PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ciber-crime-news-online-fake-apps6cf530e7-9a57-4e58-9ea0-8232e1be5ae5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ciber-crime-news-online-fake-apps6cf530e7-9a57-4e58-9ea0-8232e1be5ae5-415x250-IndiaHerald.jpgఒకపక్క కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రజలు నానా తిప్పలు పడుతుంటే ఇదే అదునుగా భావించి సైబర్ నేరగాళ్లు సైలెంట్ గా వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేస్తున్నారు. అమాయకులను మోసం చేసి లక్షల్లో డబ్బులను దోచుకుంటున్నారు నేరగాళ్లు. వాళ్ళ వలలో చిక్కి వాళ్ళు చెప్పిన యాప్స్ ను మీ మొబైల్లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే మీ ఖాతాలో డబ్బులు మాయమైనట్టే అని గుర్తు పెట్టుకోండి. మీరు గూగుల్ సెర్చ్ లో ఏదైనా కస్టమర్‌ కేర్‌ నంబర్లు వెతికేటప్పుడు జరా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తలు పాటించండి. అసలు ఆ నంబర్స్ నిజమేనా లేక అబద్దమా అని ఒకటికి రెCiber, crime, news, online, fake apps;patti;mandula;police;google;oyo;coronavirusఈ యాప్స్ విషయంలో తస్మాత్ జాగ్రత్త. !ఈ యాప్స్ విషయంలో తస్మాత్ జాగ్రత్త. !Ciber, crime, news, online, fake apps;patti;mandula;police;google;oyo;coronavirusMon, 10 May 2021 13:30:00 GMTఒకపక్క కరోనా వైరస్ మహమ్మారి వల్ల ప్రజలు నానా తిప్పలు పడుతుంటే ఇదే అదునుగా భావించి సైబర్ నేరగాళ్లు సైలెంట్ గా వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేస్తున్నారు. అమాయకులను మోసం చేసి లక్షల్లో డబ్బులను దోచుకుంటున్నారు నేరగాళ్లు. వాళ్ళ వలలో చిక్కి వాళ్ళు చెప్పిన యాప్స్ ను మీ మొబైల్లో  డౌన్‌లోడ్‌ చేసుకుంటే మీ ఖాతాలో డబ్బులు మాయమైనట్టే అని గుర్తు పెట్టుకోండి. మీరు గూగుల్ సెర్చ్ లో ఏదైనా కస్టమర్‌ కేర్‌ నంబర్లు వెతికేటప్పుడు జరా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తలు పాటించండి. అసలు ఆ నంబర్స్ నిజమేనా లేక అబద్దమా అని ఒకటికి రెండు సార్లు పరిశీలించండి అని కరోనా వేళ పెరిగిపోతున్న బాధితుల సంఖ్య ఆధారంగా సైబర్‌క్రైమ్‌ పోలీసులు ప్రజలకు కొన్ని సూచనలు జారీ చేసారు. కొన్ని రోజుల క్రితం హిమాయత్‌నగర్‌కు చెందిన రాజ్‌కుమార్‌కు బ్లూడాట్‌ కొరియర్‌లో ఓ పార్సిల్‌ డెలివరీ అవ్వవలిసి ఉండగా అది సమయానికి రాలేదు. ఎందుకు రాలేదో తెలుసుకోవడానికి బ్లూడాట్‌ కొరియర్‌కు సంబంధించిన నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేశాడు. అందులో లభించిన ఓ నంబర్‌కు ఫోన్‌ చేశాడు.


 ఇంకేముంది తాము బ్లూడాట్‌ కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులమంటూ మాట్లాడిన సైబర్‌నేరగాళ్లు బాధితుడితో ఎనీడెస్క్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి మీ ఖాతాకు మేం డబ్బులు పంపిస్తామంటూ నమ్మించి అతడి ఖాతాలో ఉన్న రూ. 2.37 లక్షలు కాజేశారు. అలాగే కొవిడ్‌ కారణంగా చాలామంది ఆన్‌లైన్‌ సౌకర్యాలపై ఆధారపడుతున్నారు. కానీ అదే సమయంలో తమకు అవసరమైన సమాచారం కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేస్తూ.. సైబర్‌ నేరగాళ్లు పెడుతున్న తప్పుడు నంబర్లకు ఫోన్‌ చేస్తున్నారు. తాజాగా ఆక్సిజన్‌, ఇంజక్షన్లు, ఇతరత్రా మందుల విషయంలో సైబర్‌ నేరగాళ్లు నకిలీ పోస్టులు పెడుతూ కొత్త తరహా మోసాలకు తెరలేపారు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో ఇంట్లో ఐసొలేషన్‌లో కంటే ఏదైనా రూమ్‌ తీసుకోవాలని అనుకుని ఓయో రూంల కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేశాడు.అక్కడ ఉన్న  నంబర్‌కు ఫోన్‌ చేయడంతో తాము ఓయో రూమ్స్‌ కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులమంటూ సైబర్‌నేరగాళ్లు మాట్లాడారు.రూమ్‌ బుక్‌ చేసుకోవాలంటే క్విక్‌ సపోర్టు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.బాధితుడు క్విక్‌ సపోర్టు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని కోడ్‌ చెప్పడంతో సైబర్‌నేరగాళ్లు  ఆయా ఖాతాల నుంచి రూ.3.5 లక్షలు కాజేశారు.

ఇలా నగరంలో చాలామంది మోసపోతున్నట్లు పోలీసులు తెలిపారు. ఎప్పుడయినా గూగుల్‌లో వెతికి సమాచారాన్ని తెలుసుకునేటప్పుడు అసలు మనకు లభించిన సమాచారం సదరు సంస్థదేనా కాదా పరిశీలించుకోవాలి. అలాగే డబ్బుల లావాదేవీల ప్రస్తావన వస్తే అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి యాప్‌లనూ డౌన్‌లోడ్‌ చేయకూడదు అని పోలీసులు తెలిపారు. అలాగే మీ బ్యాంకు ఖాతా వివరాలు,ఏటీఎం పిన్, డెబిట్, క్రెడిట్ కార్డ్స్ పిన్స్, ఓటీపీ లను ఎట్టి పరిస్థితులలో ఎవరికీ చెప్పకండి.అలాగే నేరగాళ్లు చెప్పినట్లు  గుడ్డిగా రిమోట్‌ యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ఇది అవగాహన లేకపోవడంతోనే జరుగుతున్నది అని కేవీఎం ప్రసాద్‌, ఏసీపీ సైబర్‌క్రైమ్స్‌ ప్రజలకు విజ్నప్తి చేసారు.. !!











Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బ్రేకింగ్: హైదరబాద్ లో భారీ అగ్నిప్రమాదం..!!

ఇంతకీ పప్పన్నం ఎప్పుడు పెడతావో చెప్పన్నా .... ??

బ్రహ్మచారి 'దేవి' పెళ్లికి మహూర్తం ఎప్పుడో..?

టీఎన్‌ఆర్‌ జీవిత విశేషాలు ఇవే..!

TNR మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు సంతాపం..!!

వెండి తెర మీదా తళుక్కున మెరిసిన పరిటాల శ్రీరాం ?

ఆ చక్రవర్తిగా మహేష్ బాబు.. ఒప్పించిన రాజమౌళి..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>