PoliticsSpydereditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/poloitical-parties-and-leaders-decisionsc2475c71-3a1d-4716-94e3-3aa3f389771b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/poloitical-parties-and-leaders-decisionsc2475c71-3a1d-4716-94e3-3aa3f389771b-415x250-IndiaHerald.jpgక‌ర్ణాట‌క రాష్ట్రంలో క‌రోనా విల‌య‌తాండవం చేస్తోంది.కరోనా కట్టడికి సోమ‌వారం నుంచి ఈనెల 24 వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. 14 రోజులపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రకటించిన రాష్ట్ర ప్ర‌భుత్వం, కర్ఫ్యూ విఫలం కావడం వల్లే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూ విధించినప్పటికీ కొవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. కర్ఫ్యూ విజయవంతం కాకపోవడంతోనే లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. లాక్‌డౌన్ సందర్భంగా కర్ణాటక వcorona;amala akkineni;karnataka - bengaluru;chief minister;mla;local languageకరోనా ఉంటే ఇంటికి తెల్ల‌జెండా.... ఆ ఎమ్మెల్యే వినూత్న ఆలోచ‌న‌కరోనా ఉంటే ఇంటికి తెల్ల‌జెండా.... ఆ ఎమ్మెల్యే వినూత్న ఆలోచ‌న‌corona;amala akkineni;karnataka - bengaluru;chief minister;mla;local languageMon, 10 May 2021 09:25:16 GMTక‌ర్ణాట‌క రాష్ట్రంలో క‌రోనా విల‌య‌తాండవం చేస్తోంది.కరోనా కట్టడికి సోమ‌వారం నుంచి ఈనెల 24 వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. 14 రోజులపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రకటించిన రాష్ట్ర ప్ర‌భుత్వం, కర్ఫ్యూ విఫలం కావడం వల్లే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూ విధించినప్పటికీ కొవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. కర్ఫ్యూ విజయవంతం కాకపోవడంతోనే లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. లాక్‌డౌన్ సందర్భంగా కర్ణాటక వ్యాప్తంగా అన్ని హోటళ్లు, పబ్‌లు, బార్లు మూతపడనున్నాయి.


ఇదిలా ఉండ‌గా  గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 47,930 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. రికార్డుస్థాయిలో మరో 490 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో వృద్ధులతో పాటు యువత, మధ్యవయస్కులు అధికంగా ఉండడం ఆందోళనకర పరిణామం. ఇక 31,796 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కేసులు 19,34,378 కి చేరగా, 13,51,097 మంది కోలుకున్నారు. మరణాలు 18,776 కి పెరిగాయి. 5,64,485 మంది కరోనాతో చికిత్స తీసుకుంటున్నారు.  ఒక్క బెంగ‌ళూరులోనే ఉద్యాననగరిలో తాజాగా 20,897 కేసులు, 15,000 డిశ్చార్జిలు, 281 మరణాలు నమోదయ్యాయి.  పాజిటివ్‌లు 9,50,893, డిశ్చార్జ్‌లు 5,92,465 కాగా, మరణాలు 8,057కి చేరాయి.  
3,50,370 మంది చికిత్స పొందుతున్నారు.  


మైసూరులోని కృష్ణరాజ నియోజకవర్గంలో కరోనా రోగుల ఇంటి ముందు తెల్లజెండాను అమర్చడం ఆస‌క్తి రేపుతోంది. ఎమ్మెల్యే ఎస్‌ఏ రామదాస్ వినూత్న ఆలోచ‌న‌తో చేప‌ట్టిన ఈ కార్య‌క్ర‌మానికి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ఆదివారం ప్రారంభించారు. బాధితులకు మాస్కులు, సోప్, నిమ్మకాయలు, పసుపు, డిజిటల్‌ థర్మామీటర్, విటమిన్‌ సీ ట్యాబ్లెట్ల కిట్‌లను అందజేశారు. ప్రజలను అప్రమత్తం చేయడానికి బాధితుల ఇంటికి తెల్లజెండాను అతికిస్తున్నట్లు పేర్కొన్నారు. మిగ‌తా వారు కూడా అల‌ర్ట్‌గా ఉంటార‌ని, చైత‌న్యం పెంపొందించేందుకే ఇలా చేస్తున్న‌ట్లు చెప్పారు. కోవిడ్ బాధితుల‌కు స్థానికుల నుంచి కూడా సాయం అందేలా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాహుబలి ఉన్నా రాధేశ్యామ్ కరోనా కు భయపడుతున్నారా?

జూనియర్ పుట్టినరోజు పై రాజమౌళికి పెరిగిపోతున్న టెన్షన్ !

పుదుచ్చేరి ముఖ్యమంత్రి కి కరోనా

షాకింగ్ : ఈటలతో టచ్‌లో ఇప్పటికే ఇద్దరు మంత్రులు..?

వైరస్ విషయంలో టార్గెట్ వైసీపీ..

స్టే హోమ్.. స్టే సేఫ్ : అప్పుడే చెప్పిన ఓ మహాభారత కథ...!

హెరాల్డ్ ఎడిటోరియల్ : కమల్ కు విషయం అర్ధమైపోయిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>