MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_gossips/tollywood-gossips-14a533c6-3b12-48be-9b19-a84ec035e66c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_gossips/tollywood-gossips-14a533c6-3b12-48be-9b19-a84ec035e66c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటించగా వేణుశ్రీరాం దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ ఒక కీలకమైన పాత్ర చేసారు. అయితే ఈ మూవీ తర్వాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ తోపాటు హరిహర వీరమల్లు మూవీ కూడా చేస్తున్నారు. pawankalyan-harishshasnkar;pawan;venkatesh;rana;nidhhi agerwal;prakash raj;shruti;shruti haasan;devi sri prasad;geetha;harish shankar;kalyan;nidhi;pawan kalyan;prasad;raj;rana daggubati;shankar;sruthi;thaman s;venu;tollywood;cinema;sangeetha;festival;remake;thief;daggubati venkateswara rao;heroine;traffic police;success;mythri movie makers;sri venkateshwara creations;gabbar singh;donga;dil;venu thottempudiపవన్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఆయన మీదనే .... ??పవన్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఆయన మీదనే .... ??pawankalyan-harishshasnkar;pawan;venkatesh;rana;nidhhi agerwal;prakash raj;shruti;shruti haasan;devi sri prasad;geetha;harish shankar;kalyan;nidhi;pawan kalyan;prasad;raj;rana daggubati;shankar;sruthi;thaman s;venu;tollywood;cinema;sangeetha;festival;remake;thief;daggubati venkateswara rao;heroine;traffic police;success;mythri movie makers;sri venkateshwara creations;gabbar singh;donga;dil;venu thottempudiMon, 10 May 2021 19:00:00 GMTటాలీవుడ్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటించగా వేణుశ్రీరాం దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ ఒక కీలకమైన పాత్ర చేసారు. అయితే ఈ మూవీ తర్వాత ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్ తోపాటు హరిహర వీరమల్లు మూవీ కూడా చేస్తున్నారు.

ఇక అయ్యప్పనుం కోషియం రీమేక్ మూవీ విషయానికి వస్తే సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ పోలీస్ అధికారిగా నటిస్తుండగా రానా దగ్గుబాటి ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరికొద్ది నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం నిర్మాతగా రూపొందుతున్న హరిహర వీరమల్లు మూవీలో పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల దొంగ పాత్ర చేస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కూడా చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకోగా దీనిని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు దర్శకనిర్మాతలు. ఇక ఈ సినిమాల అనంతరం గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ ఒక భారీ ప్రతిష్టాత్మక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. నిజానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆశలు అన్ని కూడా ఈ సినిమాపై ఎంతో భారీగా ఉన్నాయని చెప్పాలి. తప్పకుండా గబ్బర్ సింగ్ ని మించేలా మరింత భారీ స్థాయిలో సక్సెస్ కొట్టేలా హరీష్ శంకర్ ఈ సినిమాని తీస్తారని వారు భావిస్తున్నారు. అయితే దర్శకుడు హరీష్ శంకర్సినిమా స్టోరీ తో పాటు పవర్ స్టార్ క్యారెక్టర్ ని కూడా ఎంతో అద్భుతంగా రాసుకున్నారని ముఖ్యంగా ఈ మూవీలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్, యాక్షన్, ఫైట్స్ అత్యద్భుతంగా ఉండనున్నాయని సమాచారం. మరి అదే కనుక నిజమైతే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇంతకంటే పండుగ వార్త మరొకటి ఉండదనే చెప్పాలి..... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అభిరామ్ సినిమాలో శ్రీరెడ్డి ఎపిసోడ్ ..!

జగన్ కుడిభుజం టార్గెట్... ?

ఆరోజు బాక్సాఫీస్ బ్రేక్ అవ్వడం .... థియేటర్స్ షేక్ అవ్వడం ఖాయం .... !!

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!

ఆ అజాగ్రత్తే NTR కరోనాకు కారణమా..??

బ్రేకింగ్ : జూ. ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>