MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/doctor-kaaboyi-actor-iena-sreemukhi-kanranm-adhebac0a5b5-37ad-465e-8a90-354c8e79b586-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/doctor-kaaboyi-actor-iena-sreemukhi-kanranm-adhebac0a5b5-37ad-465e-8a90-354c8e79b586-415x250-IndiaHerald.jpgచాలామంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, నటీమణులు సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఉన్నత చదువులు చదివి, ఉన్నత స్థానంలో ఉండాలని ఎన్నో కలలు కంటూ, వాటిని సాకారం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ అనుకోకుండా వీరిని అదృష్టం తలుపు తడితే, ఇక ఆ కలలను మధ్యలోనే ఆపుకొని, వచ్చిన అదృష్టం వైపు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి కోవకు చెందిన వారే సాయి పల్లవి, శ్రీముఖి. ఇక వీరిద్దరూ డాక్టర్లు కావాలనుకున్నారు. కానీ యాక్టర్లు కావాల్సి వచ్చింది. అప్పట్లో సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు ఎంబీబీఎస్ చదివHBD శ్రీముఖి;bhama;rani;sreemukhi;degree;film industry;industry;doctor;father;sai pallaviడాక్టర్ కాబోయి యాక్టర్ అయిన శ్రీముఖి. కారణం ఇదే !డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన శ్రీముఖి. కారణం ఇదే !HBD శ్రీముఖి;bhama;rani;sreemukhi;degree;film industry;industry;doctor;father;sai pallaviMon, 10 May 2021 12:00:00 GMT
చాలామంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, నటీమణులు సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఉన్నత చదువులు చదివి, ఉన్నత స్థానంలో ఉండాలని ఎన్నో కలలు కంటూ, వాటిని సాకారం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ అనుకోకుండా వీరిని అదృష్టం తలుపు తడితే, ఇక ఆ కలలను మధ్యలోనే ఆపుకొని, వచ్చిన అదృష్టం వైపు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి కోవకు చెందిన వారే సాయి పల్లవి, శ్రీముఖి. ఇక వీరిద్దరూ డాక్టర్లు కావాలనుకున్నారు. కానీ యాక్టర్లు కావాల్సి వచ్చింది. అప్పట్లో సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు ఎంబీబీఎస్ చదివి, డాక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నదట. అలాగే మరొకవైపు డాన్సర్ అవ్వాలని కూడా ఉండేదట. అలా ఒకవైపు చదువు, మరొక వైపు డాన్స్ ను కూడా బాగా నేర్చుకుంది. ఇక ఈ టీవీలో ప్రసారమైన ఢీ షో లో కూడా కంటెస్టెంట్ గా చేసింది. ఇక ఇందులో విజయం సాధించడంతో ఈమెకు వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అలా తను డాక్టర్ కావాలన్న కోరికలను మధ్యలోనే ఆపుకొని , యాక్టర్ గా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో చలామణి అవుతోంది ఈ హైబ్రిడ్ పిల్ల.

ఇక ఇదే కోవలోనే యాంకర్  శ్రీముఖి కూడా నడిచింది. ఈమె కూడా పదవ తరగతి, ఇంటర్మీడియట్లో 90% పైగా మార్కులు సాధించి, వైద్య విద్యను అభ్యసించాలని అనుకుందట. ఇక అందుకు తగ్గట్టుగానే బీడీఎస్ లో సీటు కూడా సంపాదించుకుంది. కానీ అనుకోకుండా బుల్లితెర రూపంలో ఈమెకు అదృష్టం తలుపు తట్టింది. ఇక తన కలలను పక్కనపెట్టి, యాక్టింగ్ రంగం లోకి ప్రవేశించింది శ్రీముఖి. ఇక ప్రస్తుతం ఇప్పుడు స్టార్ యాంకర్ గా బుల్లితెరపై  చక్రం తిప్పుతోంది.

ఈమె మొదట్లో రెండు ప్రోగ్రామ్లకు యాంకర్ గా వ్యవహరించి, ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది .కొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్ గా చేస్తూ ,మరికొన్ని సినిమాల్లో కథానాయికగా నటించింది. ఇక పెద్ద పెద్ద హీరోలకు చెల్లెలు క్యారెక్టర్ లో కూడా నటించింది శ్రీముఖి. స్వతహాగా ఈమె తల్లి బ్యూటీషియన్ కావడంతో ఈమెకు మోడల్ పైన కొంచెం పట్టు కూడా ఉండేది. అందుకే ఈమె తన అందచందాలతో సినీ ఇండస్ట్రీలో రాణించడానికి ఒక కారణమైందని చెప్పవచ్చు. ఇక తన తండ్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా పని చేయడం వలన ఈమెకు చదువుపై అత్యంత మక్కువ ఏర్పడింది. అయితే ఈమెకు ఎన్ని కలలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ,బుల్లితెరపై యాంకర్ గా ఏకచ్ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పుతోంది ఈ అందాల భామ..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వెండి తెర మీదా తళుక్కున మెరిసిన పరిటాల శ్రీరాం ?

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!

బ్రేకింగ్: కరోనాతో జర్నలిస్ట్ TNR కన్నుమూత..!!

విజయవాడ వాసులకు వాక్సినేషన్ వాయిదా

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>