PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sajjala36e5d591-8c0f-458d-b3cc-a61eb0edd0df-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sajjala36e5d591-8c0f-458d-b3cc-a61eb0edd0df-415x250-IndiaHerald.jpgజగన్ ని విపక్షాలు విమర్శించడం అలవాటు అయిన వ్యవహారమే. సరే ఎవరు జగన్ ని ఏమన్నా కూడా ఆయన మీడియా ముందుకు రారు. సమాధానం కూడా చెప్పరు. మరి ఆయన తరఫున వకాల్తా పుచ్చుకునే వారు ఉంటారు. వారే మీడియాతో మాట్లాడుతూ ప్రత్యర్ధులకు చెడుగుడు ఆడతారు. sajjala;raghu;tara;jagan;andhra pradesh;mp;government;media;tdp;ycp;lokesh kanagaraj;vజగన్ కుడిభుజం టార్గెట్... ?జగన్ కుడిభుజం టార్గెట్... ?sajjala;raghu;tara;jagan;andhra pradesh;mp;government;media;tdp;ycp;lokesh kanagaraj;vMon, 10 May 2021 19:00:00 GMTజగన్ ని విపక్షాలు విమర్శించడం అలవాటు అయిన వ్యవహారమే. సరే ఎవరు జగన్ ని ఏమన్నా కూడా ఆయన మీడియా ముందుకు రారు. సమాధానం కూడా చెప్పరు. మరి ఆయన తరఫున వకాల్తా పుచ్చుకునే వారు ఉంటారు. వారే మీడియాతో మాట్లాడుతూ ప్రత్యర్ధులకు చెడుగుడు ఆడతారు.

అలాంటి వారిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఒకరు. ఆయన మీద ఇపుడు విపక్షం గట్టిగానే చూపు సారించింది. ఆయన్ని బాగానే టార్గెట్ చేస్తోంది. చంద్రబాబు నుంచి చినబాబు వరకూ ఎవరు వైసీపీ సర్కార్ మీద విమర్శలు చేసినా సజ్జల వెంటనే  ఎంటర్ అవుతారు. వారి మీద తనదైన శైలిలో బాణాలు వేస్తారు. ఇలా చాలా కాలంగా కధ సాగుతోంది. అయితే ఇపుడు జగన్ ని  వదిలేసి సజ్జల మీద అంతా పడిపోయారు. అసలు ఎవరీ సజ్జల. ఈయన స్థాయి ఏంటి, జగన్ లేకపోతే ఈయన పరిస్థితి ఏంటి అంటూ ఈ మధ్యనే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలే చేశారు. అంతకు ముందు చినబాబు లోకేష్ కూడా మా మీద విమర్శలు చేయడానికి సజ్జల ఎవరు అంటూ విరుచుకుపడ్డారు.

ఇపుడు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు అయితే సజ్జల మీద ఏకంగా హాట్ హాట్ కామెంట్స్ చేశారు. హద్దుల్లో ఉండమంటూ హెచ్చరికలూ జారీ చేశారు. నీవు ఒక జర్నలిస్టువి మాత్రమే అంటూ సజ్జల గురించి కూడా వాస్తవాలు చెప్పేశారు. మా జోలికి రావద్దు అంటూ గట్టిగా గర్జించారు కూడా. మొత్తానికి చూస్తే సజ్జల రామక్రిష్ణారెడ్డి అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో కూడా అత్యంత కీలకం అయిపోయారు. ఆయన మాటే మీడియాలో వైసీపీ వాయిస్ గా వినిపిస్తుంది. ఒక విధంగా జగన్ కి కుడి భుజంగా ఆయనను  చెబుతారు. ఇపుడు ఆయన టార్గెట్ అయ్యారు. మరి ఈ రాజకీయ కధ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాల్సిందే.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అభిరామ్ సినిమాలో శ్రీరెడ్డి ఎపిసోడ్ ..!

ఆరోజు బాక్సాఫీస్ బ్రేక్ అవ్వడం .... థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం .... !!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!

ఆ అజాగ్రత్తే NTR కరోనాకు కారణమా..??

బ్రేకింగ్ : జూ. ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ ..!

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన రికార్డ్స్ ని కొట్టిన 5 సినిమాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>