PoliticsKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/etela-rajender5c327cb9-95dc-46f7-91a9-35e4b9b56bb0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/etela-rajender5c327cb9-95dc-46f7-91a9-35e4b9b56bb0-415x250-IndiaHerald.jpgతెలంగాణలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు, కే‌సి‌ఆర్ సర్కారుకు మద్య రగడ కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో భూకబ్జాలకు పాల్పడుతూ అక్రమ ఆస్తులు సంపాధించడంటూ ఈటెలను మంత్రి వర్గం నుండి కే‌సి‌ఆర్ సర్కార్ బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈటెల బాధ్యత వహించే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను కూడా సి‌ఎం కే‌సి‌ఆర్ తనకు అటాచ్ చేసుకున్నారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలపై ఈటెల కూడా గట్టిగానే స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని ఈటెల మండి పడ్డారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరEtela rajender;view;రాజీనామా;mla;minister;election;letter;etela rajender;partyఈటెల వర్సెస్ కే‌సి‌ఆర్ వ్యూహాలకు.. కరోనా బ్రేకులు !!ఈటెల వర్సెస్ కే‌సి‌ఆర్ వ్యూహాలకు.. కరోనా బ్రేకులు !!Etela rajender;view;రాజీనామా;mla;minister;election;letter;etela rajender;partyMon, 10 May 2021 17:15:01 GMT తెలంగాణలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు, కే‌సి‌ఆర్ సర్కారుకు మద్య రగడ కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో భూకబ్జాలకు పాల్పడుతూ అక్రమ ఆస్తులు సంపాధించడంటూ ఈటెలను మంత్రి వర్గం నుండి కే‌సి‌ఆర్ సర్కార్ బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈటెల బాధ్యత వహించే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను కూడా సి‌ఎం కే‌సి‌ఆర్ తనకు అటాచ్ చేసుకున్నారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలపై ఈటెల కూడా గట్టిగానే స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని ఈటెల మండి పడ్డారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపిస్తే తను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్దమని ఈటెల ప్రకటించారు.

కాగా అటు కే‌సి‌ఆర్ కూడా ఈటెల యొక్క పార్టీ సభ్యత్వం రద్దు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈటెలను మంత్రి పదవి నుండి క్షణాల్లో తొలగించిన కే‌సి‌ఆర్ పార్టీ సభ్యత్వం రద్దు చెయ్యడంలో మాత్రం మౌనం వహిస్తున్నాడు. అయితే కే‌సి‌ఆర్ మౌనం పై రాజకీయ విశ్లేషకులు తమ వాదనను వినిపిస్తున్నారు. ఈటెల వంటి బలమైన నేతను పార్టీ నుండి తొలగిస్తే దాని ప్రభావం పార్టీ పై పడే అవకాశం ఉందని అందువల్ల ఈటెల తనంతట తానే పార్టీని వీడేటట్లుగా కే‌సి‌ఆర్ పద్మవ్యూహాలు రచించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈటెల విషయానికొస్తే హుజూరాబాద్ ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

ఒకవేళ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఈ కరోనా టైమ్ లోనే బై ఎలక్షన్స్ రావడం ఖాయం. దాంతో కరోనా తీవ్రంగా విజృంబిస్తున్న ఇలాంటి సందర్బంలో తన రాజీనామా ప్రజల ఆరోగ్యంపై పడే అవకాశం ఉందని, అందువల్లే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈటెల మౌనం వహిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా ఈటెల ప్రజల్లోకి వెళ్ళేందుకు కూడా ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేనందున ఈటెల తదుపరి కార్యచరణపై నోరు మెదపడం లేదని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికి అటు కే‌సి‌ఆర్ వ్యూహాలకు, ఇటు ఈటెల రాజేందర్ ప్రణాళికలకు కరోనా గట్టిగానే బ్రేకులు వేసిందని చెప్పాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ శాకినీ, ఢాకినీలైనా ఆ డైరెక్టర్‌ను కాపాడతారా..?

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!

ఆ అజాగ్రత్తే NTR కరోనాకు కారణమా..??

బ్రేకింగ్ : జూ. ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ ..!

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన రికార్డ్స్ ని కొట్టిన 5 సినిమాలు

మే నెలలో OTTలో రిలీజవుతున్న సినిమాలివే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>