PoliticsSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-bail-cancilation-case-is-interesting-1e550924-caf9-4ae3-9249-efe67bf17bf0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-bail-cancilation-case-is-interesting-1e550924-caf9-4ae3-9249-efe67bf17bf0-415x250-IndiaHerald.jpgఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద సీబీఐ కేసులు ఉన్న సంగతి విధితమే. పదేళ్ళుగా ఈ కేసులతో జగన్ న్యాయం పోరాటం చేస్తున్నారు. ఇక జగన్ కి 2013 సెప్టెంబర్ లో బెయిల్ లభించింది. ఇప్పటికి ఎనిమిదేళ్ళుగా ఆయన బెయిల్ మీదనే ఉంటున్నారు. jagan;raghu;jagan;andhra pradesh;mp;court;chief minister;cbi;septemberజగన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా... ?జగన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా... ?jagan;raghu;jagan;andhra pradesh;mp;court;chief minister;cbi;septemberMon, 10 May 2021 16:44:13 GMTఏపీ ముఖ్యమంత్రి జగన్ మీద సీబీఐ కేసులు ఉన్న సంగతి విధితమే. పదేళ్ళుగా ఈ కేసులతో జగన్ న్యాయం పోరాటం చేస్తున్నారు. ఇక జగన్ కి 2013 సెప్టెంబర్ లో బెయిల్ లభించింది. ఇప్పటికి ఎనిమిదేళ్ళుగా ఆయన బెయిల్ మీదనే ఉంటున్నారు.

ఇక ఈ మధ్యలో జగన్ ఏపీ అసెంబ్లీలో విపక్ష నేతగా వ్యవహరించారు. అలాగే  గత రెండేళ్ళుగా సీఎం గా కూడా ఉంటున్నారు. మరో వైపు పాదయాత్రలో జగన్ ఉంటూ కూడా ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరు అయ్యేవారు. ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఇక సీఎం అయ్యాక జగన్ కోర్టుకు వెళ్ళడంలేదని, విచారణకు సహకరించడంలేదని ఆరోపిస్తూ ఆయన పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణంరాజు సీబీఐ కోర్టులో బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.

దాని మీద ఈ నెల 7న విచారణ జరగగా కౌంటర్ దాఖలు చేయడానికి తమకు మరికొంత వ్యవధి కావలని జగన్ తరఫున న్యాయవాదులు కోరారు. అదే సమయంలో సీబీఐ కూడా గడువు కోరడమే ఇక్కడ విశేషం అదే అసలైన  చర్చ కూడా. ఇప్పటికే జగన్ కేసుల విషయంలో సీబీఐ గతంలో మాదిరిగా చురుకుగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు ఉన్న పరిస్థితుల్లో సీబీఐ ఈ బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో కౌంటర్ దాఖలు గడువు కావాలని కోరడం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన  చర్చ సాగుతోంది.

మరో వైపు ఈ నెల 17న జరిగే విచారణలో జగన్ తరఫున న్యాయవాదులు ఏ విషయాన్ని ప్రస్తావిస్తారు అన్నది కూడా అసక్తికలిగించే అంశమే. జగన్ బెయిల్ షరతులను ఏ విధంగాను ఉల్లఘించలేదని వారు ఎలా సమర్ధవంతమైన వాదన వినిపిస్తారు అన్నది కూడా చూడాలి. ఇక సీబీఐ 17న జరిగే విచారణలో తన కౌంటర్ లో ఏం చెబుతుంది అన్నది కూడా ఇంటెరెస్టింగ్ మ్యాటర్ గానే ఉంది. మొత్తం మీద చూసుకుంటే సీబీఐ జగన్ కేసుల విషయంలో గతంలో మాదిరిగా దూకుడు చూపిస్తుందా లేదా అన్న అంశం కనుక తేలితే తప్ప బెయిల్ వ్యవహారం కధ తేలదు అంటున్నారు. మొత్తానికి జగన్ చుట్టూ ఉచ్చు బిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ శాకినీ, ఢాకినీలైనా ఆ డైరెక్టర్‌ను కాపాడతారా..?

30 దాటిన పెళ్లి పీటలు ఎక్కని టాలీవుడ్ హీరోలు

మంత్రి పదవి వచ్చేవరకు రోజా మళ్ళీ అదే పని...!!

ఆ అజాగ్రత్తే NTR కరోనాకు కారణమా..??

బ్రేకింగ్ : జూ. ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ ..!

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో అరుదైన రికార్డ్స్ ని కొట్టిన 5 సినిమాలు

మే నెలలో OTTలో రిలీజవుతున్న సినిమాలివే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>