MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bollywood44ff20bf-2aa4-482d-af0c-23c74c64bb4b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/bollywood44ff20bf-2aa4-482d-af0c-23c74c64bb4b-415x250-IndiaHerald.jpgబాలీవుడ్‌ స్టార్ దర్శకుల్లో సంజలీలా భన్సాలీ ఒకరు. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో చూడచక్కని సినిమాలను రూపొందించడంలో సంజయ్ సిద్ద హస్తుడు. సినిమాలను గ్రాండియర్‌గా తెరకెక్కించేవారిలో సంజయ్ టాప్‌లో వస్తాడు. అలానే బాలీవుడ్ హీరోల్లో షారుఖ్ ఖాన్ కూడా అదే రీతిలో అద్భుత సినిమాలను చేస్తాడు. తనదైన నటనతో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అయితే వీరిద్దరి..Bollywood;deepika padukone;dimple kapadia;madhuri dixit;salman khan;shahrukh khan;anand malayalam actor;jeevitha rajaseskhar;india;hosta;bollywood;cinema;television;jaan;hindi;british;john;anand deverakonda;sharukh khanరిపీట్ అవుతున్న క్రేజీ కాంబో?.. ఆ సినిమా కోసమే..రిపీట్ అవుతున్న క్రేజీ కాంబో?.. ఆ సినిమా కోసమే..Bollywood;deepika padukone;dimple kapadia;madhuri dixit;salman khan;shahrukh khan;anand malayalam actor;jeevitha rajaseskhar;india;hosta;bollywood;cinema;television;jaan;hindi;british;john;anand deverakonda;sharukh khanMon, 10 May 2021 14:48:11 GMTబాలీవుడ్‌ స్టార్ దర్శకుల్లో సంజలీలా భన్సాలీ ఒకరు. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో చూడచక్కని సినిమాలను రూపొందించడంలో సంజయ్ సిద్ద హస్తుడు. సినిమాలను గ్రాండియర్‌గా తెరకెక్కించేవారిలో సంజయ్ టాప్‌లో వస్తాడు. అలానే బాలీవుడ్ హీరోల్లో షారుఖ్ ఖాన్ కూడా అదే రీతిలో అద్భుత సినిమాలను చేస్తాడు. తనదైన నటనతో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా వీరిద్దరికీ బ్రేక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. వీరి కాంబోలో 2002లో దేవదాసు అనే సినిమా తెరకెక్కింది.

 అందులో షారుఖ్ సరసన మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్ హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమా అప్పట్లో బ్రిటీష్ అకాడమి ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ అవార్డ్స్‌కు ఎన్నికైన ఏకైక హిందీ సినిమా. ఆ తరువాత వీరిద్దరూ తమతమ సినిమాలతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. హీరోగా షారుఖ్ బాలీవుడ్ క బాద్ షా అనిపించుకుంటే భన్సాలీ గ్రాండియర్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాలేదు. కానీ వీరి కాంబోలో సినిమా వస్తే చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం వారి ఎదురుచూపులు ఫలించాయి. 19 సంవత్సరాల తరువాత వీరి కాంబోలో మరో సినిమా వస్తుందట. ఈ సినిమా ఓ ప్రేమకథ అని టాక్ ఉంది.  ‘ఇజార్’ సినిమా కోసం వీరిద్దరు మళ్లీ కలవబోతున్నారని, వీరిద్దరి మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ప్రేయసి కోసం ఇండియా నుంచి నార్వేకు సైకిలింగ్ చేసిన ఓ వ్యక్తి జీవితం స్ఫూర్తిగా ఈ సినిమా రూపొందుతుందట. ఇప్పటి వరకు  ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాపై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

 ఇదిలా ఉంటే షారుఖ్ ఖాన్ ప్రస్తుతం సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తన తాజా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు పఠాన్ పేరును ఖరారు చేశారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్, అడ్వేంచర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో జాన్ అబ్రహం, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటిస్తుండగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ కీలక నిర్ణయం.. వ్యాక్సిన్ కోసం కొత్త పద్ధతి..

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన రికార్డ్స్ ని కొట్టిన 5 సినిమాలు

మే నెలలో OTTలో రిలీజవుతున్న సినిమాలివే!

ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పన్నా .... ??

బ్రహ్మచారి 'దేవి' పెళ్లికి మహూర్తం ఎప్పుడో..?

టీఎన్‌ఆర్‌ జీవిత విశేషాలు ఇవే..!

TNR మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>