా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>