PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ambulanceedf62d61-4e5f-494a-94e2-1dbe740bfdf4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ambulanceedf62d61-4e5f-494a-94e2-1dbe740bfdf4-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ నుంచి కరోనా చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తున్న వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశం మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పందించారు. చికిత్స కోసం హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటే ముందుగానే హైదరాబాదులో ఉన్న ఆసుపత్రి యాజమాన్యం నుంచి అనుమతి తీసుకోవాలని వారు పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సైతం కరోనా చికిత్స అందించే హాస్పిటల్స్ చాలా ఉన్నాయని చికిత్స కోసం హైదరాబాద్ వరకు తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదని వారు సూచిస్తున్నారు. ఈ ఉదయం నుంచి తెలంగాణ బోర్డర్ లో ఒక చెక్ పోస్hyderabad;yajamanya;hyderabad;andhra pradesh;telangana;district;police;suryapeta;cheque;kodadచికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాలా ? ఇలా చేయండి!చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాలా ? ఇలా చేయండి!hyderabad;yajamanya;hyderabad;andhra pradesh;telangana;district;police;suryapeta;cheque;kodadMon, 10 May 2021 17:10:32 GMTఆంధ్రప్రదేశ్ నుంచి కరోనా చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తున్న వారిని తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశం మీద ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పందించారు. చికిత్స కోసం హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటే ముందుగానే హైదరాబాదులో ఉన్న ఆసుపత్రి యాజమాన్యం నుంచి అనుమతి తీసుకోవాలని వారు పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సైతం కరోనా చికిత్స అందించే హాస్పిటల్స్ చాలా ఉన్నాయని చికిత్స కోసం హైదరాబాద్ వరకు తీసుకు వెళ్లాల్సిన అవసరం లేదని వారు సూచిస్తున్నారు. 


ఈ ఉదయం నుంచి తెలంగాణ బోర్డర్ లో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన తెలంగాణ పోలీసులు అంబులెన్స్ లో హైదరాబాద్ కరోనా చికిత్స కోసం వెళుతున్న అందరిని వెనక్కి తిప్పి పంపుతున్నారు. ఒకవేళ హైదరాబాద్ ఆసుపత్రుల నుంచి అనుమతులు గనుక పొందితే అప్పుడు వారిని హైదరాబాద్ తరలించేందుకు అనుమతిస్తున్నారు. కేవలం సాధారణ వాహనాలు, అలాగే గూడ్స్ వాహనాలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అనుమతిస్తున్నారు. 


ప్రైవేట్‌ అంబులెన్స్‌లలో వచ్చేవారికి షరతులతో అనుమతులు జారీ చేస్తున్నట్లు ఏపీ పోలీసులు చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు, కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద ఆ రాష్ట్ర పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. కొవిడ్‌ రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ శాకినీ, ఢాకినీలైనా ఆ డైరెక్టర్‌ను కాపాడతారా..?

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!

ఆ అజాగ్రత్తే NTR కరోనాకు కారణమా..??

బ్రేకింగ్ : జూ. ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ ..!

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన రికార్డ్స్ ని కొట్టిన 5 సినిమాలు

మే నెలలో OTTలో రిలీజవుతున్న సినిమాలివే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>